ETV Bharat / spiritual

ఉగాది పచ్చడి తినేటప్పుడు ఈ శ్లోకం తప్పక చదవండి- దీని విశిష్టత ఏంటో తెలుసా? - Ugadi Pachadi Importance - UGADI PACHADI IMPORTANCE

Ugadi Pachadi Importance : ఉగాది పండుగరోజు ప్రత్యేకంగా చేసే ఉగాది పచ్చడి అంతరార్థం తెలుసా? షడ్రుచులతో చేసే ఉగాది పచ్చడి దేనికి సంకేతం? దీంట్లో వేప పువ్వునే ఎందుకు వేస్తారు? ఇలాంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుకుసుందాం.

Ugadi Pachadi Special Story
Ugadi Pachadi Special Story
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 8, 2024, 7:34 PM IST

Updated : Apr 9, 2024, 2:01 AM IST

Ugadi Pachadi Importance : తెలుగువారికి కొత్త సంవత్సరం ఉగాది నుంచి ప్రారంభం అవుతుంది. మామూలుగా ఏ పండుగ రోజైన స్పెషల్ అంటే పిండివంటలు, గారెలు, బూరెలు, పాయసం ఉంటాయి. కానీ ఉగాది స్పెషల్ మాత్రం ఉగాది పచ్చడే! తెలుగువారికి మాత్రమే ప్రత్యేకమైన ఈ ఉగాది పచ్చడికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.

షడ్రుచుల సమ్మేళనం
మరే ప్రాంతాల్లో లేని షడ్రుచుల సమ్మేళనంగా తయారయ్యే ఉగాది పచ్చడి తెలుగువారికి మాత్రమే సొంతం. జీవితంలో వచ్చే కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలన్న సందేశం అందరికీ అందించడమే ఈ ఉగాది పచ్చడి ప్రత్యేకత. ఈ పచ్చడి తయారీలో వాడే ఒక్కో పదార్థం మనిషి జీవితంలో ఒక్కో అనుభవానికి ప్రతీక అని శాస్త్రం చెబుతోంది.

ఆరు రుచులే కీలకం
ఉగాది పచ్చడి తయారీలో తీపి, పులుపు, కారం, ఉప్పు, చేదు, వగరు అనే ఆరు రకాల రుచులు ఉంటాయి. మరి ఇందులో ఏ రుచి కోసం ఏ పదార్థాన్ని వాడుతారో ఇప్పుడు చూద్దాం.

ఉగాది పచ్చడిలో మొదటి రుచి తీపి
ఉగాది పచ్చడిలో తీపిదనం కోసం కొత్త బెల్లాన్ని వాడుతారు. బెల్లం శరీరానికి శక్తిని అందించి జీర్ణక్రియకు దోహదం చేస్తుంది. దీని మధురమైన రుచి రానున్న కొత్త సంవత్సరం మనకు సుఖసంతోషాలను అందించాలని కోరుకుంటూ బెల్లాన్ని ఉగాది పచ్చడిలో వాడుతాము.

రెండో రుచి పులుపు
Health Benefits Of Ugadi Pachadi : ఉగాది పచ్చడిలో పులుపు కోసం కొత్త చింతపండును వేస్తారు. చింతపండులోని పులుపు కఫవాతాల వల్ల వచ్చే రుగ్మతలను పోగొడుతుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. అలాగే పులుపు రుచి విసుగుకి సంకేతం. నూతన సంవత్సరంలో ఎలాంటి పరిస్థితిలోనూ విసుగు చెందకుండా నేర్పుగా ఉండాలన్న సంకేతం మనకు ఈ పులుపు రుచి నేర్పిస్తుంది.

మూడో రుచి కారం
ఉగాది పచ్చడిలో కారం కోసం పచ్చి మిరపకాయలు లేదా మిరప్పొడిని వాడతారు. కారం మనిషి శరీరంలోని హానికారక క్రిములను నాశనం చేసి పంచేంద్రియాలు చురుగ్గా పనిచేయడానికి దోహదపడుతుందని చెబుతారు. కారం కఠినమైన పరిస్థితులకు సంకేతం. కొత్త సంవత్సరంలో జీవితంలో ఎదురయ్యే కఠినమైన పరిస్థితులను ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలన్న సంకేతం ఉగాది పచ్చడిలోని ఈ కారం సూచిస్తుంది.

నాలుగో రుచి ఉప్పు
ఉగాది పచ్చడిలోని నాలుగో రుచి ఉప్పు. దీనికోసం సముద్రపు ఉప్పును లేదా సైంధవ లవణాన్ని వాడుతారు. ఉప్పు మనిషికి ఉత్సాహాన్ని, శక్తిని ఇస్తుంది. 'ఉప్పు లేని కూర చప్పనగును' అని కవులు కూడా వర్ణిస్తారు. ఉప్పు లేకపోతే జీవితమే నిస్సారంగా ఉంటుంది. ఉగాది పచ్చడిలో ఉప్పు రుచి కొత్త సంవత్సరంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే నూతన ఉత్సాహంతో, ఉత్తేజంతో ఉండాలన్న స్ఫూర్తిని అందిస్తుంది.

ఐదవ రుచి చేదు
ఉగాది పచ్చడిలో చేదు కోసం లేత వేపపువ్వును వాడుతారు. వేపపువ్వు ఋతువులు మారడం వలన కలిగే అనేక రోగాలను తరిమి కొడుతుంది. చేదు రుచి రానున్న సంవత్సరంలో జీవితంలో కలిగే బాధలకు, దుఃఖానికి సంకేతంగా నిలుస్తుంది. అప్పుడప్పుడు జీవితానికి చేదు అనుభవాలు కూడా అవసరమే కదా! చేదు అనుభవాలను పాఠాలుగా తీసుకొని ముందుకెళ్లాలన్న సంకేతమే ఉగాది పచ్చడిలోని చేదు రుచి తెలియజేస్తుంది.

ఆరో రుచి వగరు
ఉగాది పచ్చడిలో వగరు రుచి కోసం అప్పుడప్పుడే వస్తున్న లేత మామిడి పిందెలను వేస్తారు. లేత మామిడి పిందెలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఉగాది పచ్చడిలో వగరు రుచి కొత్త సవాళ్లకు సంకేతం. రానున్న కొత్త సంవత్సరంలో ఎదురయ్యే సవాళ్ళకు మనల్ని సిద్ధం చేయడమే ఉగాది పచ్చడిలోని వగరు రుచి అంతరార్థం.

షడ్రుచులను సమానంగా స్వీకరిద్దాం
ఎన్నో ఔషధగుణాలున్న పై షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని ఉగాది పండుగ రోజు ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసి పరగడుపున తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆహారంలో ఉండే ఔషధ గుణాలను స్వీకరిస్తూ, జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను సమానంగా స్వీకరిస్తూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటాం.

పచ్చడి తినేటప్పుడు ఈ శ్లోకం తప్పక చదువండి!

శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖానిచ

సర్వారిష్టవినాశంచ నింబకందళ భక్షణమ్‌॥

చివరగా అందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!!

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ఆ రాశి వారు కొత్త పనులు మొదలు పెట్టొద్దు! అనారోగ్య సమస్యలు- జాగ్రత్త! - Horoscope Today April 8th 2024

ఏలినాటి శనితో బాధపడుతున్నారా? శనివారం ఈ పూజ చేస్తే దోషాలు మాయం! - shani pradosha pooja telugu

Last Updated : Apr 9, 2024, 2:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.