ETV Bharat / spiritual

శ్రీవారి సేవకు "కోటి రూపాయల" టికెట్‌ - జీవితాంతం స్వామి సేవలో! - ప్రత్యేకతలు తెలుసా? - TTD Udayasthamana Seva Details - TTD UDAYASTHAMANA SEVA DETAILS

One Crore Rupees Seva: కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడిని దర్శించుకోవాలనుకునే భక్తులెందరో. అలా వచ్చే భక్తులు శ్రీవారిని కళ్లారా చూడ్డానికి ఎన్నో రకాల ఆర్జిత సేవలు అందుబాటులో ఉన్నాయి. అలాంటి సేవల్లో ఈ ప్రత్యేకమైన సేవ కూడా ఒకటి. ఆ సేవ ఏంటి? ప్రత్యేకతలు వంటివి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

TTD Udayasthamana Seva Details
TTD Udayasthamana Seva Details (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 29, 2024, 7:29 AM IST

TTD Udayasthamana Seva Details: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం.. వేంకటేశ్వరుడిని దర్శించుకోవాలనుకునే భక్తులెందరో. అలా వచ్చే భక్తులు శ్రీవారిని కనులారా చూసి తరించేందుకు ఎన్నో రకాల ఆర్జిత సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం అందుబాటులో ఉంచుతోంది. ఒక్క నిమిషం చూసినా చాలని తపించే ఆ వెంకన్న దర్శనాన్ని.. ఓ రోజంతా కల్పిస్తోంది ఒక ప్రత్యేకమైన సేవ. అదే శ్రీవారి ఉదయాస్తమానసేవ. కోటిరూపాయలకు పైగా విలువచేసే ఈ సేవను దక్కించుకుంటే జన్మధన్యమైనట్టే! జీవితాంతం ఏడాదికోసారి స్వామిని తనివితీరా కొలవచ్చు. మరి ఈ సేవ ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

తిరుపతికి వెళ్లాలనే ఆలోచన రాగానే వెంటనే టీటీడీ వెబ్‌సైట్‌కి వెళ్లి ప్రత్యేక దర్శనానికి టికెట్లు ఉన్నాయో లేవో చూసుకుంటాం. సర్వదర్శనం, దివ్య దర్శనాలతోపాటు నిత్య, వార పూజలు, ప్రత్యేక సేవలు చాలానే అందుబాటులో ఉన్నాయి. వాటన్నింటిలో ఎంతో విశేషమైనది ఉదయాస్తమాన సేవ.

వైఖానస ఆగమం ప్రకారం నిత్యం శ్రీహరికి ఎన్నో కైంకర్యాలను నిర్వహిస్తారు. ఉదయం సుప్రభాతం నుంచి సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ వరకూ జరిగే పూజలను కనులారా వీక్షించాలని ఎందరో భక్తులూ కోరుకుంటారు. అలాంటి వారి కోసం ఒక్కో సేవలో పాల్గొనేలా విడివిడిగా టికెట్లూ ఉన్నాయి. అవి కాకుండా ప్రత్యేకంగా "‘కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే" అంటూ స్వామి సుప్రభాత సేవలో పాలు పంచుకుని, రాత్రి ఏకాంతసేవ వరకూ శ్రీనివాసుడి సకల వైభోగాలనూ తిలకించే భాగ్యాన్ని ఉదయాస్తమాన సర్వసేవ(యూఎస్‌ఎస్‌ఈఎస్‌ - USSES) రూపంలో టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది.

శ్రీవారి సేవలో అనునిత్యం తరిస్తున్న పూలదండలు - వీటి పేర్లు, కొలతలు తెలుసా?

ఎలా ఇస్తారు: తొలిసారిగా 1980ల్లో మొదలుపెట్టిన ఈ సేవా టికెట్లకు పోటీ ఎక్కువగా ఉండటంతో మధ్యలో నిలిపేశారు. ఆ తర్వాత మళ్లీ 2021లో టీటీడీ వీటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. శ్రీ పద్మావతి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి రూ.కోటి ఆ పైన విరాళాలు అందించే భక్తులకు ఈ ఉదయాస్తమానసేవా టికెట్లను కేటాయిస్తూ అప్పటి టీటీడీ ధర్మకర్తల మండలి తీర్మానం చేసింది. ఆరు రోజులూ ఈ సేవా టికెట్ల ధర రూ.కోటి ఉంటే శుక్రవారం మాత్రం కోటిన్నర రూపాయలు. ప్రస్తుతం 347 సేవా టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో శుక్రవారానికి సంబంధించిన అన్ని టికెట్లనూ భక్తులు ఇప్పటికే బుక్‌ చేసుకున్నారు.

ప్రత్యేకతలు: ఒక వ్యక్తీ లేదా సంస్థ.. ఎవరైనా ఈ టికెట్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. సంవత్సరంలో ఏదైనా ఒక తేదీని ఎంచుకుని ఏడుకొండలవాడిని దర్శించుకోవచ్చు. ఆ రోజంతా వెంకన్న సేవల్లో భాగం అవ్వొచ్చు. టికెట్‌ పొందిన భక్తులు ఆ రోజును బట్టి సుప్రభాతం, తోమాల, అర్చన, అభిషేకం, అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడసేవ, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను దర్శించొచ్చు. అలా 25 సంవత్సరాలపాటు లేదా జీవితాంతం ఏది ముందయితే అందుకు తగ్గట్టుగా ఈ టికెట్‌ను వినియోగించుకోవచ్చు. ఇందులో భక్తుడితోపాటు ఆరుగురు కుటుంబసభ్యులనూ అనుమతిస్తారు.

కంపెనీ పేరుతో పొందిన వారికి 20 సంవత్సరాల పాటు ఈ అవకాశాన్ని వాడుకునే వీలు ఉంది. ఈ సేవా టికెట్లు పొందిన వారికి స్వామికి అర్పించిన వస్త్రాలూ, ప్రసాదాలూ అందిస్తారు. టికెట్‌ పొందిన వాళ్లు ఏదైనా కారణం చేత ఆ ఏడాది రాలేకపోతే వారి కుటుంబసభ్యులను ఈ సేవకు పంపొచ్చు. ఇంకా ఒకసారి మాత్రమే కుటుంబసభ్యుల పేర్ల నమోదు, తొలగింపు, మార్పునకు అవకాశం ఉంటుంది. కంపెనీలకు ఎన్నిసార్లైనా మార్పు చేసుకునే అవకాశం ఉంది. టికెట్‌ తీసుకున్న వ్యక్తి ప్రతి సంవత్సరం లైఫ్‌ సర్టిఫికేట్‌ను అందించాల్సి ఉంటుంది. అయితే శ్రీవారి సేవల్లో మార్పులతో ఎప్పుడైనా దర్శనాన్ని రద్దు చేసే హక్కు టీటీడీకి ఉంది.

సేవా టికెట్లు పొందే విధానం: తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌కి లాగిన్‌ అయి బుక్‌ చేసుకోవచ్చు. ఒకరికి ఒకే టికెట్‌ ఇస్తారు. ఆధార్‌, పాస్‌పోర్ట్‌, పాన్‌కార్డు.. ఏదైనా గుర్తింపు కార్డు అప్‌లోడ్‌ చేయాలి. ఈమెయిల్‌ ఐడీ, మొబైల్‌ నెంబర్‌కు టీటీడీ అధికారులు పాస్‌వర్డ్‌, ఐడీని పంపుతారు. వాటి ద్వారా ఉదయాస్తమాన సేవా టికెట్‌ను పొందొచ్చు.

'తిరుమలలో అక్కడ స్నానం చేస్తే మోక్షప్రాప్తి'- 'శ్రీవారి కంటే ముందుగా ఆయనకే నైవేద్యం'

శ్రీవారి భక్తులకు అద్భుతమైన శుభవార్త - తిరుపతి లడ్డూ మీ ఊళ్లోనే లభిస్తుంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.