ETV Bharat / spiritual

సుబ్రహ్మణ్య షష్ఠి వ్రత కథ - చదివినా, విన్నా అవివాహితులకు పెళ్లి ఖాయం! - SUBRAHMANYA SASHTI 2024

సుబ్రహ్మణ్య షష్ఠి ప్రత్యేకం స్కందోత్పత్తి

Subramanyeswara Swamy
Subramanyeswara Swamy (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 6, 2024, 7:31 AM IST

Subrahmanya Sashti Vrat Katha : దక్షిణ భారతంలో సుబ్రహ్మణ్యుని విశేషంగా ఆరాధిస్తారు. ప్రతి మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి రోజు దేవాలయంలో సుబ్రహ్మణ్యుని ప్రత్యేక పూజలు జరుగుతాయి. విశేషించి మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకోవడం ఆనవాయితీ. డిసెంబర్ 7 శనివారం సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా స్కందోత్పత్తి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

మహాభారతంలో స్కందోత్పత్తి ప్రస్తావన
శివుని రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామిని కుమారస్వామి, కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్, గుహూడు అనే పేర్లతో కొలుచుకుంటూ ఉంటాము. సుబ్రహ్మణ్యుని ఆరాధనకు ద్రావిడ సంప్రదాయంలో విశిష్ట స్థానముంది. సుబ్రహ్మణ్య షష్ఠినే చంపా షష్ఠి, ప్రవార షష్ఠి, సుబ్బరాయుడు షష్ఠి, స్కంద షష్ఠి అని కూడా అంటారు. కవిత్రయంగా పేరు గాంచిన నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ రచించిన మహాభారతంలోని అరణ్యపర్వంలో స్కందోత్పత్తి గురించిన వివరణ ఉంటుంది.

స్కందోత్పత్తికి నాంది ఇలా!
పూర్వం మూడు లోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న "తారకాసురుడు" అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుని శరణు వేడారు. అప్పుడు బ్రహ్మ దేవతలతో మహా బలశాలియైన తారకాసురుని వధించగల సమర్ధుడు శివపార్వతులకు జన్మించబోయే పుత్రుడు మాత్రమే కాబట్టి మీరందరూ శివుడికి హిమవంతుని పుత్రిక అయిన పార్వతీ దేవితో వివాహం జరిపించండి. వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్ధుడు అవుతాడు అని తరుణోపాయం చెప్పాడు.

శివపార్వతుల కళ్యాణం
దేవతలు శివున్ని ఒప్పించి పార్వతితో పెళ్లి జరిపించారు. ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో ప్రణయానందగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు.

పరమశివుని దివ్యతేజం
అగ్నిదేవుడు పావురం రూపంలో రావడం గమనించిన పరమ శివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు. అగ్నిదేవుడు దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడచిపెడతాడు. ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్‌కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్ర తేజమును వారు భరించలేక రెల్లు పొదలలో విసర్జిస్తారు. అప్పుడు ఆ దివ్య తేజస్సు నుంచి ఆరు ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడు ఉద్భవిస్తాడు. అంతట షట్‌కృత్తికలు ఆ బాలునికి పాలిచ్చి పెంచి పోషించారు. ఆరు మంది నుంచి ఒకేసారి పాలు తాగడానికి ఆరు ముఖాలు ధరిస్తాడు సుబ్రహ్మణ్యుడు. అందుకే సుబ్రహ్మణ్యుని షణ్ముఖుడని పేరు వచ్చింది.

షణ్ముఖుని అక్కున చేర్చుకున్న పార్వతి పరమేశ్వరులు
కుమార సంభవం గురించి తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళ్తారు. ఆ బాలుడు గంగాగర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని, షట్‌కృత్తికలు వానిని పెంచి పెద్దచేసిన కారణం వల్ల, ఇంకా ఆరుముఖాలు కలిగి ఉన్నందున షణ్ముఖుడని, కార్తీకేయుడని, అతడు గౌరీశంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అని, సుబ్రహ్మణ్యస్వామి అని రకరకాల పేర్లతో పిలుస్తూ కొలుచుకోసాగారు.

తారకాసురునిపై సమర శంఖం
కారణజన్ముడైన ఈ బాలుని పార్వతి పరమేశ్వరులు దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి, దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమిస్తారు. పరమేశ్వరుడు "శూలం" మొదలైన ఆయుధాలను ఇవ్వగా, ఆ జగన్మాత పార్వతి కుమారుని దీవించి "శక్తి" అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుడిని చేసి తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగిస్తారు.

తారకాసుర సంహారం
సర్వ శక్తిమంతుడైన కుమారస్వామి నెమలి వాహనారూఢుడై ఆరుముఖాలు, పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనను ఒకే సారి సంహరించాలని తలచి "సర్పరూపం" దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధంలో తారకాసురుని సంహరించి విజయుడైనాడు.

దేవసేనతో వివాహము
సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహము జరిపించిన ఈ రోజును "శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి" గా జరుపుకుంటాం. ఈ రోజున "శ్రీవల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి" వారికి భక్తులు కళ్యాణోత్సవములు, సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు.

పరమ పవిత్రమైన ఈ సుబ్రహ్మణ్య షష్ఠి పండుగ రోజున స్కందోత్పత్తి కథను విన్నా, చదివినా అవివాహితులకు వివాహం జరుగుతుంది. సంతానం లేని వారికి సత్సంతానం కలుగుతుంది. అనారోగ్యంతో బాధపడే వారికి ఆరోగ్య భాగ్యం చేకూరుతాయి. ఓం శ్రీ సుబ్రహమణ్య స్వామియే నమః

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.