ETV Bharat / spiritual

ప్రతి ఆదివారం సూర్యుడికి ఇలా పూజ చేస్తే ఎంతో మంచిది- గోధుమలు దానం చేస్తే! - Spiritual Significance Of Sunday

Spiritual Significance Of Sunday : ఆదివారం సెలవు దినం. సగటు మనిషి వారమంతా పనిచేసి ఆదివారం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. నిజంగా ఆదివారం వస్తోందంటే ఎవరికైనా ఆనందమే! మరి ఆదివారాన్ని ఆధ్యాత్మిక వారమని, ఆరోగ్య వారమని అంటారు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.

Spiritual Significance Of Sunday
Spiritual Significance Of Sunday
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 17, 2024, 5:13 AM IST

Spiritual Significance Of Sunday : మన హైందవ సంప్రదాయం ప్రకారం మనం ఆదివారం రోజు సూర్య భగవానుని ప్రధానంగా ఆరాధిస్తాం. ఆదిత్యుడు అంటే ఆది దేవుడు- తొలి దేవుడు. ఈ ఆది దేవుని ఆరాధనకు ఆదివారం ప్రధానం. ఈ రకంగా సూర్యుని ఆరాధనకు ఆదివారం విశిష్టమైనది. సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత. ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అని అంటారు కదా! ఆదిత్యుని పూజించుకోడానికి ఆదివారం శ్రేష్ఠమైనదిగా పెద్దలు నిర్ణయించారు.

బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించేటప్పుడు మన భారతీయులందరు ఒకరోజు సెలవు దినం కావాలని అడిగితే వారు బాగా అలోచించి ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించారు. మిగిలిన రోజులన్నీ ఎలా ఉన్నా ఆదివారం సెలవు కదా అని బద్దకించకుండా వేకువజామునే నిద్ర లేవాలని శాస్త్రం చెబుతోంది. సూర్యోదయం తర్వాత దంతధావనం చేయరాదు. దానికి ఒక కారణం ఉంది. దక్షయజ్ఞంలో సతీదేవి అవమానింపబడి యాగాగ్నికి ఆహుతి అయిన తర్వాత ఆగ్రహోదగ్రుడైన పరమశివుడు యాగాన్ని ధ్వంసం చేస్తాడు.

అప్పుడు అకారణంగా నవ్విన సూర్యుని పరమశివుడు దండిస్తాడు. ఆ సమయంలో సూర్యుని పళ్లు ఊడిపోతాయి. అందుకే సూర్యునికి పళ్లు ఉండవంట! సూర్యునికి మెత్తని పాయసం నివేదించడం వెనుక ఉన్న రహస్యం ఇదే! అప్పటి నుంచి సూర్యోదయం తర్వాత పళ్లు తోముకుంటే సూర్యుడు తనను గేలి చేసినట్లుగా భావించి ఆగ్రహిస్తాడంట. కాబట్టి సూర్యోదయం ముందే పళ్లు తోముకోవాలని పెద్దలు చెబుతారు. ఇది ప్రధాన ఆరోగ్య రహస్యం. సూర్యుని ఆరాధనలో ముఖ్యమైన విషయం. మరి మంచి ఆరోగ్యం పొందాలంటే మంచి జీవనశైలి ఎంత అవసరమో, ఆరోగ్య ప్రదాత సూర్యుని ఆదివారం పూజించుకోవడం కూడా అంతే అవసరం.

ఆదివారాన్ని ఆధ్యాత్మిక వారంగా, ఆరోగ్య వారంగా ఇలా చేసుకుందాం!

  • ప్రధానంగా సూర్యుని ఆరాధించే వాళ్లు ఆదివారం మద్యమాంసాలు తీసుకోరాదు. వేకువనే నిద్ర లేచి తలారా స్నానం చేసి సూర్యునికి నమస్కరించి, ఆదిత్య హృదయం పఠించి, సూర్యభగవానునికి పాయసాన్ని నివేదించాలి. ఇలా నియమానుసారం ప్రతి ఆదివారం చేసినట్లయితే చక్కని ఆరోగ్యం సొంతమవుతుందని శాస్త్ర వచనం.
  • నిజానికి శాస్త్రీయ పరంగా చూసినా వేకువజామునే నిద్ర లేవడం, భగవదారాధన పేరుతో సూర్య నమస్కారాలు చేయడం కూడా యోగా లో ఒక భాగమే! సూర్యరశ్మి నుండి లభించే విటమిన్ D ఆరోగ్యానికి ఎంతో అవసరం.
  • ఏవైనా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు ఆదివారం గోధుమలు దానం చేయడం మంచిది. అలాగే తొమ్మిది ఆదివారాలు గోధుమ పిండితో తయారు చేసిన చపాతీలు గోవుకు తినిపిస్తే ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి. అయితే వైద్యుల సలహా ప్రకారం మందులు వాడుతూనే ఇవన్నీ చేయాలి.
  • మన పెద్దలు ఏది నిర్ణయించినా దాని వెనుక తప్పకుండా ఏదో ఒక శాస్త్రీయత దాగి ఉంటుంది. అందుకే ఆదివారం ఆరోగ్య వారం అని అంటారు.
  • ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదండీ! మంచి ఆరోగ్యం కోసం మంచి జీవనశైలి పాటించాలి. సూర్యుని ఆరాధన ప్రధానంగా మన జీవనశైలిని ఒక క్రమ పద్ధతిలో ఉంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరెందుకు ఆలస్యం! సూర్యుని ఆరాధిద్దాం! ఆదివారాన్ని ఆధ్యాత్మిక వారంగా, ఆరోగ్య వారంగా మార్చుకుందాం.

శనిదేవుడికి బెల్లం నైవేద్యం- ఆంజనేయుడికి ఆకుపూజ- శనివారం ఇవి చేస్తే మీ సమస్యలన్నీ క్లియర్!

హనుమంతుడు సింధూరం రంగులోనే ఉంటాడెందుకు? - ఈ ఆసక్తికర విషయం మీకు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.