ETV Bharat / spiritual

శ్రీరామనవమి రోజు ఈ పనులు అస్సలే చేయకండి - కష్టాలను కోరి తెచ్చుకున్నట్టే! - Ram Navami 2024 Dos and Donts - RAM NAVAMI 2024 DOS AND DONTS

Ram Navami 2024 Fasting Rules : దేశవ్యాప్తంగా రామభక్తులు.. 'శ్రీరామనవమి' వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. అయితే.. రామయ్యను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే ఈ రోజు కొన్ని చేయాల్సిన పనులు ఉన్నాయి. మరికొన్ని అసలే చేయకూడనివి ఉన్నాయి. ఇంతకీ ఆ పనులేంటో ఇప్పుడు చూద్దాం.

Ram Navami 2024
SRI RAMA NAVAMI
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 16, 2024, 1:39 PM IST

Ram Navami 2024 Dos and Donts : ఏటా చైత్ర మాసం శుక్ల పక్షం నవమి రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీరామనవమిని(Ram Navami 2024) జరుపుకుంటారు. ఆ ఘడియలు ఈ ఏడాది శ్రీరామనవమి ఏప్రిల్ 17 బుధవారం నాడు వచ్చాయి. ఈ వేడుకకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండడంతో.. దేశవ్యాప్తంగా ఉన్న రామ భక్తులు శ్రీరామనవమి వేడుకలను వైభంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. ఈ పవిత్రమైన రోజు చేయాల్సినవి, చేయకూడనివి కొన్ని పనులు ఉన్నాయి. ముఖ్యంగా ఉపవాసం ఉండే వారు తప్పక కొన్ని నియమాలు పాటించాలి. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

చేయవలసినవి :

  • శ్రీరామనవమి రోజున ప్రతిఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలస్నానమాచరించాలి. ఇంటిని తోరణాలతో అలంకరించాలి. కొత్త బట్టలు ధరించాలి.
  • ఆ తర్వాత శ్రీరాముడు, సీతాదేవి, హనుమంతుడు, లక్ష్మణుడు విగ్రహాలకు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించాలి. ఈ పూజలో శ్రీ సీతారాముడిని అష్టోత్తర శతనామావళితో అర్చించాలి.
  • రామచంద్రమూర్తికి ఇష్టమైన వడపప్పు, పానకాన్ని నైవేద్యంగా పెట్టి పూజ అనంతరం దాన్ని భక్తి శ్రద్ధలతో స్వీకరించాలి.
  • ఈ పవిత్రమైన రోజు ఉపవాసం చేయడం వల్ల విష్ణులోక ప్రాప్తికలుగుతుందని భక్తులు నమ్ముతారు.
  • శ్రీరామనవమి రోజున రామనామస్మరణం చేయడం, రామకోటి వంటివి రాయడంవల్ల అత్యంత పుణ్యఫలం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.
  • శ్రీరామనవమి రోజు ఉపవాసం ఉండే వారు ఆహారపు నియమాల గురించి తెలుసుకొని వాటిని పాటించినప్పుడే పుణ్య ఫలాలు దక్కుతాయని పండితులు సూచిస్తున్నారు.
  • ఈ రోజు ఉపవాసం ఉండే వారు రోజంతా హైడ్రేట్​గా ఉండడానికి తగినంత వాటర్, కొబ్బరి నీరు, పండ్ల రసాలు వంటి కొన్ని పానీయాలు తీసుకోవాలని చెబుతున్నారు.
  • అలాగే, పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని అంటే కొన్ని తాజా పండ్లు, కూరగాయలు, నట్స్, పాల ఉత్పత్తులను ఎంచుకోవాలని సూచిస్తున్నారు.

శ్రీరామనవమి రోజున ఆ జానకీ రాముడిని ఇలా పూజించండి - అష్టైశ్వర్యాలు లభిస్తాయి!

చేయకూడనివి :

  • శ్రీరామనవమి రోజు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. అదేవిధంగా ఈ పవిత్రమైన రోజు మాంసాహారాన్ని అస్సలు ముట్టుకోవద్దు.
  • కోదండరాముడిని కొలిచే ఈ రోజున.. మద్యపానం, ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండాలి.
  • శ్రీరామనవమి రోజున ఎట్టి పరిస్థితుల్లో హెయిర్ కటింగ్ చేయించుకోకూడదని పండితులు సూచిస్తున్నారు. అలా చేయడం అశుభమని చెబుతున్నారు.
  • ఇతరులను దూషించకూడదని, గొడవలు పడకూడదని, అబద్దాలు ఆడకూడదని పండితులు చెబుతున్నారు.
  • భక్తి శ్రద్ధలతో రాముడిని ఆరాధించే ఈ రోజు తయారు చేసుకునే వంటలలో అల్లం, వెల్లుల్లిని వాడకపోవడం మంచిది అంటున్నారు పండితులు. అలాగే వాటిని ఆహారంలో కలిపి తీసుకోకూడదని చెబుతున్నారు.
  • వీటితోపాటు ముఖ్యంగా శ్రీరామనవమి రోజు ఉపవాసం ఉండే వారు కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలట.
  • వాటిలో ప్రధానంగా ఉపవాసం తర్వాత ఎక్కువ కారం, ఉప్పు ఉన్న ఆహార పదార్థాలను తీసుకోకపోవడం మంచిదట. ఎందుకంటే అవి ఫాస్టింగ్ తర్వాత జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందట.

శ్రీరామనవమి - స్వామి ప్రసాదం పానకం, వడపప్పు ఇలా తయారు చేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.