Shiva Puja Vidhanam In Telugu : శివారాధనకు సోమవారం విశిష్టమైనది. మిగిలిన రోజులకన్నా సోమవారం రోజు శివయ్యను ఆరాధిస్తే శివానుగ్రహం శ్రీఘ్రంగా లభిస్తుందని భక్తుల విశ్వాసం.
శని దోషాలు పోగొట్టే శివారాధన
జాతకంలో ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని దోషాలు ఉన్నట్లయితే సోమవారం రోజు రాగి పాత్రలో గంగాజలం తీసుకొని రుద్ర మంత్ర సహితంగా శివునికి అభిషేకం చేస్తే శని దోషాల వలన కలిగే బాధలకు ఉపశమనం కలుగుతుంది. ఇలా 11 సోమవారాలు నియమనిష్టలతో చేస్తే సత్వర ఫలితం ఉంటుంది. అభిషేకం చేసే శివలింగం రావిచెట్టు కింద ఉన్నట్లయితే మరింత శ్రేష్టం.
ఈ పూజతో ఆరోగ్యమస్తు
ఎవరైనా బీపీ, షుగర్, మోకాళ్ల నొప్పులు వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేకుంటే, సోమవారం రోజు మృత్యుంజయుడైన శివయ్యను భక్తి శ్రద్ధలతో పూజిస్తే తప్పకుండా స్వస్థత చేకూరుతుంది. అది ఎలాగంటే సోమవారం రోజు ఆవు పాలు, నల్ల నువ్వులు శివయ్యకు సమర్పించాలి. అనంతరం మృత్యుంజయ మంత్రాన్ని 11 సార్లు జపించాలి. ఇలా 11 సోమవారాలు చేస్తే శివయ్య అనుగ్రహంతో అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.
కళ్యాణమస్తు
ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం కుదరక కల్యాణంలో తరచుగా ఆటంకాలు ఎదురవుతుంటే సోమవారం రోజు సూర్యోదయం సమయంలో కుంకుమ కలిపిన జలంతో శివలింగానికి అభిషేకం చేసి శివునికి ఎండుద్రాక్ష నైవేద్యంగా సమర్పించాలి. ఇలా 11 సోమవారాలు చేస్తే త్వరగా వివాహం అవుతుంది.
ఐశ్వర్యమస్తు
ఎంత కష్టపడి పని చేసినా చాలీచాలని ఆదాయం, అప్పుల బాధలు ఉంటే సోమవారం శివలింగానికి ఆవుపాలతో అభిషేకం చేసి మారేడు దళాలు సమర్పించి, బిల్వాష్టకం 11 సార్లు పఠించాలి. ఇలా 11 సోమవారాలు చేస్తే జీవితంలో ఎప్పటికీ ధనానికి లోటుండదు. అప్పుల బాధలు తీరిపోయి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది.
రాజయోగం
రాజయోగం కోరుకునేవారు సోమవారం రోజు విభూతితో శివలింగానికి అభిషేకం చేసి, అనంతరం శివలింగం పైన ఉన్న విభూతిని ఇంటికి తీసుకెళ్లి ప్రతి రాత్రి నిద్రించే ముందు నుదుటన పెట్టుకుంటే ఊహించని విధంగా ఆకస్మిక ధనలాభాలు, ఉన్నత పదవి యోగం, రాజ యోగాలు సిద్ధిస్తాయి.
చిత్తశుద్ధి ముఖ్యం
శివయ్య పూజలో చిత్తశుద్ధి ఎంతో ముఖ్యం. ఏదో ఒకలాగా మొక్కుబడిగా పూజ పూర్తి చేసి ఫలితాల కోసం ఎదురు చూడటం శుద్ధ దండగ. మనసా వాచా కర్మణా చిత్తశుద్ధితో పూజించిన వారికే సత్వర ఫలితాలు ఉంటాయి. శివుని పూజలో మనం సమర్పించాల్సిన ముఖ్యమైనది భక్తితో కూడిన మనసు. అందుకే అంటారు కదా 'చిత్తశుద్ధిలేని శివ పూజలేలరా' అని!. కాబట్టి మనం ఎంత ఘనంగా పూజ చేస్తున్నాం అన్నది ముఖ్యం కాదు ఎంత భక్తితో చేస్తున్నాం అనేది ముఖ్యం. కేవలం భక్తికి మాత్రమే పరవశించే భక్తవశంకరుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుందాం. ఓం నమః శివాయ
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
రోజూ నిద్రలేచాక అరచేతులు చూస్తూ ఆ శ్లోకం చదివితే ఎంతో మంచిది!- ఆవును చూసినా!! - Sun Rise Good Things