Rudraksha According To Nakshatra : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనకు 27 నక్షత్రాలు ఉన్నాయి. ఒక్కో నక్షత్రానికి ఒక్కో రకం రుద్రాక్ష శుభకరమని శాస్త్రం చెబుతోంది. నక్షత్రాల వారీగా ధరించవలసిన రుద్రాక్షల వివరాలు
అశ్విని : అశ్విని నక్షత్రం వారు నవముఖి అంటే తొమ్మిది ముఖాలు ఉన్న రుద్రాక్ష ధరిస్తే ఉన్నత పదవులు పొందుతారు. జీవితంలో విజయం సొంతమవుతుంది.
భరణి : భరణి నక్షత్రం వారు షణ్ముఖి అంటే ఆరు ముఖాలు ఉన్న రుద్రాక్ష ధరిస్తే శక్తి, జ్ఞానం ఆరోగ్యం సిద్ధిస్తుంది.
కృత్తికా : కృత్తికా నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్షను ధరిస్తే అఖండ ఐశ్వర్యాన్ని పొందుతారు.
రోహిణి : రోహిణి నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్షను ధరిస్తే సంతానప్రాప్తి, వ్యాపార అభివృద్ధి కలుగుతుంది.
మృగశిర : మృగశిర నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షను ధరిస్తే ధనధాన్య సమృద్ధి, సర్పదోష నివారణ అవుతుంది.
ఆరుద్ర : ఆరుద్ర నక్షత్రం వారు అష్టముఖి రుద్రాక్షను ధరిస్తే ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.
పునర్వసు : పునర్వసు నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ధరిస్తే అకాల మృత్యు దోషాలు తొలగిపోతాయి. సంపదలు కలుగుతాయి.
పుష్యమి : పుష్యమి నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్షను ధరిస్తే ఆరోగ్యం, సంపద, కీర్తి, ఉత్తేజం కలుగుతాయి.
ఆశ్లేష : ఆశ్లేష నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరిస్తే ఏకాగ్రత పెరుగుతుంది. జ్యోతిష శాస్త్రం పట్ల అవగాహన ఉంటుంది.
మఖ : మఖ నక్షత్రం వారు నవముఖి రుద్రాక్షను ధరిస్తే ఉన్నత పదవులు పొందుతారు.
పుబ్బ : పుబ్బ నక్షత్రం వారు షణ్ముఖి రుద్రాక్షను ధరిస్తే అపారమైన జ్ఞానం, సకల సంపదలు, ఆరోగ్యం సిద్ధిస్తాయి.
ఉత్తర : ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్షను ధరిస్తే ఎలాంటి దుష్ట శక్తులనైనా తిప్పికొట్టగలరు.
హస్త: హస్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధరిస్తే వంశాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి కలుగుతుంది.
చిత్త : చిత్త నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్ష ధరిస్తే ధనధాన్యాలు, ఆరోగ్యం సిద్ధిస్తాయి.
స్వాతి : స్వాతి నక్షత్రం వారు అష్టముఖి రుద్రాక్ష ధరిస్తే జ్ఞానం, ఐశ్వర్యం సిద్ధిస్తాయి.
విశాఖ : విశాఖ నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ధరిస్తే అకాలమృత్యు హరణం, గుండె సంబంధిత రోగాలు నివారణ అవుతాయి.
అనురాధ : అనురాధ నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరిస్తే సంపద, ఆయువు వృద్ధి చెందుతాయి.
జ్యేష్ఠ : జ్యేష్ఠ నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్ష ధరిస్తే సునిశిత బుద్ధి, ఏకాగ్రత పెరుగుతాయి.
మూల : మూల నక్షతరం వారు నవముఖి రుద్రాక్ష ధరిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు.
పూర్వాషాఢ : పూర్వాషాఢ నక్షత్రం వారు షణ్ముఖి రుద్రాక్ష ధరిస్తే విజయం, జ్ఞానం, కీర్తి, సంతానం సిద్ధిస్తాయి.
ఉత్తరాషాఢ : ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష ధరిస్తే సిరిసంపదలు, దైవానుగ్రహం సిద్ధిస్తాయి.
శ్రవణ : శ్రవణ నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధరిస్తే ఇష్ట కార్య సిద్ధి, ఐశ్వర్యం లభిస్తాయి.
ధనిష్ఠ : ధనిష్ఠ నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్ష ధరిస్తే సర్పదోష నివారణ, కార్యసిద్ధి కలుగుతాయి.
శతభిషం : శతభిషం నక్షత్రం వారు అష్టముఖి రుద్రాక్ష ధరిస్తే ఆకస్మిక ధనప్రాప్తి. జ్ఞానం సిద్ధిస్తాయి.
పూర్వాభాద్ర : పూర్వాభాద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ధరిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, కార్యజయం కలుగుతాయి.
ఉత్తరాభాద్ర : ఉత్తరాభాద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరిస్తే అకాల మరణం సంభవించదు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
రేవతి : రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్ష ధరిస్తే శ్రీ గాయత్రీ మాత అనుగ్రహంతో అపారమైన జ్ఞానం కలుగుతుంది.
సత్ఫలితాలు రావాలంటే ఈ నియమాలు తప్పనిసరి!
రుద్రాక్షలు ధరించిన వారు తప్పనిసరిగా కొన్ని నియమ, నిబంధనలు పాటించాలి. రుద్రాక్షలు ధరించి మద్య మాంసాలు సేవించకూడదు. తప్పనిసరిగా శుచిశుభ్రతలు పాటించాలి. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. నియమ నిష్ఠలను పాటించాలి. దంపతులు దాంపత్య సమయంలో రుద్రాక్షలు ధరించరాదు. ఈ నియమాలను ఎవరైతే పాటిస్తారో వారికి సత్ఫలితాలు కలుగుతాయి.
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
మోహిని ఏకాదశి రోజు ఈ వస్తువులు దానం చేస్తే కోరికలన్నీ తీరుతాయట! - Mohini Ekadashi Special