ETV Bharat / spiritual

రాఖీ పండుగ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎలా జరుపుకోవాలి? ఓన్లీ సొంతోళ్లకే కట్టాలా? - Rakhi Festival 2024

Rakhi Festival Significance : హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజును రాఖీ పౌర్ణమిగా జరుపుకుంటాం. రాఖీ సంప్రదాయం ఎలా వచ్చిందో కచ్చితంగా తెలియకపోయిన, అనాదిగా ఈ ఆచారం ఉందని తెలియజేయడానికి కొన్ని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Rakhi Festival 2024
Rakhi Festival 2024 (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 18, 2024, 5:27 PM IST

Rakhi Festival Significance : వ్యాస భగవానుడు రచించిన విష్ణు పురాణం ప్రకారం రాఖీ పౌర్ణమిని 'బలేవా' అని కూడా పిలుస్తారు. ఇందుకు ఓ కారణముంది. బలి చక్రవర్తి మహా విష్ణు భక్తుడు. బలి చక్రవర్తి తన అపారమైన భక్తితో విష్ణుమూర్తిని తన వద్దే ఉంచేసుకున్నాడంట! విష్ణుమూర్తి లేని వైకుంఠం వెలవెలబోయింది. ఇందుకు ఏమి చేయాలా అని అలోచించి శ్రీమహాలక్ష్మి రాఖీ పౌర్ణమి రోజు బలిచక్రవర్తికి రాఖీ కట్టిందంట! లక్ష్మీదేవి రాఖీ కట్టగానే బహుమతిగా ఏమి కావాలో కోరుకోమన్నాడంట బలి చక్రవర్తి. అప్పుడు లక్ష్మీదేవి విష్ణుమూర్తిని తనతో వైకుంఠానికి పంపించామని అడగగానే బలిచక్రవర్తి విష్ణుమూర్తిని లక్ష్మీ దేవితో వైకుంఠానికి పంపించాడంట! అలా అప్పటి నుంచి రాఖీ కట్టే సంప్రదాయం మొదలైందని ఒక కథనం.

ద్రౌపది సోదర ప్రేమ
మహాభారతం ప్రకారం ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో ద్రౌపదికి తనను రక్షించే వారు తన సోదరుడు శ్రీకృష్ణుడు మాత్రమే అని తలచి కృష్ణుని ప్రార్ధించి అవమానభారం నుంచి తప్పించుకుంది. అన్నాచెల్లెళ్ల బంధానికి గుర్తుగా ద్రౌపది శ్రీ కృష్ణునికి రాఖీ కట్టిందని కూడా అంటారు.

విష్ణుమూర్తికి రాఖీ కట్టిన శచీదేవి
మరో కథనం ప్రకారం, స్వర్గాధిపతి ఇంద్రుని ఇంటిపై ఓ రాక్షసి దాడి చేసి ఆక్రమించుకోగా శచీదేవి శ్రీ మహా విష్ణువు వద్దకు వెళ్లి శరణు వేడుకుంటుంది. అప్పుడు ఇంద్రుడిని కాపాడటానికి విష్ణువు తన మణికట్టు చుట్టూ పత్తితో తయారు చేసిన ఓ పవిత్రమైన దారాన్ని కట్టాలని సూచించాడు. అప్పుడు శచీదేవి కోరిక మేరకు విష్ణు దేవుడు ఆ రాక్షసి నాశనం చేస్తాడు. అప్పటినుంచి ఈ రాఖీ దారం ఉనికిలోకి వచ్చిందని అంటారు.

రాఖీ పండుగ ఎప్పుడు?
ఆగస్టు 19, సోమవారం రోజు రాఖీ పండుగ జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి 10:30 నిమిషాల లోపు రాఖీ కట్టడానికి సుముహూర్తం అని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు.

రాఖీ అంటే ఏమిటి?
రాఖీ అంటే 'రక్షణ' అని అర్ధం. తమ సోదరులకు ఎలాంటి ఆపదలు, అవాంతరాలు లేకుండా జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని కోరుకుంటూ ప్రతి ఆడపడుచు తన అన్నదమ్ములకు కట్టే 'రక్ష'ను రాఖీ అంటారు. తమ శ్రేయస్సును, అభ్యున్నతిని కోరుకునే అక్క చెల్లెళ్లకు రాఖీ పండుగ శుభ సందర్భంగా అన్నదమ్ములు కానుకలిచ్చి సంతోష పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.

వివిధ పేర్లతో రాఖీ పౌర్ణమి
రాఖీ పౌర్ణమిని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో జరుపుకుంటారు. ఉత్తర భారతంలో రక్షా బంధన్​గా పిలిచే ఈ పండుగను సావనీ, సలోనా అని కూడా అంటారు. గుజరాత్​లో పవిత్రోపనా, మహారాష్ట్రలో నరాళి పూర్ణిమ, దక్షిణ భారతంలో నారికేళ పౌర్ణమి అని పిలుస్తారు. బంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ఘూలాన్ పూర్ణిమగా జరుపుకుంటారు.

దేశవ్యాప్తంగా రాఖీ వేడుకలు
ఒకప్పుడు ఉత్తర భారతానికి పరిమితమైన రాఖీ వేడుకలు క్రమంగా దేశమంతటా వ్యాపించాయి. అన్నా చెల్లెళ్ల మధ్య అక్కాతమ్ముళ్ల మధ్య అనుబంధాన్ని దృఢ పరచుకోడానికి, బాల్య స్మృతులు గుర్తు చేసుకోవడానికి రాఖీ పండుగ ఓ మంచి అవకాశం.

రాఖీ పండుగ ఎలా జరుపుకోవాలి?
రాఖీ పండుగ రోజు ఉదయాన్నే తలారా స్నానం చేసి దేవుని వద్ద దీపం వెలిగించాలి. ఇంటిని పూలమాలలతో అలంకరించాలి. ఒక పళ్లెంలో అక్షింతలు, దీపం, రాఖీ, మిఠాయి సిద్ధం చేసుకోవాలి. అక్కా చెల్లెళ్లు తమ సోదరులకు రాఖీ కట్టి, హారతి ఇచ్చి, అక్షింతలు వేసి మిఠాయి తినిపించాలి. అన్నదమ్ములు తమ సోదరికి ప్రేమతో కానుకలు ఇవ్వాలి. అలాగే సొంత అన్నతమ్ములు లేనప్పుడు మనం ఎవరిని సోదరునిగా భావిస్తున్నామో వారికి కూడా రాఖీ కట్టవచ్చు.

ఆధునిక కాలంలో అంతా ఆన్ లైన్
నేటి ఆధునిక కాలంలో అన్నాచెల్లెళ్లు ఒకేచోట లేకుండా దూరంగా ఉంటే రాఖీలను ఆన్ లైన్ ద్వారా కూడా పంపిస్తున్నారు. అలాగే కానుకలు కూడా ఆన్ లైన్ ద్వారానే అందుతున్నాయి.

కుటుంబ విలువలు దృఢం
ఏది ఏమైనా ఇలాంటి పండుగలు వేడుకలు జరుపుకునే సంప్రదాయాలను పాటించడం వెనుక ఉన్న అంతరార్థం కుటుంబ సంబంధాలను దృఢపరచుకోవడమే! ఒక్క రాఖీ పండుగ రోజు మాత్రమే కాదు తన సోదరుని అభ్యున్నతిని ప్రతి చెల్లెలు కోరుకోవాలి. తన చెల్లెలి రక్షణ బాధ్యతను ప్రతి అన్నా స్వీకరించాలి. అప్పుడు ప్రతీ రోజూ పండుగే! ప్రతీ ఇంటా ఆనందమే! సోదర ప్రేమకు సంకేతంగా భావించే రాఖీ పండుగను అందరం ఆనందంగా జరుపుకుందాం. శుభం భూయాత్!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.