ETV Bharat / spiritual

నవరాత్రి స్పెషల్ : అమ్మవారు మెచ్చే "నువ్వులన్నం" - ఇలా ప్రిపేర్ చేసి నైవేద్యంగా పెట్టండి! - Navratri Special Recipe - NAVRATRI SPECIAL RECIPE

Navratri Special Recipe: దసరా వచ్చేస్తోంది. శరన్నవరాత్రుల్లో మహాశక్తిగా కొలిచే దుర్గామాతకు నవ నైవేద్యాలను నివేదిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన ఒక స్పెషల్ రెసిపీ తీసుకొచ్చాం. అదే.. "నువ్వులన్నం". మరి, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Nuvvula Annam Recipe
Navratri Special Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Oct 2, 2024, 6:01 AM IST

How to Make Nuvvula Annam Recipe : దేవీ శరన్నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయంటే చాలు.. బతుకమ్మ సంబరాలు, అమ్మవారి పూజలు, బొమ్మల కొలువులు.. ఇలా పది రోజులూ హడావుడే. మరి ఈ సమయంలో అమ్మవారికి నివేదించేందుకు ప్రసాదాలూ ముఖ్యమే. కాబట్టి.. మీకోసం అమ్మవారికి అత్యంత ఇష్టమైన నైవేద్యాలలో ఒకటిగా చెప్పుకునే "నువ్వుల అన్నం" రెసిపీ తీసుకొచ్చాం. మరి.. ఈ టేస్టీ, హెల్దీ ప్రసాదం తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

నువ్వుల పొడి కోసం :

  • 3 టేబుల్ స్పూన్లు - నల్ల నువ్వులు
  • 6 నుంచి 7 - ఎండుమిర్చి
  • 2 టేబుల్ స్పూన్లు - మినప పప్పు
  • రెండు రెబ్బలు - కరివేపాకు
  • రెండు చిటికెళ్లు - ఇంగువ
  • రుచికి సరిపడా - ఉప్పు

నువ్వుల అన్నం కోసం :

  • ఒకటిన్నర కప్పులు - అన్నం
  • 3 టేబుల్ స్పూన్లు - నువ్వుల నూనె
  • 3 - ఎండుమిర్చి
  • 1 టీస్పూన్ - మినప పప్పు
  • 1 టీస్పూన్ - శనగపప్పు
  • 1 టీస్పూన్ - జీలకర్ర
  • పావు టీస్పూన్ - ఆవాలు
  • 1 రెబ్బ - కరివేపాకు

తయారీ విధానం :

  • ముందుగా నువ్వుల పొడిని ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం స్టౌపై పాన్ పెట్టుకొని ఎండుమిర్చి వేసి 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఆపై వాటిని ఒక ప్లేట్​లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • తర్వాత అదే పాన్​లో మినప పప్పును వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • అనంతరం ఆ పాన్​లోనే నువ్వులు, కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్ మంట మీద నువ్వులు చిటచిటమనే వరకు వేయించుకోవాలి. అయితే, మీకు ఒకవేళ నల్ల నువ్వులు అందుబాటులో లేకపోతే తెల్ల నువ్వులు వాడుకోవచ్చు.
  • అలా వేయించుకునేటప్పుడు నువ్వులు చిట్లుతున్న సమయంలో ఇంగువ వేసి మరికాసేపు వేయించుకోవాలి.
  • నువ్వులు బాగా వేగయనుకున్నాక.. స్టౌ ఆఫ్ చేసుకొని వాటిని మిక్సీ జార్​లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అందులో.. ముందుగా వేయించి పెట్టుకున్న మినప పప్పు, ఎండుమిర్చితో పాటు ఉప్పు వేసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
  • ఈ విధంగా నువ్వుల పొడిని ప్రిపేర్ చేసుకున్నాక.. ప్రసాదం కోసం అప్పుడే వండిని రైస్​ తీసుకోవాలి. తర్వాత అందులో నువ్వుల పొడిని వేసి రైస్ మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టి నువ్వుల నూనె వేసుకోవాలి. ఈ ఆయిల్ అందుబాటులో లేకపోతే మీరు డైలీ వాడే నూనె వేసుకోవచ్చు. ఆయిల్ కాస్త వేడక్కాక.. ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. అలాగే.. ఆవాలు, మినప పప్పు, శనగపప్పు వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి.
  • అనంతరం జీలకర్ర, కరివేపాకు వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా రెడీ చేసుకున్న నువ్వుల అన్నం అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల అన్నం రెడీ!
  • ఆపై దాన్ని ఒక ప్లేట్​లోకి తీసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి.
  • అయితే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. ఈ నువ్వుల రైస్​ను దసరా టైమ్​లో అమ్మవారికి ప్రసాదంగా నివేదించడం మాత్రమే కాదు.. మీకు రెగ్యులర్ వంటకాలు తిని బోర్ అనిపించినప్పుడు, ఏదైనా హెల్దీ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు దీన్ని తయారు చేసుకొని ఆస్వాదించొచ్చు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ఇవీ చదవండి :

గుడిలోని ప్రసాదమంత టేస్టీ పులిహోర ఇంట్లోనే! - ఈ చిన్న టిప్స్​ పాటిస్తే అద్భుత రుచిని అస్వాదిస్తారు!

పక్కా కొలతలతో గుడిలో పెట్టే "పరమాన్నం" - నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.