ETV Bharat / spiritual

మే 1 నుంచి నర్మదా నది పుష్కరాలు- ఎక్కడ జరగనున్నాయో తెలుసా ? - Narmada Pushkaralu 2024

Narmada River Pushkaralu 2024 : మన దేశంలోని 12 పుణ్య నదుల్లో నర్మదా నది ఒకటి. ప్రతీ నదికి 12 సంవత్సరాలకొకసారి పుష్కరాలు జరుగుతాయి. ఈ క్రమంలోనే మే 1వ తేదీ నుంచి నర్మదా పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. అయితే నర్మదా నదీ పుష్కరాలకు వెళ్లాలనుకునేవారు ఎక్కడికి వెళ్లాలని ఆలోచిస్తున్నారా? అయితే టెన్షన్​ అక్కర్లేదు. పుష్కరాలు జరిగే కొన్ని ప్రదేశాలను మీ కోసం పట్టుకొచ్చాం.

Narmada River Pushkaralu 2024
Narmada River Pushkaralu 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 28, 2024, 5:22 PM IST

Narmada Pushkaralu 2024 : హిందూ సంప్రదాయాలలో నదులను దేవతలుగా పూజిస్తారు. మన దేశంలోని 12 పుణ్య నదుల్లో ఒక్కో నదికి పన్నెండేళ్లకోసారి పుష్కరాల పేరుతో వేడుకలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, ఈ సంవత్సరం మే 1 నుంచి నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు పుష్కర వేడుకల్లో పాల్గొని పుణ్య స్నానాలను ఆచరిస్తారు. అయితే, నర్మదా నది పుష్కరాలు ఎక్కడ జరగనున్నాయి ? ఏ ఏ ప్రదేశాల్లో పుష్కరాలను వైభవంగా నిర్వహిస్తారు ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

మోక్షం లభిస్తుందని నమ్మకం : పుష్కరకాలం సంవత్సరం మొత్తం ఉంటుంది. పుష్కరాలలో మొదటి 12 రోజులు ఆది పుష్కరం, చివరి 12 రోజులు అంత్య పుష్కరం అని పిలుస్తారు. బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశించినప్పుడు నర్మదా నదికి పుష్కరాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. అయితే, పుష్కరాలను నిర్వహించే మొదటి 12 రోజులు, చివరి పన్నెండు రోజులు నదిలో పుష్కరుడు సకల దేవతలతో కలిసి ఉంటాడని.. ఈ సమయంలో పవిత్ర నది స్నానమాచరిస్తే సకల తీర్థాల్లో స్నానం చేసిన పుణ్యం దక్కి, మోక్షం లభిస్తుందని పేర్కొన్నారు. మరి నర్మదా నది పుష్కరాలు ఎక్కడ జరుగుతాయో ఇప్పుడు చూద్దాం..

అమర్‌కంఠక్‌ : నర్మదా నది మధ్యప్రదేశ్‌లోని అమర్‌కంఠక్‌లో ఆవిర్భవించి.. పశ్చిమ దిశగా ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌లలో వేలాది మైళ్లు ప్రవహించి.. పారిశ్రామిక నగరమైన సూరత్‌ను అక్కున చేర్చుకొని, అరేబియా సముద్రంలో కలుస్తుంది. మధ్యప్రదేశ్‌లో నర్మదా నది ప్రవహించే ప్రాంతాలలో అమర్‌కంఠక్‌ను హిందువులు అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణిస్తారు. ఇక్కడ చాలా పుణ్యక్షేత్రాలున్నాయి. అమర్‌కంఠక్‌లో పుష్కర స్నానం చేస్తే ఎన్నో జన్మల పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెబుతున్నారు.

జబల్‌పుర్‌ : నర్మదా నది ఒడ్డున ఉన్న మరొక పవిత్రమైన పట్టణం మధ్యప్రదేశ్​లోని జబల్‌పుర్‌. ఇక్కడికి పుష్కర స్నానం చేయడానికి లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు. జబల్‌పుర్‌లో పవిత్ర నదీ స్నానం చేసిన తర్వాత హనుమంతల్‌ బడా జైన్‌మందిర్‌, మదన్‌ మహల్‌, దుమ్నా ప్రకృతి ఉద్యానవనం, రాణి దుర్గావతి మ్యూజియం తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు..

హోషంగాబాద్‌ :నర్మదా నది పుష్కరాలను మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌ నగరంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడ ఉన్న సేతుని ఘాట్‌లో నదీ స్నానం చేయడానికి, పూజలు చేయడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు.

ఓంకారేశ్వర్‌ : మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా జిల్లాలో నర్మదా నది ఒడ్డున ఓంకారేశ్వర్‌ పట్టణం ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా ఓంకారేశ్వర పుణ్య క్షేత్రం విరాజిల్లుతోంది. పుష్కర సమయంలో ఇక్కడ స్నానం చేసి మోక్షం పొందడానికి లక్షల మంది భక్తులు తరలివస్తారు. ఓంకారేశ్వరంలో ఆ పరమశివుడు ఓంకార రూపంలో దర్శనమిస్తాడని పండితులు చెబుతున్నారు. అందుకే దీనిని ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భక్తులు భావిస్తారు.

మహేశ్వర్ : మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా జిల్లాలో నర్మదా నది ఒడ్డున మహేశ్వర్ పట్టణం ఉంది. పురాతనమైన ఈ పట్టణంలో ఎన్నో ఆలయాలు, చారిత్రక ప్రదేశాలున్నాయి. ఇక్కడ పవిత్ర స్నానం చేయడానికి నిత్యం ఎంతో మంది భక్తుల తరలివస్తుంటారు. పుష్కర సమయంలో ఈ సంఖ్య లక్షల్లోనే ఉంటుందని చెప్పవచ్చు.

భరూచ్ : మధ్యప్రదేశ్‌లోని అమర్‌కంఠక్‌లో జన్మించిన నర్మదా నది.. గుజరాత్‌లోని భరూచ్‌ జిల్లా మార్గాన ప్రవహించి చివరిగా అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఎన్నో వేల ఏళ్ల క్రితమే ఈ పట్టణం ఉందని చారిత్రక ఆధారాలున్నాయి. అందుకే ఇక్కడ చుట్టు పక్కల ప్రాంతాల్లో చాలా పురాతన కట్టడాలు, ఆలయాలున్నాయి. ఇక్కడికి ఎంతో మంది భక్తులు పుష్కర స్నానం చేయడానికి తరలివస్తారు.

పెద్ద పండుగకు 'నర్మదా' నది సిద్ధం- పుష్కరాలు ఏడాది అంతా ఉంటాయా? - Narmada Pushkaralu 2024

శుక్రవారం ఇలా పూజిస్తే లక్ష్మీ కటాక్షం మీ సొంతం! చిరిగిన బట్టలు, పగిలిన అద్దాలు లేకుంటేనే!! - Goddess Lakshmi Attracting Tips

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.