Mahashivratri 2024 Wishes : మహాశివరాత్రి.. హిందువులు జరుపుకునే అత్యంత పవిత్రమైన పండగలలో ఒకటి. ఈ పర్వదినాన్ని దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఆ రోజంతా ఉపవాస దీక్షలు, రాత్రంతా జాగరణ, ప్రత్యేక పూజలు చేస్తూ శివనామ స్మరణతో గడుపుతారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి(Mahashivratri 2024).. మాఘ బహుళ చతుర్ధశి నాడు వస్తుంది. కాగా, ఈ సంవత్సరం మార్చి 8, శుక్రవారం నాడు మహాశివరాత్రి వస్తోంది. ఇక ఈ పవిత్రమైన రోజు భక్తులంతా తమకు ఇష్టమైన వారికి శివయ్య అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ మొబైల్లో సందేశాలు పంపుతుంటారు. అలాంటి వారికోసం 'ఈటీవీ - భారత్' మహా శివరాత్రి సందర్భంగా స్పెషల్ వాట్సాప్ కోట్స్, సందేశాలు, శ్లోకాలు తీసుకొచ్చింది. ఇంకెందుకు ఆలస్యం ఈ సారి మీ స్నేహితులు, బంధువులు, ఆప్తులకు వాటితో మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేయండి..
Mahashivaratri 2024 Wishes:
- ఈ పవిత్రమైన రోజు నుంచి మీకు అన్నీ శుభాలే కలగాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు!
- 'ఈ మహాశివరాత్రి మీ కోరికలన్నీ నెరవేరే శుభ దినం కావాలని ఆకాంక్షిస్తూ.. హ్యాపీ మహాశివరాత్రి 2024!!'
- "ఈ పవిత్రమైన మహాశివరాత్రి మీ ఇంట్లో ఆనందాన్ని.. ప్రశాంతతను రెట్టింపు చేయాలని ఆశిస్తూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు..!"
- 'హర హర మహాదేవ, శంభో శంకర.. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు!'
- 'ఆ పార్వతీ పరమేశ్వరుల దీవెనలతో మీరంతా సుఖశాంతులతో జీవించాలని..
- ఆ మహా శివుని కరుణ కటాక్షాలు ఎల్లప్పుడు మీపై ఉండాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు!'
- 'మహా శివుడు అనుగ్రహం మీపై ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ.. ఆత్మీయులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు'
- "ఓం నమఃశివాయ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు!!"
Mahashivaratri 2024 Quotes:
"ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం..
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్..
హ్యాపీ మహశివరాత్రి శుభాకాంక్షలు 2024!!"
"బ్రహ్మమురారి సురార్చిత లింగం..
నిర్మలభాసిత శోభిత లింగం..
జన్మజ దుఃఖ వినాశక లింగం..
తత్ప్రణమామి సదాశివ లింగం.. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు..!!"
"త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం..
త్రిజన్మ పాపసంహారమ్ ఏకబిల్వం శివార్పణం.. బంధు మిత్రులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు"
"గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీనిరన్తర విభూషితవామభాగమ్..
నారాయణప్రియమనఙ్గమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్..
మీకు, మీ కుటుంబసభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు..!!"
"హర హర మహదేవ శంబో శంకర..
ఇహపరముల నేలే జయ జగదీశ్వర..
కోరిన వారి కోరికలన్నీ తీర్చే పరమేశ్వరుని చల్లని దీవెనలు
ఎల్లవేళలా మీకు అందాలని కోరుకుంటూ.. మహా శివరాత్రి శుభాకాంక్షలు!!"
"ఏమీ అర్థం కాని వారికి పూర్ణ లింగేశ్వరం..
అంతో ఇంతో తెలిసిన వారికి అర్ధనాదీశ్వరం..
శరణాగతి అన్న వారికి మాత్రం ఆయనే సర్వేశ్వరం..
మీకు, మీ కుటుంబసభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు"
'లయకారుడు, భోళా శంకరుడు, లింగోద్భవం జరిగిన మహాశివరాత్రి పర్వదినాన..
ఆ మహాశివుడి ఆశీస్సులు మన అందరికి ఉండాలని కోరుకుంటూ.. ఆత్మీయులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.'
మహా శివరాత్రి రోజున ఉపవాసం ఎందుకు చేయాలి? మీకు తెలుసా?
మహాశివరాత్రి రోజు ఈ పనులు చేయకూడదు - శివుడు ఆగ్రహిస్తాడట!
మహాశివరాత్రి నాడు ఈ సంకేతాలు కనిపిస్తే - మీకు పరమేశ్వరుడి అనుగ్రహం లభించినట్టే!