ETV Bharat / spiritual

ద్వారక ఎలా మునిగిపోయింది? శ్రీకృష్ణుడి నిర్యాణం కథేంటో తెలుసా?

Lord Shri Krishna Death Story : ధర్మ సంస్థపాన కోసం యుద్ధం తప్పదు అని లోకానికి హితబోధ చేసిన శ్రీకృష్ణుడి నిర్యాణం గురించి పురాణాల్లో ఎంతో అద్భుతంగా వివరించారు. శ్రీకృష్ణుడి అవతరం మొదలు నిర్యాణం వరకు దాగిన ఎన్నో విషయాలకు సాక్షిగా నిలిచిన ద్వారక కూడా సముద్రంలో మునిగిపోయింది. అసలు శ్రీకృష్ణుడు ఎలా నిర్యాణం చెందాడు? ద్వారాక ఎలా మునిగిపోయిందనే విషయాలు తెలుసుకుందాం.

Lord Shri Krishna Death Story
Lord Shri Krishna Death Story
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 18, 2024, 6:45 AM IST

Lord Shri Krishna Death Story : అధర్మం పెచ్చుమీరినప్పుడు, ధర్మం ఓడిపోయే స్థితిలో ఉన్నప్పుడు దైవుడు ఏదో ఒక అవతారంలో వచ్చి ధర్మ సంస్థాపన చెయ్యడం మన పురాణాల్లో ఉంది. మనుషులు ధర్మాన్ని ఎలా ఆచరించాలి. ఎలాంటి పరిస్థితులను ఎలా ఎదురించాలి. ఇలా లోకం తీరు గురించి చెప్పడానికి శ్రీమహా విష్ణువు శ్రీకృష్ణుడి రూపంలో మనకు బోధ చేశాడు. మహాభారతంలో ప్రతి ఒక్క అంశం మన జీవితాలను ప్రభావితం చేసేదే.

కర్తవ్య బోధతో పాటు కర్మ ఫలితం గురించి శ్రీకృష్ణుడు ఎంతో అద్భుతంగా తన జీవితం ద్వారా చాటిచెప్పాడు. అయితే ధర్మాన్ని గెలిపించిన శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించాలని ముందుగా నిర్ణయించుకుంటాడని, తర్వాత నిర్యాణం చెందుతాడని మహాభారతంలోని మౌసల పర్వంలో ఉంది. అలాగే భాగవతంలోని ప్రథమ పర్వంలోని కృష్ణ నిర్యాణ ఘట్టం శ్రీకృష్ణుడి నిర్యాణంతో పాటు ద్వారక మునిగిన తీరును వివరిస్తుంది.

ద్వారక ఎలా మునిగిందంటే?
పురాణాల ప్రకారం కొంతమంది మహర్షులు ద్వారకలోని శ్రీకృష్ణుడిని దర్శించుకోవడానికి వస్తారు. అయితే అలా వచ్చిన మహర్షులను ద్వారకలోని యాదవ బాలురు ఆటపట్టించాలని అనుకుంటారు. అందుకే ఒక పురుషుడికి స్త్రీ వేషం వేసి, గర్భం వచ్చినట్లు చూపించి, మహర్షులను ఈ గర్భవతికి ఆడబిడ్డ పుడుతుందా, మగబిడ్డ పుడుతుందా అని అడుగుతారు. దివ్యదృష్టి కలిగిన మహర్షులు దానిని గమనించి యాదవ బాలలపై కోపగించుకుంటారు.

బాలురు చేసిన పనికి కోపంతో ఊగిపోయిన మహర్షులు యాదవులు పరస్పర కలహాలతో కొట్టుకొని నాశనం అవుతారని, ద్వారాక సముద్ర గర్భంలో కలుస్తుందని శాపం ఇస్తారు. మహర్షుల శాపం ప్రకారమే యాదవ వంశం కలహాలతో నాశనం అవడం, దానితో పాటు ద్వారక సముద్రంలో మునిగిపోవడం జరుగుతాయి. అయితే అదే సందర్భంలో శ్రీకృష్ణుడు తన అవతారాన్ని అడవిలో చాలిస్తాడు.

శ్రీకృష్ణుడి నిర్యాణం ఇలా
అడవిలో నిద్రిస్తున్న శ్రీకృష్ణుడిపై ఓ వేటగాడు బాణం విసురుతాడు. అయితే జర (అడవిలో ప్రవేశించిన కాలస్వరూపమైన శక్తి) ప్రభావం వల్ల ఆ వేటగాడు నిద్రిస్తున్న శ్రీకృష్ణుడిని చూసి జింక అని భ్రమిస్తాడు. దాంతో తన బాణం విసరగా అది కృష్ణుడి పాదం నుండి అరికాలులోకి దిగుతుంది. అనంతరం శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలిస్తాడు. అయితే అంతకు ముందే ఆదిశేషుడి అవతారమైన బలరాముడు తన అవతారాన్ని చాలించి ఉంటాడు.

శ్రీకృష్ణుడి అవతారం చాలించడాన్ని చూసిన పాండవులు వెక్కివెక్కి ఏడుస్తుంటారు. అర్జునుడు తన విద్య, బలం ఏవీ తన బావను కాపాడలేకపోయాయని బాధపడుతుంటాడు. అప్పుడు నారదుడు, వ్యాసుడు అక్కడికి చేరుకొని కర్తవ్యం బోధిస్తారు. భగవానుడు ధర్మం కోసం వచ్చి, తన కార్యం పూర్తి చేసి తిరిగి వెళ్లిపోయినట్లు వివరిస్తారు. పాండవులు కూడా నిర్యాణం చెందే సమయం వచ్చిందని నారదుడు, వ్యాసుడు కర్తవ్యం బోధిస్తారు. ఇలా ద్వారాక మునిగిపోవడం, శ్రీకృష్ణుడు, ఆ తర్వాత పాండవులు నిర్యాణం చెందారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇంట్లో బీరువా ఎక్కడ పెట్టాలో తెలుసా? ఆ దిక్కున పెడితే మీకు అన్ని శుభాలే!

వాస్తు దోషం - ఇంటి మెయిన్‌ డోర్‌ విషయంలో ఈ తప్పులు చేయొద్దు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.