ETV Bharat / spiritual

కృష్ణుడి జన్మ రహస్యం ఇదే- చదివిన వారికే పుణ్యమంతా! - Sri Krishna Ashtami 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 25, 2024, 4:32 AM IST

Lord Krishna Birth Story : శ్రావణ బహుళ అష్టమి రోజున శ్రీ కృష్ణాష్టమి పర్వదినంగా జరుపుకుంటాం. కృష్ణాష్టమి వస్తోందంటే చాలు దేశవ్యాప్తంగా సందడి నెలకొంటుంది. ఈ ఏడాది ఆగస్టు 26వ తేదీ సోమవారం కృష్ణాష్టమి సందర్భంగా చిన్ని కృష్ణుని జన్మ రహస్యం గురించి తెలుసుకుందాం.

Sri Krishna Ashtami 2024
Sri Krishna Ashtami 2024 (Getty Images)

Lord Krishna Birth Story : బమ్మెర పోతన రచించిన భాగవతం ప్రకారం కంసుని చెల్లెలు దేవకి. కంసునికి తన చెల్లెలంటే ఎంతో ప్రేమ. దేవకిని వసుదేవునికి ఇచ్చి వివాహం జరిపించి వారిని అత్తవారింటికి సాగనంపే సమయంలో ఆకాశవాణి దేవకీ అష్టమ గర్భంలో పుట్టే సంతానం కారణంగా కంసుడు మరణిస్తాడని చెబుతుంది. దాంతో ఆగ్రహానికి గురైన కంసుడు దేవకీ వసుదేవులను చెరసాలలో బంధిస్తాడు. కేవలం అష్టమ గర్భంలో పుట్టే కుమారుని వల్లనే ప్రమాదమని తెలిసి కూడా దేవకీ వసుదేవులకు పుట్టిన బిడ్డలను పుట్టినట్లు చంపుతూ ఉండేవాడు.

ఎనిమిదో సంతానంగా పరమాత్మ
కంసుని అకృత్యాలకు ఏడు మంది సంతానాన్ని పోగొట్టుకున్న దేవకి మళ్ళీ గర్భం ధరిస్తుంది. ఇది అష్టమ గర్భం అందుకే కంసుడు చెరసాల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తాడు. నెలలు నిండిన దేవకి శ్రావణ మాసం బహుళ అష్టమి నాడు రోహిణి నక్షత్ర శుభ లగ్నంలో, సరిగ్గా అర్ధరాత్రి సమయంలో శ్రీకృష్ణునికి జన్మనిస్తుంది. ఈ బిడ్డను ఎలాగైనా రక్షించాలనుకుంటారు దేవకీ వసుదేవులు.

శ్రీమన్నారాయణుని ఆదేశాలు
ఆ సమయంలో అర్ధరాత్రి చెరసాలలో జన్మించిన బాలుడు సాక్షాత్తూ ఆ శ్రీమన్నారాయణుడే. ఆయనే తనను ఎలా కాపాడాలన్నది వసుదేవునికి వివరిస్తాడు. విష్ణు మాయతో వసుదేవుని సంకెళ్లు విడిపోతాయి. చెరసాల తలుపులు వాటంతటవే తెరుచుకుంటాయి. సైనికులు స్పృహ తప్పి పడిపోతారు.

రేపల్లెకు పయనమైన వసుదేవుడు
వసుదేవుడు బాల కృష్ణుడిని బుట్టలో పెట్టుకుని రేపల్లెకు బయలుదేరుతాడు. ఆ అర్ధరాత్రి వేళ కుంభవృష్టి కురుస్తుండగా చిన్ని కృష్ణునికి ఆది శేషుడు పడగ విప్పి గొడుగు పడతాడు. అమిత వేగంతో ప్రవహిస్తున్న యమునా నది రెండుగా చీలి వసుదేవునికి మార్గం ఇవ్వగా వసుదేవుడు యమునా నది దాటుకుంటూ వెళ్లి రేపల్లె చేరుకుంటాడు.

యశోద తనయుడిగా చిన్ని కృష్ణుడు
రేపల్లెలో యాదవ రాజైన నందుని భార్య యశోద అదే సమయంలో ఆడ పిల్లకు జన్మనిస్తుంది. అది గమనించిన వసుదేవుడు కన్నయ్యను యశోద పక్కన పడుకోబెట్టి, ఆడపిల్లను తన చేతుల్లోకి తీసుకుని అక్కడి నుంచి తిరిగి కారాగారానికి బయలుదేరి వెళ్తాడు. వసుదేవుడు కారాగారంలోకి రాగానే తిరిగి అతనికి సంకెళ్లు వాటికవే పడతాయి. భటులు మేల్కొంటారు. పసిబిడ్డ ఏడుపులు విని కంసునికి సమాచారం అందిస్తారు.

యోగమాయ చెప్పిన కఠోరసత్యం
భటుల నుంచి సమాచారం అందుకున్న కంసుడు 'ఆకాశవాణి చెప్పిన ప్రకారం మగబిడ్డ వల్లనే కదా నీకు ప్రాణాపాయం. కానీ పుట్టింది ఆడపిల్ల కదా విడిచి పెట్టమని' దేవకి ఎంత ప్రార్ధించినా వినకుండా ఆ పసి బిడ్డను చంపడానికి ప్రయత్నించగా ఆ శిశువు యోగ మాయగా మారి కంసుడికి దొరక్కుండా గాలిలోకి ఎగిరి 'నిన్ను చంపేవాడు ఇప్పటికే పుట్టాడు. రేపల్లెలో పెరుగుతున్నాడు' అని చెప్పి మాయమవుతుంది.

గోకులంలో కోలాహలం
మరోవైపు రేపల్లెలో నందుడి ఇంట మగ బిడ్డ జన్మించడం వల్ల రేపల్లెలో పెద్ద ఉత్సవం జరుగుతుంది. గోకులంలో అష్టమి రోజు కన్నయ్య పుట్టాడని అందరూ సంబరాలు జరుపుకుంటారు. అందుకే కృష్ణాష్టమి గోకులాష్టమిగా ప్రసిద్ధికెక్కింది.

ఫలశృతి
శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు కన్నయ్య జన్మ రహస్యం గురించి విన్నా చదివినా ఎంతో పుణ్యం. సంతానం లేని వారు ఈ కథను వింటే సంవత్సరం తిరిగే లోపు పండంటి బిడ్డను ఎత్తుకుంటారు.

జై శ్రీకృష్ణ!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ఆ గుడికి వెళ్లి కిట్టయ్యను దర్శించుకుంటే చాలు- ఎలాంటి రోగమైనా క్షణాల్లో! - Famous Krishna Temple In Kerala

ఇది కదా అసలైన ఫ్రెండ్​షిప్! స్నేహానికి పర్యాయ పదంగా నిలిచి శ్రీకృష్ణ-కుచేల కథ మీకు తెలుసా? - Krishna Kuchela Frienship Story

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.