ETV Bharat / spiritual

భరించలేని అప్పులు ఉన్నాయా? శత్రుబాధలు తొలగిపోవాలా? - జన్మాష్టమి రోజున ఈ నూనెలతో దీపం వెలిగిస్తే చాలు! - Janmashtami 2024 - JANMASHTAMI 2024

Sri Krishna Janmashtami 2024: చాలా మంది జన్మాష్టమి సందర్భంగా కృష్ణుడి దగ్గర దీపం వెలిగించి భక్తితో దేవుడిని ఆరాధిస్తుంటారు. అయితే, పండగ నాడు ఈ నూనెలతో దీపారాధన చేయడం వల్ల అనేక శుభ ఫలితాలు లభిస్తాయని అంటున్నారు నిపుణులు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

Sri Krishna Janmashtami
Sri Krishna Janmashtami 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Aug 25, 2024, 12:20 PM IST

Krishna Janmashtami 2024: పండగల సమయంలో దేవుడి విగ్రహాలు, చిత్రపటాల ముందు వివిధ రకాల నూనెలతో దీపారాధన చేస్తుంటారు. అందులో నువ్వుల నూనె, ఆవు నెయ్యి, కొబ్బరినూనె వంటివి ఉంటాయి. అయితే కేవలం ఇవి మాత్రమే కాకుండా ఇతర నూనెలతో దీపారాధన చేసిన మంచి జరుగుతుందని అంటున్నారు. ముఖ్యంగా ఈ కృష్ణాష్టమి రోజున ఒక్కోరకమైనటువంటి నూనెతో దీపం వెలిగించడం వల్ల ఒక్కో ఫలితం పొందవచ్చని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్​ కుమార్ చెబుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఆవు నెయ్యి: శ్రీకృష్ణుడికి అన్నింటికంటే ఆవు నెయ్యితో చేసే దీపారాధన విశేషమైన శుభ ఫలితాలను కలిగుతాయని అంటున్నారు. గోకులాష్టమి రోజున శ్రీకృష్ణుడి దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మనం చేసే ప్రతి పనిలోనూ విజయం కలుగుతుందని.. ఇంట్లో సంతోషాలు నెలకొంటాయని అంటున్నారు.

నువ్వుల నూనె: శ్రీకృష్ణుడి దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే.. మనకున్నటువంటి కష్టాలు, బాధలన్నీ తొలగిపోతాయని చెబుతున్నారు. ఉదర సంబంధమైనటువంటి వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుందని.. గ్యాస్​, అల్సర్​ సమస్యలతో బాధపడేవారు నువ్వుల నూనెతో దీపారాధాన చేస్తే మంచి జరుగుతుందని మాచిరాజు కిరణ్​ కుమార్ సూచిస్తున్నారు.

ముత్యాల నూనె : కృష్ణాష్టమి రోజున కృష్ణుడి దగ్గర ముత్యాల నూనెతో దీపం పెడితే అనారోగ్య సమస్యలు తొలగిపోయి దీర్ఘాయుష్షు కలుగుతుందని అంటున్నారు.

గంధం నూనె : గంధం నూనెతో కృష్ణాష్టమి రోజున దీపారాధన చేస్తే మనకున్న రుణ బాధలు తొలగిపోతాయి. భరించలేని అప్పులు ఉన్న వారు కృష్ణుడి దగ్గర గంధం నూనెతో దీపం వెలిగిస్తే ఆ బాధల నుంచి ఉపశమనం కలుగుతుందని మాచిరాజు కిరణ్​ కుమార్ పేర్కొన్నారు.

పిప్పళ్ల నూనె (పిప్పిలి నూనె): దీర్ఖకాలికంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు జన్మాష్టమి రోజున పిప్పళ్ల నూనెతో దీపం వెలిగిస్తే మంచి జరుగుతుందని అంటున్నారు.

తెన్న చెట్టు నూనె : ఈ నూనెతో దీపారాధాన చేయడం వల్ల కను దిష్టి, నర దిష్టి తొలగిపోతుందని వివరిస్తున్నారు. తెన్నచెట్టు నూనెతో కృష్ణుడి దగ్గర దీపం వెలిగించడం వల్ల శత్రు బాధల నుంచి బయటపడవచ్చని సూచిస్తున్నారు.

కొబ్బరి నూనె : కృష్ణాష్టమి సందర్భంగా కొబ్బరి నూనెతో దీపం వెలిగించడం వల్ల ఇంట్లోని శుభకార్యలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా, త్వరగా జరుగుతాయని అంటున్నారు. అలాగే కొబ్బరి, పంచదార కలిపి కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించడం మంచిదంటున్నారు.

సాంబ్రాణి నూనె : మనకు కనిపించే శత్రువులు, కనిపించని శత్రువులు రెండు రకాలుగా ఉంటారు. వీరి బాధలు తొలగాలంటే కృష్ణాష్టమి రోజున సాంబ్రాణి నూనెతో దీపం వెలిగించాలని మాచిరాజు కిరణ్​ కుమార్ సూచిస్తున్నారు.

గానుగ నూనె : సకల కష్టాలు, బాధలన్నీ తొలగిపోవాలంటే కృష్ణాష్టమి రోజున కృష్ణుడి విగ్రహం లేదా చిత్రపటం దగ్గర, సాయంత్రం 6 గంటల నుంచి 6.30 గంటల మధ్య గానుగ నూనెతో దీపం పెట్టాలని.. ఈ సమయంలో దీపారాధన చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు.

Note: పైన తెలిపిన వివరాలు కొందరు వాస్తు నిపుణులు, వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ఇవి కూడా చదవండి :

శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు ? ఆగస్టు 26నా లేదా 27వ తేదీనా? - పండితుల సమాధానమిదే!

శ్రీకృష్ణాష్టమి రోజు ఈ దీపాన్ని వెలిగిస్తే - మీ జన్మజన్మల దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.