Kitchen Vastu Tips : వాస్తు శాస్త్రంలో వంటగదికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. వంట గదిని ఎంత చక్కగా సర్దుకుంటే ఆ ఇంట్లోని వారు అంత అభ్యున్నతిలోకి వస్తారు! వంటగది నిర్మాణం, వస్తువుల అమరిక విషయంలో వాస్తు పాటించడం కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు వంట ఇంట్లోని సామాన్లు ఏవి ఎక్కడ సర్డుకోవాలో చూద్దాం.
వంటింట్లో కిటికీలు ఇలా ఉంటే శుభం!
వంటింట్లో కిటికీలు తూర్పు కానీ దక్షిణ దిశలో కానీ అమర్చుకుంటే మేలు. అలా అయితేనే వంటింట్లోకి చక్కగా గాలి వెలుతురూ ప్రసరిస్తుంది. గాలి వెలుతురు ధారాళంగా వంటింట్లోకి వస్తే వంటింట్లో బొద్దింకలు, చెద పురుగులు, క్రిములు, చీమలు వంటివి చేరవు.
ఏ రంగులు వేయాలి
వంటింటి గోడలకు పసుపు, నారింజ, గులాబీ, చాకోలెట్, ఎరుపు రంగులు వేస్తే శుభకరం.
వంటింటి సమీపంలో టాయిలెట్లు ఉండొచ్చా?
వాస్తు ప్రకారం వంటింటి సమీపంలో టాయిలెట్లు అసలు ఉండకూడదు. కనీసం వంటగది గోడకు ఆనుకొని కూడా టాయిలెట్ల నిర్మాణం చేయకూడదు. అలా చేస్తే ఇంట్లో వారికి ప్రతికూల ఫలితాలు కలుగుతాయి.
వంటగది గుమ్మం ఎలా ఉంటే మంచిది?
వంటగది గుమ్మం విషయంలో వాస్తు ఏమి చెబుతోంది అంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా వంటగది గుమ్మం ఇంటి ముఖద్వారానికి ఎదురుగా ఉండ రాదు. వాస్తు శాస్త్రంలో ఇది చాలా ముఖ్యమైన విషయం. వీధి గుమ్మంలో నుంచి వంటగది అసలు కనిపించకూడదు. పొరపాటున ఇలా చేస్తే ఆ ఇంట్లోని వారికి జీర్ణసంబంధ వ్యాధులు వస్తాయి.
ఈశాన్యంలో వంట గది?
వాస్తు ప్రకారం ఈశాన్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వంటగది ఉండరాదు. ఇది ఇంట్లో వారి అభ్యున్నతికి అవరోధంగా మారుతుంది.
మిక్సీలు, గ్రైండర్లు ఎక్కడ పెట్టాలి?
వంటింట్లో మిక్సీలు, గ్రైండర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు ఆ గదికి ఆగ్నేయం వైపు పెట్టుకోవడం మంచిదని వాస్తు శాస్త్రం చెబుతోంది.
వంటింట్లో దేవుని మందిరం?
ఏ ఇంట్లో అయినా దేవుని కోసం ప్రత్యేకంగా గది ఉంటేనే బాగుంటుంది. కానీ అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు వంటింట్లో దేవుని మందిరం కొంతమంది ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదేమిటంటే దేవుని మందిరం వంటింట్లో సింకు పక్కన కానీ, సింక్ కింద కానీ, గ్యాస్ పొయ్యికి పైన కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏర్పాటు చేయకూడదు. ఇది చాలా దోషం. ఇంట్లోని వారికి ఏ మాత్రం మంచిది కాదు.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
లింగాభిషేకంతో ధనప్రాప్తి- సోమవారం ఇలా చేస్తే ప్రాబ్లమ్స్ పటాపంచలు! - Shivling Abhishekam Benefits