ETV Bharat / spiritual

కార్తిక మాసంలో ఇలా దీపారాధన చేస్తే - అష్టైశ్వర్యములు, పుత్ర సంతానం ఖాయం! - KARTHIKA PURANAM CHAPTER 4

దీపారాధన మహత్యం - కార్తిక మాసంలో ఇలా పూజిస్తే శివ సాయుజ్యం లభ్యం!

Karthika Puranam Chapter 4
Karthika Puranam Chapter 4 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 5, 2024, 5:30 AM IST

Karthika Puranam Chapter 4 : పరమ పవిత్రమైన కార్తిక మాసం మొదలైంది. కార్తిక పురాణం ప్రతిరోజూ విన్నా, చదివినా అనంత కోటి పుణ్యం లభిస్తుందని శాస్త్ర వచనం. ఈ కథనంలో కార్తిక పురాణం నాలుగో అధ్యాయంలో భాగంగా కార్తిక మాసంలో చేసే దీపారాధన మహత్యం గురించి తెలుసుకుందాం.

కార్తీక పురాణం- 4వ అధ్యాయం
వశిష్ఠుడు జనకునితో బ్రహ్మ రాక్షసుల శాపవిమోచనం కథ చెప్పిన తరువాత జనక మహారాజు వశిష్టునితో, "మహర్షీ! మీరు చెప్పే ఇతిహాసములు వినే కొద్దీ వినాలనిపిస్తోంది. ఈ కార్తికమాసంలో ఏమేమి చేయాలి, ఎవరిని ఉద్దేశించి పూజించాలి" అని అడుగగా, వశిష్ఠుడు "ఓ జనకా! కార్తిక మాసము నందు దీపారాధనకు అత్యంత ప్రాముఖ్యం కలదు. శివాలయంలో గాని, విష్ణువు ఆలయంలోగాని సూర్యాస్తమయం నందు దీపారాధన చేసిన వారు అష్టైశ్వర్యములను పొంది, కడకు శివ సాయుజ్యమును పొందుదురు. దీనికి నిదర్శనంగా ఒక కథను చెబుతాను విను" అంటూ చెప్పసాగెను.

రాజుకు దీపారాధన మహాత్యముని వివరించిన పిప్పలాదుడు
పూర్వము పాంచాల దేశమును పాలించుచుండెడి రాజుకు ఎన్ని యజ్ఞయాగాదులు చేసినప్పటికీ సంతానం కలగలేదు. తుదకు విసుగు చెందిన ఆ రాజు గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా ఆ ప్రదేశమునకు పిప్పలాదుడను మునిపుంగవుడు వచ్చి 'ఓ రాజా! నీవు ఏమి కోరి ఇటువంటి తపమాచరించుచున్నావు?' అని అడుగగా, రాజు 'ఋషి పుంగవా! నాకు అష్టైశ్వర్యములు ఉన్నను, పుత్ర సంతానం లేదు. అందుకే తపస్సు చేయుచున్నాను' అని చెప్పగా అంతట ఆ ఋషి 'రాజా కార్తిక మాసము నందు శివదేవుని ప్రీతి కొరకు శివాలయంలో దీపారాధన చేసిన నీ కోరిక నెరవేరగలదు' అని చెప్పి వెడలిపోయెను.

రాజుకు సంతానభాగ్యం
మహర్షి మాటలు విన్న వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెళ్లి కార్తికమాసం నెల రోజుల పాటు ప్రతిరోజూ శివాలయంలో దీపారాధన చేసెను. ఆ పుణ్య ఫలితంగా రాజు భార్య గర్భం దాల్చి 9 నెలల తర్వాత పండంటి మగ బిడ్డను ప్రసవించెను. అంతట రాజ కుటుంబీకులు మిక్కిలి సంతోషించి ఆ బిడ్డకు శత్రుజిత్తు అను నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచసాగెను.

శత్రుజిత్తు దుశ్చర్యలు
ఆనాటి నుంచి రాజు తన రాజ్యంలో ప్రతి సంవత్సరం కార్తిక మాసంలో శివాలయంలో దీపారాధన అందరు విధిగా చేయవలెనని శాసించెను. ఇలా ఉండగా శత్రుజిత్తు పెరిగి పెద్దవాడయ్యి యుద్ధ విద్యలన్ని నేర్చుకున్నాడు. కానీ దుష్ట సహవాసముల వల్ల, తల్లిదండ్రుల గారాబం వల్ల తన ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ రాజ్యములోని స్త్రీలను చెరపడుతూ, వారిని బంధించి తన కామవాంఛ తీర్చుకుంటుండేవాడు. తల్లిదండ్రులు కూడా తమ బిడ్డను మందలించకుండా చూసి చూడనట్లుగా ఊరుకునేవారు.

బ్రాహ్మణ స్త్రీని వశపరచుకొన్న శత్రుజిత్తు
ఒకసారి శత్రుజిత్తు ఒక అందమైన బ్రాహ్మణ స్త్రీని చూశాడు. ఆమె అప్పటికే వివాహిత. అయినా రాజు ఆమెను లోబర్చుకున్నాడు. ఆమె కూడా తన పతికి తెలియకుండా రాజుతో కలిసి భోగములు అనుభవించుచుండెడిది. కొన్ని రోజులకు వాళ్ల సంగతి పసిగట్టిన ఆమె భర్త వారిరువురిని చంపడానికి నిశ్చయించుకున్నాడు.

శివాలయంలో కలుసుకున్న రాజు బ్రాహ్మణ స్త్రీ
ఈ క్రమంలో రాజు, బ్రాహ్మణ స్త్రీ కార్తిక పున్నమి నాడు శివాలయంలో కలుసుకోవడానికి నిశ్చయించుకున్నారు. ఈ సంగతి గ్రహించిన ఆమె భర్త వారిని చంపడానికి కత్తి తీసుకుని వారి కన్నా ముందుగానే శివాలయం చేరుకుని నక్కి ఉన్నాడు. శివాలయం చేరుకున్న శత్రుజిత్తు, అతని ప్రేయసి గర్భాలయంలో చీకటిగా ఉన్న కారణం చేత దీపం వెలిగింప దలచి ఆమె తన పైట చెంగును చించి అక్కడే ఉన్న ఆముదం ప్రమిదలో ముంచి దీపం వెలిగించింది.

అనూహ్య ఘటన
వెంటనే ఆమె భర్త కత్తి దూసి వారిద్దరిని చంపి, తానూ కూడా పొడుచుకుని మరణించాడు. వెంటనే శత్రుజిత్తు, బ్రాహ్మణస్ట్రీ కోసం శివదూతలు, ఆమె భర్త కోసం నరక దూతలు వచ్చారు. అప్పుడు ఆమె భర్త పాపులైన వారికోసం శివదూతలు రావడమేమిటి? నాకోసం నరక దూతలు రావడమేమిటి? అని వారిని ప్రశ్నించగా, నరక దూతలు 'ఓ బ్రాహ్మణుడా! వారెంత నీచులైన కార్తిక పౌర్ణమి నాడు తెలిసో, తెలియకో శివాలయంలో దీపారాధన చేశారు. ఆ పుణ్యమే వారిని శివ సాయుజ్యానికి చేర్చింది. అనగా, వెంటనే శత్రుజిత్తు తాము చేసిన దీపారాధన పుణ్యంలో కొంత ఆ బ్రాహ్మణుడికి ధారపోయగా వెంటనే శివదూతలు అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించి కైలాసమునకు తీసుకుపోయెను. ఈ విధముగా ఆ ముగ్గురు శివ సాయుజ్యాన్ని పొందారు. కావున ఓ రాజా! కార్తికమాసంలో శివాలయంలో తెలిసి కానీ, తెలియక కానీ దీపారాధన చేయడం వలన పాపములు నశించుటయేగాక, కైలాసప్రాప్తి కలుగుతుంది అని వశిష్ఠుడు జనకునితో చెప్పెను.

ఇతి స్మాందపురాణ కార్తీకమహాత్మ్యే చతుర్ధోధ్యాయ సమాప్తః

ఓం నమః శివాయ!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.