ETV Bharat / spiritual

శివయ్యకు కావిళ్లతో గంగ- కాలినడకనే ప్రయాణం- కన్వర్ యాత్ర విశేషాలివే! - Kanwar Yatra 2024

Kanwar Yatra Significance : పరమ శివుడు అభిషేక ప్రియుడు అని అంటారు. చెంబుడు గంగా జలంతో అభిషేకిస్తే సంతోషించే శివయ్య కోసం వందల మైళ్లు కాలినడకన నడిచి కావిళ్లతో గంగాజలాన్ని మోసుకెళ్లి అభిషేకించి మొక్కులు తీర్చుకునే కన్వర్ యాత్ర విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

Kanwar Yatra 2024
Kanwar Yatra (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 19, 2024, 3:33 AM IST

Kanwar Yatra Significance : హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసానికి విశిష్టత ఉంది. ఈ మాసంలో దక్షిణాదిన వరలక్ష్మీ వ్రతం, మంగళ గౌరీ వ్రతం వంటి వ్రతాలను జరుపుకుంటే ఉత్తరాదిన మాత్రం శ్రావణమాసంలో శివుడిని విశేషంగా ఆరాధిస్తారు. చాంద్రమానం ప్రకారం మాసాలను లెక్కించే ఉత్తరభారతంలో ప్రతి నెల పౌర్ణమి నుంచి కొత్త మాసం మొదలవుతుంది. ఈ క్రమంలో ఈ ఏడాది ఆషాడ పౌర్ణమి జూలై 21వ తేదీన వచ్చింది. కనుక మర్నాడు నుంచి అంటే జూలై 22 నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. శ్రావణ మాసం 19 ఆగస్టు 2024న ముగుస్తుంది. శివుని ఆరాధనకు విశేషమైన శ్రావణ మాసంలో ప్రతి సోమవారం శివునికి ప్రత్యేకమైనది!

కన్వర్ యాత్ర అంటే ఏమిటి?
ఉత్తర భారతంలో పరమ శివుని భక్తులు శ్రావణ మాసంలో కావిళ్లతో నీటిని తీసుకొచ్చి శివలింగానికి జలాభిషేకం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే మాస శివరాత్రి రోజున శివాలయాల్లో శివలింగానికి ఈ జలాభిషేకం చేస్తారు. శివ పురాణంలో, లింగ పురాణంలో కూడా కన్వర్ యాత్ర ప్రస్తావన ఉంది.

సందడిగా గంగా తీరం
కన్వర్ యాత్ర జరిగే నెల రోజుల పాటు గంగా తీరంలో ఉన్న ఊర్లన్నీ కోలాహలంగా ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచి భక్తులు కాలి నడకన హరిద్వార్ వచ్చి కావిళ్లతో గంగాజలాన్ని తీసుకెళ్లి తమ ప్రాంతాలలోని శివాలయాల్లో శివుని అభిషేకిస్తారు.

కన్వర్ యాత్ర విశిష్టత
శ్రావణ మాసంలో శివ భక్తులు గంగానది వద్దకు వెళ్లి నదిలోని గంగా జలాన్ని బిందెలతో నింపి కావిడి కట్టి తమ భుజాలపై వేలాడదీసుకుని తమ తమ ప్రాంతాల్లోని శివాలయానికి తీసుకొచ్చి శివలింగానికి గంగాజలాన్ని సమర్పిస్తారు. ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం ఈ కన్వర్ యాత్రను పరశురాముడు మొదట ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. పరశురాముడు ఉత్తరాఖండ్​లోని ముక్తేశ్వర్ ధామ్ నుంచి కాలి నడకన కావిళ్లతో నుంచి గంగాజలాన్ని తీసుకువచ్చి ఉత్తర్​ప్రదేశ్​లోని బాగ్‌పత్ సమీపంలో ఉన్న పుర మహాదేవుడిని అభిషేకించాడని నమ్మకం. ఈ కన్వర్ యాత్ర చేసే వారిని కన్వారీలు అంటారు.

కన్వర్ యాత్ర నియమాలు

  • శివపార్వతుల ఆరాధనకు విశేషమైన శ్రావణమాసంలో కన్వర్ యాత్ర చేసే వారు కొన్ని కఠినమైన నియమాలు పాటించాలి.
  • యాత్ర సమయంలో వారు పూర్తిగా కాలినడకనే ప్రయాణించాలి.
  • కాషాయరంగు వస్త్రాలనే ధరించాలి.
  • కన్వర్ యాత్ర చేసే భక్తులు తప్పనిసరిగా సాత్విక ఆహారం తీసుకోవాలి.
  • మద్య మాంసాలు తీసుకోరాదు.
  • యాత్రికులు విశ్రాంతి తీసుకునే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కావిడిని నేలపై ఉంచకూడదు. ఇలా చేస్తే కన్వర్ యాత్ర అసంపూర్ణం అని భావిస్తారు.
  • కావిడిని చెట్టు కొమ్మకు వేలాడిదీసి ఉంచాలి.
  • ఒకవేళ పొరపాటున కావిడిని నేలపై ఉంచితే తిరిగి మళ్లీ పాదచారులై హరిద్వార్​కు వెళ్లి గంగాజలాన్ని కావిళ్లతో తీసుకురావాల్సి ఉంటుంది.
  • ప్రతిసారి కావిడిని స్నానం చేసిన తర్వాత మాత్రమే తాకాలి.
  • భుజంపై గంగాజలాన్ని కావిళ్లలో మోస్తున్నంత సేపు ఓం నమః శివాయ అంటూ పంచాక్షరీ మంత్రాన్ని నిరంతరం జపిస్తూనే ఉండాలి.
  • అలాగే దీక్ష చేపట్టిన వ్యక్తులు తప్ప ఎవరు పడితే వారు కావిళ్లను మోయకూడదని గుర్తుంచుకోవాలి.

కన్వర్ యాత్రికులతో పులకించే హరిద్వార్
శివుని ఆరాధనకు ప్రశస్తమైన శ్రావణ మాసంలో పరమ పవిత్రమైన హరిద్వార్ కన్వర్ యాత్రికులతో సందడిగా ఉంటుంది. ఎటు చూసినా కాషాయ రంగు వస్త్రాలు ధరించి భుజంపై గంగా జలాన్ని కావిళ్లతో మోస్తూ శివనామ స్మరణతో మారుమోగే గంగా తీరం కన్నులారా చూడాల్సిందే కానీ మాటలతో వర్ణించడానికి సాధ్యం కాదు. త్వరలో జరుగనున్న కన్వర్ యాత్రలో మనం కూడా పాల్గొందాం. ఆధ్యాత్మిక అనుభూతులను సొంతం చేసుకుందాం. ఓం నమః శివాయ!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.