ETV Bharat / spiritual

కాలభైరవ జయంతి విశిష్టత ఏంటి? శుక్రవారం ఎలా పూజించాలి? క్లియర్​గా మీకోసం!

రోగభయం, ప్రతికూల శక్తులను తొలగించే కాలభైరవ జయంతి

Kalabhairav Jayanti 2024
Kalabhairav Jayanti 2024 (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Kalabhairav Jayanti Significance In Telugu : ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలంటారు. ఎంత సంపాదించినా మంచి ఆరోగ్యం లేకపొతే వృధానే! ఎన్ని మందులు వాడినా ఫలితం లేని మొండి రోగాల నుంచి విముక్తి పొందడానికి, ఇంట్లో ప్రతికూల శక్తులను తొలగించుకోడానికి కాలభైరవ జయంతి రోజు కాలభైరవుని పూజించాలని శాస్త్రం చెబుతోంది. ఈ సందర్భంగా కాలభైరవ జయంతి ఎప్పుడు వచ్చింది? ఆ రోజు ఎలాంటి పూజలు చేయాలి అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఎవరీ కాలభైరవుడు?
సాక్షాత్తు పరమశివుని స్వరూపాల్లో ఒక స్వరూపమే కాలభైరవుడు. వ్యాస మహర్షి రచించిన శివ మహా పురాణం ప్రకారం ఒకానొక సందర్భంలో బ్రహ్మ, విష్ణువు మధ్య విశ్వాన్ని ఎవరు కాపాడుతున్నారు? పరతత్వం ఎవరు? అనే అంశం చర్చకు దారి తీసింది. ఈ వివాదాంశం గురించి మహర్షులు 'సమస్త విశ్వానికి మూలమైన పరతత్వం ఒక్క మాటలో తేల్చి చెప్పడానికి వీలు కానిది. ఇందుకు కారణం విష్ణువు బ్రహ్మ ఇద్దరూ ఆ శక్తి విభూతి నుంచి ఏర్పడిన వారే కదా!' అన్నారు ఋషులు. ఈ విషయానికి సంబంధించి బ్రహ్మ దేవుడు, విష్ణువు దేవతలందరితో పాటుగా శివుడిని సంప్రదించారు. ఆ సమయంలో దేవతలందరూ ఒకచోట కూర్చుని ఆ పరమేశ్వరుడే సృష్టికి మూలమని తేల్చారు. అయితే బ్రహ్మదేవుడు దీనిని అంగీకరించకుండా శివుని దూషించాడు. అప్పుడు శివుడు ఆగ్రహించి తన అంశతో ఐదవ రుద్ర అవృతారంగా కాల భైరవ అవతారాన్ని ధరించాడు. ఈ బైరవ అవతారానికి కారణమైన రోజు కార్తిక బహుళ అష్టమి కావడం వల్ల ఆ రోజు "కాలభైరవాష్టమి" గా ప్రసిద్ధి చెందింది.

కాలభైరవాష్టమి ఎప్పుడు?
హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో బహుళ పక్షంలో అష్టమి తిథి నాడు కాల భైరవ జయంతిని జరుపుకుంటారు. ఈ సందర్భంగా నవంబర్ 22వ తేదీ శుక్రవారం రోజు కాలభైరవ జయంతి జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు. సాధారణంగా కాలభైరవ పూజ రాత్రి సమయాలలో నిర్వహిస్తారు కాబట్టి మనం వెళ్లే ఆలయంలో సమయాలను అనుసరించి కాలభైరవుని పూజించుకుంటే మంచిది.

కాలభైరవ స్వరూపం
పరమశివుని స్వరూపమైన కాలభైరవుడు ఉగ్రరూపంతో ఉంటాడు. కాలభైరవుని వాహనం కుక్క. అంతేకాదు పరమ పావనమైన కాశీ క్షేత్ర పాలకుడు కూడా కాల భైరవుడు. అందుకే వారణాశి వెళ్లిన వారు కాలభైరవుని కూడా తప్పకుండా దర్శించుకోవాలి. అలాగే ప్రతి శివాలయంలో కూడా కాలభైరవ విగ్రహం ఉంటుంది.

కాలభైరవాష్టమి విశిష్టత
కాలభైరవాష్టమి రోజున కాలభైరవుడిని పూజించడం ద్వారా రోగ భయం, మృత్యు భయం నుంచి విముక్తి లభిస్తుందని విశ్వాసం. విశేషించి ఈ రోజున కాలభైరవుడిని పూజించిన వారికి అన్ని రకాల వ్యాధుల నుంచి, దుష్టశక్తుల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. అలాగే ఇంట్లో ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయని, భైరవుని చాలీసా పఠించడం వల్ల శుభప్రదమైన ఫలితాలు వస్తాయని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతారు.

కాలభైరవాష్టమి పూజావిధానం
కాల భైరవుని జయంతి రోజున కాల భైరవుడితో పాటు దుర్గా మాతను పూజించాలి. అష్టమి కి ముందు సప్తమి తిథి రోజున అర్ధరాత్రి కాళరాత్రి దేవిని పూజిస్తారు. ఈ తర్వాతే కాలభైరవుడిని పూజిస్తారు. కాలాష్టమి తిథి కాలంలో పరమేశ్వరుడిని కూడా పూజించడం పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున పూజలు చేసే వారు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉన్న భక్తులు రాత్రి జాగరణ కూడా చేయాలి. ఉపవాసం ఉండే వారు రాత్రి వేళ ఉపవాసాన్ని విరమించి పండ్లు, పాలు మాత్రమే తీసుకోవాలి. ఆ మరుసటి రోజే తిరిగి కాలభైరవుని దర్శించిన తర్వాత భోజనం చేసి ఉపవాసాన్ని విరమించాలి.

కాలభైరవ పూజాఫలం
కాలభైరవాష్టమి రోజు కాలభైరవుని పూజించడం ద్వారా శత్రుభయం, అపమృత్యు భయం, రోగభయం తొలగిపోతాయని విశ్వాసం. అలాగే తరచుగా పనులలో ఆటంకాలు ఎదురవుతుంటే కాలభైరవాష్టమి రోజు కాలభైరవుని భక్తిశ్రద్ధలతో పూజిస్తే ప్రతికూల శక్తులు తొలగి పనుల్లో సానుకూలత ఉంటుందని విశ్వాసం. అలాగే ఈ రోజు కాలభైరవుని వాహనమైన నల్ల కుక్కకు కుంకుమతో బొట్టు పెట్టి, గారెలతో తయారు చేసిన మాల వేయడం వలన సమస్త గ్రహ దోషాలు పోతాయని విశ్వాసం. రానున్న కాలభైరవాష్టమి రోజు మనం కూడా కాలభైరవుని పూజిద్దాం సకల శుభాలను పొందుదాం. ఓం శ్రీ కాలభైరవ స్వామియే నమః

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.