ETV Bharat / spiritual

తెలంగాణ పూల జాతర 'బతుకమ్మ'- ఈ పండుగ వెనుక ఉన్న ఆసక్తికరమైన కథలు మీకు తెలుసా? - Stories Behind Bathukamma Festival - STORIES BEHIND BATHUKAMMA FESTIVAL

Interesting Stories Behind Bathukamma Festival : దాదాపు 1000 సంవత్సరాల నుంచి బతుకమ్మ పండుగను తెలంగాణ వాసులు జరుపుకుంటున్నారు. బతుకమ్మ పేరు కూడా 'బృహదమ్మ' నుంచి వచ్చినదే. బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి తొమ్మిది రోజుల పాటు ఆటపాటలాడి అనంతరం నీటిలో వదులుతారు. శివుడు లేని పార్వతి గురించి పాటలగా పాడుతూ బతుకమ్మను జరుపుకుంటున్నారు తెలంగాణ వాసులు. బతుకమ్మ పండుగ వెనుక ఆసక్తి గొలిపే గాథల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

Bathukamma festival
Bathukamma festival (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 2, 2024, 4:10 AM IST

Interesting Stories Behind Bathukamma Festival : చారిత్రక ఆధారాల ప్రకారం తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకూట రాజులు పరిపాలించే కాలంలో వారి వద్ద వేములవాడ చాళుక్యులు సామంతులుగా ఉండేవారు. చోళులకు, రాష్ట్రకూటులకు యుద్ధం జరిగినప్పుడు ఈ చాళుక్యులు రాష్ట్రకూటులకు మద్దతుగా నిలిచారు. క్రీస్తు శకం 973లో ఈ చాళుక్య రాజైన తైలపుడు రాష్ట్రకూటులకు చివరి రాజుగా వ్యవహరించిన కర్కుడిని హతం చేసి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పాడు. ప్రస్తుత తెలంగాణ ప్రాంతాన్ని తైలపుడు రాజే పరిపాలించేవాడు. క్రీస్తు శకం 997లో తైలపుడు మరణించడంతో అతని కుమారుడైన సత్యాశ్రయుడు రాజపీఠాన్ని అధిష్టించాడు. అప్పట్లో వేములవాడలో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వర ఆలయం ఉండేది. ఇప్పటికీ ఇది ప్రఖ్యాతి చెందిన ఆలయం.

రాజరాజేశ్వరికి భక్తుడిగా మారిన సుందర చోళుడు
ఆపదల్లో ఉండే వారికి రాజరాజేశ్వరి దేవి అండగా ఉంటుందని అప్పటి ప్రజలు నమ్మేవారు. ప్రజలే కాదు చోళరాజు పరాంతక సుందర చోళుడు కూడా రాష్ట్రకూటుల నుంచి ఆపద తలెత్తినప్పుడు రాజరాజేశ్వరికి భక్తుడిగా మారిపోయాడు. రాజరాజేశ్వరే తనను కాపాడిందని నమ్మిన పరాంతక సుందర చోళడు తన కుమారుడికి 'రాజరాజ' అని నామకరణం చేశాడు. ఆ రాజరాజ చోళుడే క్రీస్తు శకం 985 నుంచి 1014 వరకు రాజ్యాన్ని పరిపాలించాడని చరిత్ర చెబుతోంది. అతని కుమారుడైన 'రాజేంద్రచోళ' సత్యాశ్రాయపై జరిపిన యుద్ధానికి సేనాధిపతిగా వ్యవహరించి విజయం సాధించాడు.

తండ్రికి శివలింగాన్ని బహుమతిగా ఇచ్చిన రాజేంద్రచోళ
రాజేంద్రచోళ తాను సాధించిన విజయానికి గుర్తుగా రాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసి, అందులోని భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. తన కొడుకు ఇచ్చిన శివలింగం కోసం క్రీస్తు శకం 1006లో ఏకంగా ఓ ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు రాజరాజ చోళ.

వేములవాడ నుంచి బృహదీశ్వరాలయానికి చేరిన శివలింగం
క్రీ.శ.1010లో నిర్మాణం పూర్తయ్యాక భారీ శివలింగాన్ని బృహదీశ్వరాలయంలో ప్రతిష్ఠించాడు. తమ రాజ్యంపై దాడి చేసి దోచుకున్న సొమ్ముతోనే బృహదీశ్వరాలయ నిర్మాణాన్ని చేపట్టినట్టు కూడా తమిళ శిలాశాసనాల్లో చోళ రాజులు వివరించడం ఈ సంఘటనకు అద్దం పడుతుంది. ఇప్పటికీ వేములవాడలోని భీమేశ్వరాలయ శివలింగానికి, బృహదీశ్వరాలయంలోని శివలింగానికి మధ్య సారూప్యతను చూడచ్చు.

పార్వతి నుంచి వేరయిన శివయ్య
వేములవాడ నుంచి శివలింగాన్ని పార్వతి నుంచి వేరుచేసి తంజావూరుకు తరలించినందుకు తెలంగాణ ప్రజల మనసు కలచివేసింది. బృహదమ్మ (పార్వతి) నుంచి శివలింగాన్ని వేరు చేసినందుకు గాను, తమ దు:ఖాన్ని చోళులకు తెలియజేస్తూ మేరు పర్వతమంత ఎత్తులో పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారు తెలంగాణవాసులు.

బృహదమ్మే బతుకమ్మ
అలా ప్రతి ఏడాది బతుకమ్మను జరపడం ఆనవాయితీగా మార్చుకున్నారు. దాదాపు 1000 సంవత్సరాల నుంచి బతుకమ్మను తెలంగాణ వాసులు జరుపుకుంటున్నారు. బతుకమ్మ పేరు కూడా బృహదమ్మ నుంచి వచ్చినదే. బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి తొమ్మిది రోజుల పాటు ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతారు. శివుడు లేని పార్వతి గురించి పాటలగా పాడుతూ బతుకమ్మను జరుపుకుంటున్నారు తెలంగాణ వాసులు.

మరో గాథ
బతుకమ్మ పండుగ వెనుక ఉన్న గాథల్లో మరో కథ ఇది. తెలంగాణా ప్రాంతానికి చెందిన ఓ బాలిక భూస్వాముల అకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంది. అప్పుడు ఆ ఊరి ప్రజలు అందరూ ఆమెను కలకాలం ‘‘బతుకమ్మ’’ అని దీవించారట. అప్పటి నుంచి ఆ బాలికను కీర్తిస్తూ, గౌరమ్మని పూజిస్తూ స్త్రీలకు సంబంధించిన పండుగగా ‘బతుకమ్మ’ పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. ‘బతుకమ్మ’ వేడుక సందర్భంగా స్త్రీలందరూ తమకు ఎలాంటి ఆపదలు రాకూడని, తమ భర్తకు, పిల్లలకు ఎలాంటి ఆపద రాకూడదని గౌరమ్మని వేడుకుంటారు.

మరో వృత్తాంతం
బతుకమ్మ పండుగకి సంబంధించి మరో వృత్తాంతం కూడా ప్రచారంలో వుంది. దక్షిణ భారతదేశాన్ని పాలించిన చోళ వంశ చక్రవర్తి ధర్మాంగదుడు సంతానం కోసం పూజలు చేయగా వారికి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఒక పాప పుట్టింది. ఆమెకు లక్ష్మీ అనే పేరు పెట్టారు. పసిబిడ్డ అయిన లక్ష్మీ అనేక గండాలను ఎదుర్కొంది. అప్పుడు తల్లి తండ్రులు ఆమెకు ‘‘బతుకమ్మ’’ అని పేరు పెట్టారు. అప్పటి నుంచి యువతులు మంచి భర్తను ప్రసాదించాలని కోరుతూ బతుకమ్మను పూజించడం ఆనవాయితీ అయిందట.

గండాలు తొలగించే పేర్లు
పాత రోజులలో వైద్య సౌకర్యాలు అంతగా లేని రోజుల్లో మాతాశిశు మరణాలు ఎక్కువగా ఉండేవి. పుట్టిన పిల్లలు పురిట్లోనే చనిపోతుండేవారు. ప్రాచీన సంప్రదాయం ప్రకారం పుట్టిన పిల్లలు దక్కకుండా చనిపోతూ ఉంటే, వారికి దిష్టి తగలకూడదని, గండాలు ఉండకూడదని ఇలాంటి పేర్లు పెట్టేవారు. ఉదాహరణకు ముసలమ్మ, బతుకమ్మ, తిరుపాలు ఇలాగ పేర్లు పెడితే బిడ్డలకు గండాలు తొలగిపోయి నూరేళ్లు జీవిస్తారని విశ్వాసం ఉండేది. ఏది ఏమైనా పండుగలు జరుపుకోవడం వెనుక ఉన్న కథలను తెలుసుకొని ఆ పండుగలను జరుపుకుంటేనే అసలైన ఆనందం. ఈ ఆనందం అందరికీ అందాలన్న చిన్న ప్రయత్నానికి అక్షర రూపమే ఈ కథనం.

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.