ETV Bharat / spiritual

గుడిలో మాదిరిగా ఇంట్లో దేవుడి విగ్రహాలను పూజించొచ్చా? - వాస్తుశాస్త్రం ఏం చెబుతుందంటే? - Idol Worship Vastu Tips - IDOL WORSHIP VASTU TIPS

Idol Worship Vastu Tips : చాలా మంది సాధారణంగా తమ పూజ గదిలో దేవుడి చిత్రపటాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. మరికొందరు మాత్రం ఇంట్లో దేవుడి చిత్రపటాలతో పాటు వివిధ దేవుళ్ల విగ్రహాలను ప్రతిష్ఠించి పూజిస్తుంటారు. అయితే, వాస్తుప్రకారం ఇంట్లో విగ్రహాలను పూజించొచ్చా? దీనిపై వాస్తు పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.

Vastu Tips For Idol Worship in Home
Idol Worship Vastu Tips (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 28, 2024, 5:24 PM IST

Vastu Tips For Idol Worship in Home : హిందూ పురాణాల ప్రకారం.. ఒక్కో దేవుడి ప్రతిమకు ఒక్కో ప్రాధాన్యత ఉంటుంది. అంతేకాదు.. ఆయా విగ్రహాలు నిర్దిష్టమైన శక్తి స్వరూపాన్ని కలిగి ఉంటాయని నమ్ముతారు. ఇదిలా ఉంటే.. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో దేవుళ్ల విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించడం మంచిదేనా? ఒకవేళ పూజిస్తే ఎలాంటి నియమ నిబంధనలను పాటించాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

వాస్తుశాస్త్రం ప్రకారం.. ఇళ్లలో దేవుడి ప్రతిమలను ప్రతిష్ఠించి పూజలు చేయొచ్చట. కానీ, పూజ గదిలో(Pooja Room) విగ్రహాలను పెట్టి పూజించే క్రమంలో కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. ఎందుకంటే.. ఈ విగ్రహాలు ఇంటి వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయంటున్నారు. అంతేకాదు.. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశించి నానా ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తుందని చెబుతున్నారు. మరి, వాస్తుప్రకారం.. ఎలాంటి నియమ నిబంధనలు పాటిస్తూ విగ్రహాలను పూజించాలో ఇప్పుడు చూద్దాం.

సైజ్ : చాలా మందికి దేవుడి విగ్రహాలను ఏ పరిమాణంలో ఉండేవి పూజించాలనే విషయంలో సందేహాలు వస్తుంటాయి. అయితే, వాస్తుప్రకారం.. మీ ఇంటి విస్తీర్ణం ఆధారంగా విగ్రహాల పరిమాణం ఎంచుకోవాలని చెబుతున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. అంటే.. చిన్న ఇల్లు ఉన్నవారు అందుకు తగినవిధంగా.. కొంచం పెద్ద ఇల్లు, పూజ గది ప్రత్యేకంగా ఉన్నవారు కొంచం పెద్ద సైజు ప్రతిమలను ప్రతిష్ఠించుకోవచ్చంటున్నారు. ఫలితంగా, ఎనర్జీ కూడా ఎక్కువగా వ్యాప్తి చెందుతుందంటున్నారు వాస్తు పండితులు.

చిత్తశుద్ధితో పూజలు : వాస్తుప్రకారం.. ఇంట్లో విగ్రహాలు పెట్టి పూజించేవారు తప్పనిసరిగా క్రమశిక్షణ పాటించాలంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. ముఖ్యంగా ఒకసారి దేవుడి ప్రతిమ ప్రతిష్ఠించాక డైలీ అభిషేకం, చిత్తశుద్ధితో పూజలు నిర్వహించాలి. అలాగే సమయాన్ని బట్టి ఎప్పటికప్పుడు విగ్రహాన్ని శుభ్రం చేస్తూ ఉండాలి. ఎందుకంటే, వాస్తుప్రకారం.. విగ్రహాన్ని ప్రతిష్ఠించాక పరిశుభ్రంగా చూసుకోకపోతే నెగటివ్ ఎనర్జీ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుందని వాస్తు పండితులు సూచిస్తున్నారు.

దెబ్బతిన్న విగ్రహాలు : ఇంట్లో విగ్రహాలను పూజించేవారు తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయమేమిటంటే.. డ్యామేజ్ అయిన విగ్రహాలను ఎట్టి పరిస్థితుల్లో పూజించకుండా చూసుకోవాలి. ఎందుకంటే వాస్తుశాస్త్రం ప్రకారం.. అలాంటి విగ్రహాలను పూజించడం అశుభకరం. అంతేకాదు.. వీటిని ఆరాధిస్తే పాజిటివ్ ఎనర్జీకి బదులు నెగటివ్ ఎనర్జీ రిలీజ్ అవుతుందని వాస్తు పండితులు సూచిస్తున్నారు.

ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే - లక్ష్మీదేవి అనుగ్రహం మీ వెంటే! - vastu tips for home

అలంకరణ : వాస్తుశాస్త్రం.. విగ్రహాలంకరణ చాలా ముఖ్యమని పేర్కొంటోంది. ముఖ్యంగా దేవుడి ప్రతిమలను సువాసన వెదజల్లే పూలతో అలంకరిస్తే ఆధ్యాత్మికత వెల్లువిరుస్తుందని చెబుతున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. అంతేకాదు.. విగ్రహాల నుంచి విడుదలయ్యే ఎనర్జీ రెట్టింపవుతుందని సూచిస్తున్నారు. ఇది ఇంట్లోని వారిపై సానుకూల ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. నిత్యం విగ్రహాలను పసుపు, కుంకుమలతో ఆరాధిస్తూ ఉంటే ఆ ఇల్లు శాంతి, సౌభాగ్యాలతో కళకళలాడుతుందంటున్నారు వాస్తు పండితులు.

విగ్రహాల స్వభావం : వాస్తుశాస్త్రం ప్రకారం.. దేవ, దేవతల విగ్రహాల స్వభావం కూడా చాలా కీలకం. ఎందుకంటే.. విగ్రహాలలో రౌద్రం, కరుణ, శాంత స్వభావాలను ప్రదర్శించేవి ఉంటాయి. అప్పుడు మనం ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొనాలంటే శాంత స్వభావం కలిగిన విగ్రహాలను ఎంచుకోవడం మంచిదని వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

అన్నప్రసాదాలు : సాక్షాత్తు దేవుడిగా భావిస్తూ పూజిస్తున్న విగ్రహాలకు అన్నప్రసాదాలు సమర్పించడం చాలా ముఖ్యమంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. ఈ చర్య ఆధ్యాత్మికతను మరింత పెంపొందిస్తుందని సూచిస్తున్నారు. చివరగా భక్తులు గుర్తుంచుకోవాల్సిన మరో విషయమేమిటంటే.. దేవుడి విగ్రహాలను నగలు, వస్త్రాలతో అలంకరించిన విధంగానే.. భక్తులు ఆయా రోజుల్లో అందుకు తగిన విధంగా తమ వస్త్రాలంకరణ ఉండేలా చూసుకోవాలని వాస్తు పండితులు సూచిస్తున్నారు.

Note : పైన తెలిపిన వివరాలు కొందరు వాస్తు నిపుణులు, వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

పూజ గదిలో దేవుడి ఫొటోలు లిమిట్​లో ఉండాల్సిందే! ఈవెనింగ్ దీపం కంపల్సరీ! - Pooja Room Vastu Rules

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.