ETV Bharat / spiritual

'అప్పుల బాధలు తీరట్లేదా? - కార్తిక మాసంలో "కందుల దీపం" వెలిగిస్తే విశేష ఫలితం!'

- కష్టాలు తొలగించే కందుల దీపం - దీపారాధన ఇలా చేస్తే అప్పుల నుంచి విముక్తి

How to Light Kandula Deepam in karthika Masam
How to Light Kandula Deepam in karthika Masam (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 13, 2024, 10:36 AM IST

How to Light Kandula Deepam in karthika Masam : అప్పు లేకుండా జీవితం సాగిపోవాలని అందరూ కోరుకుంటారు. కానీ.. మనలో చాలా మంది తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేస్తుంటారు. పిల్లలు చదువుల కోసం, కుటుంబ ఖర్చుల కోసం.. అంటూ అప్పు తీసుకుంటుంటారు. తీసుకున్నప్పుడు బాగానే ఉన్నా.. కొన్ని రోజుల తర్వాత అవి తీర్చలేనంత భారంగా మారిపోతాయి. దీంతో ఏం చేయాలో తెలియక దిక్కు తోచని స్థితిలో ఉంటారు. అయితే.. తీవ్రమైన అప్పుల నుంచి విముక్తి పొందడానికి శివకేశవులకు ప్రీతిపాత్రమైన కార్తిక మాసంలో కందుల దీపం వెలిగిస్తే మంచిదని ప్రముఖ జ్యోతిష్యుడు 'మాచిరాజు కిరణ్​ కుమార్'​ చెబుతున్నారు. మరి ఆ దీపం ఎలా వెలిగించాలో ఇప్పుడు చూద్దాం..

కార్తిక మాసం.. దీపారాధనకు విశిష్టమైనది. ఈ మాసంలో కందుల దీపం వెలిగించడం వల్ల ధనం చేతికి అంది అప్పులు తీరిపోతాయని మాచిరాజు చెబుతున్నారు. ఈ కందుల దీపాన్ని కార్తికంలో అన్ని మంగళవారాలు లేదా ఏదైనా ఒక మంగళవారం వెలిగిస్తే.. సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో రుణబాధలు తీరిపోతాయని చెబుతున్నారు.

ఎలా వెలిగించాలంటే:

  • ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తలస్నానం చేసి పూజ గదిని అలంకరించుకోవాలి.
  • ఆ తర్వాత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటానికి గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి.
  • అనంతరం ఆ ఫొటో ఎదురుగా పీట వేసి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి.
  • ఆ పీట మీద బియ్యప్పిండితో షట్కోణం ముగ్గు వేయాలి. ఆ ముగ్గు మీద వెండి లేదా రాగి లేదా ఇత్తడి పళ్లెం ఉంచాలి.
  • ఆ పళ్లెంకి ఐదు చోట్ల గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. అనంతరం పీట మీద ఉంచిన పళ్లెంలో 1 కేజీ ఎర్ర కందిపప్పు లేదా మసూర్​ పప్పు ఉంచాలి. కేజీ వీలుకాకపోతే ఓ గుప్పెడు ఎర్ర కందిపప్పును ఉంచొచ్చు.
  • ఇప్పుడు రెండు మట్టి ప్రమిదలు తీసుకుని వాటికి గంధం, కుంకుమ బొట్లు పెట్టి.. ఆ పప్పు మీద ఓ మట్టి ప్రమిదను ఉంచి దాని మీద మరో మట్టి ప్రమిదను ఉంచాలి.
  • ఇప్పుడు ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోయాలి. ఆ తర్వాత తొమ్మిది ఎర్ర వత్తులు తీసుకుని వాటన్నింటినీ ఒక వత్తిగా చేసి నువ్వుల నూనెలో ఉంచి దక్షిణం వైపు ఉండేలా దీపం వెలిగించాలి.
  • ఎర్ర వత్తులు అందుబాటులో లేకపోతే మామూలు వత్తులకు కుంకుమ రాసి తొమ్మిది వత్తులను ఒకటిగా చేసుకోవచ్చు.

కందుల దీపం కొండెక్కిన తర్వాత ఏం చేయాలంటే: దీపం కొండెక్కిన తర్వాత మట్టి ప్రమిదలను తీసి ఆ కందులను నీటిలో నానబెట్టాలి. అవి నానిన తర్వాత అందులో బెల్లం కలిపి గోమాతకు తినిపించాలి. లేకుంటే ఆ కందులను ఎవరికైనా దానంగా కూడా ఇచ్చుకోవచ్చు.

కార్తిక పౌర్ణమి రోజు "నక్షత్ర దీపారాధన" చేస్తే - గ్రహ, జాతక దోషాలన్నీ తొలగిపోతాయట!

కార్తిక మాసంలో ఉసిరిక దీపాలు ఎందుకు వెలిగించాలి? కలిగే ఫలితమేంటి?

"15న కార్తిక పౌర్ణమి పర్వదినం - ఆ రోజున తప్పక చేయాల్సిన పూజలు ఇవే!"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.