Horoscope Today May 23nd 2024 : మే 23న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) : మేష రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఈ రోజు గ్రహసంచారం అంత అనుకూలంగా లేనందున కొత్తగా ఏ పనులు మొదలు పెట్టవద్దు. మాట్లాడే ప్రతి మాట ఆచి తూచి మాట్లాడాలి. శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల్లో ఇబ్బందులు కలిగే అవకాశముంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగులకు బాధ్యతలు పెరిగే అవకాశముంది. సేవా కార్యక్రమాలు, దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక ప్రయోజనాలు మెరుగ్గా ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. గణపతి ప్రార్ధనతో ఆటంకాలు తొలగుతాయి.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. సమాజంలో గౌరవం, ప్రతిష్ట పొందుతారు. దూరదేశాల నుంచి శుభవార్తలు వింటారు. అనుకోని విధంగా సంపదలు కలిసివస్తాయి. కొన్ని రోజులుగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్యలు తొలగిపోతాయి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

మిథునం (Gemini) : మిధున రాశి వారికి ఈ రోజు విజయవంతంగా ఉంటుంది. ఇంటా బయట ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాలవారు ఈ రోజు అన్ని పనులు విజయవంతం పూర్తి చేస్తారు. సంఘంలో పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తారు. అదనపు ఆదాయం చేకూరుతుంది. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. ఉద్యోగులకు సహోద్యోగుల సహకారం లభిస్తుంది. పదోన్నతి, ఆర్ధిక ప్రయోజనాలు ఉంటాయి. శివారాధన శుభప్రదం.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యపై శ్రద్ధ అవసరం. అనారోగ్య సమస్యలు కారణంగా చికాకుతో ఉంటారు. చేసే పనుల్లో ఏకాగ్రత లోపిస్తుంది. సన్నిహితులతో మాట్లాడేటప్పుడు సహనం కోల్పోకండి. ఉద్యోగస్తులకు, వృత్తి వ్యాపార నిపుణులకు శ్రమకు తగిన ఫలం ఉండదు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే ఆటంకాలు తొలగిపోతాయి.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అవసరానికి మించిన ఆవేశం, మితిమీరిన ఆత్మవిశ్వాసం కారణంగా సన్నిహితులతో వివాదాలు రావచ్చు. పనులన్నీ ప్రాధాన్యం మేరకు చేసుకుంటూ వెళ్తే త్వరగా పూర్తవుతాయి. ముఖ్యమైన డాకుమెంట్లపై సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్తగా పరిశీలించండి. ఆర్ధిక ప్రయోజనాలు ఆశించిన మేరకు ఉండకపోవచ్చు. శ్రీలక్ష్మి ధ్యానం చేస్తే శుభ ఫలితాలు ఉంటాయి.

కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారులు భాగస్వామ్య ప్రాజెక్టులకు దూరంగా ఉండటం మంచిది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగులకు శుభ పరిణామాలు జరుగుతాయి. పెండింగ్ పనులను గట్టి పట్టుదలతో పూర్తి చేస్తారు. కుటుంబంలో చిన్నా చితకా చికాకులు ఉన్నా సహనంతో ఉంటే సర్దుకుంటాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఇతరుల మాటలకు ప్రలోభపడకండి. మీ సొంత ఆలోచనతో ముందుకెళితే కార్యసిద్ధి ఉంటుంది. వ్యాపార వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు ఆశించిన ప్రయోజనాలు ఉండవు. ఆదాయం సామాన్యంగా ఉంటుంది. ఆంజనేయ స్వామి ఆలయ సందర్శన శుభ ప్రదం.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. సమీప బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. గృహంలో శాంతి సౌఖ్యం నెలకొంటాయి. వృత్తి, ఉద్యోగ నిపుణులు మంచి శుభవార్తలు అందుకుంటారు. సన్నిహితులతో విహారయాత్రలకు వెళతారు. వ్యాపారులు కొత్త వ్యాపారాలను ప్రారంభించి లాభాలు అందుకుంటారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. శ్రీలక్ష్మి అష్టోత్తరం పఠిస్తే ప్రశాంతంగా ఉంటుంది.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. మీ మాటతీరు కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆరోగ్యం సహకరించదు. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. అదనపు ఆదాయం కోసం ప్రయత్నిస్తారు. వ్యాపారులు వ్యాపారంలో గట్టి పోటీని ఎదుర్కొంటారు. ఉద్యోగులకు శ్రమకు తగిన ఫలం ఉండకపోవచ్చు. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే అనుకూల ఫలితాలు ఉండవచ్చు.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. అవివాహితులకు వివాహం నిశ్చయం కావచ్చు. వ్యాపారులకు వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. ఉద్యోగులు కష్టపడి పని చేసి పదోన్నతి పొందుతారు. స్దాన చలనం కూడా ఉండవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనుకోని ఆపదలో చిక్కుకుంటారు. అయితే దైవబలం కాపాడుతుంది. ఆరోగ్యం విషయంలో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. నిరుద్యోగులకు సానుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ సూచన ఉంది. వ్యాపారస్తులకు భాగస్వాములతో సమస్యలు పరిష్కారమవుతాయి. మరిన్ని మెరుగైన ఫలితాల కోసం సుబ్రమణ్య స్వామిని ఆరాధించండి.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ముందు వెనుక చూడకుండా మాట్లాడి తగాదాలు తెచ్చుకోవద్దు. ఇంట్లో అశాంతి నెలకొంటుంది. ప్రతికూల ఆలోచనలు వీడండి. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు జరుగుతాయి. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. గురుగ్రహ శ్లోకాలు పఠించడం వల్ల ప్రశాంతత పొందుతారు.