Horoscope Today May 21th 2024 : మే 21న (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజంతా మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు చేసేవారికి అత్యంత లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగులు తమ ప్రతిభతో అందరినీ మెప్పిస్తారు. పదోన్నతి, జీతం పెరుగుదల వంటి ప్రయోజనాలు ఉంటాయి. అన్నింటా శుభయోగాలున్నాయి. ఆదిత్య హృదయం పారాయణ చేస్తే శుభం కలుగుతుంది.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనులు పూర్తి కావాలంటే పట్టుదల అవసరం. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ఉద్యోగులకు స్థానచలనం ఉండవచ్చు. గతంలో అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు పూర్తి చేస్తారు. సహోద్యోగుల సహకారం ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. నవగ్రహ ధ్యానం మేలు చేస్తుంది.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ వారం శుభకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. సొంత ఇంటి యోగం ఉంది. గృహంలో శాంతి, సౌఖ్యం నెలకొంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఉద్యోగులకు ప్రమోషన్ ఛాన్స్ ఉంది. లక్ష్మీకటాక్ష సిద్ధి ఉంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి కీలకమైన పనుల్లో పురోగతి ఉంటుంది. బంధుమిత్రుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది. విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. వ్యాపారులు రుణాలు చేయకుండా ఉంటే మేలు. ఎవరితోనూ అనవసర ప్రసంగాలు చేయవద్దు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మేలు. ఖర్చులు తగ్గించుకోండి. ఉద్యోగులకు స్వస్థాన పాప్తి ఉంది. శివారాధన మనోబలాన్ని పెంచుతుంది.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా అనుకూలమైన కాలం. వృత్తి నిపుణులకు, వ్యాపారులకు తమ తమ రంగాలలో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్లక్ష్యం తగదు. ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. శుభవార్తలు వింటారు. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. సంపదలు వృద్ధి చెందుతాయి. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. గతంలో రావాల్సిన బకాయిలు చేతికి అందుతాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. ఇష్ట దేవత ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

తుల (Libra) : తులారాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారికి, ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. రుణభారం పెరగకుండా చూసుకోండి. మీ స్వధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. నిందలు వేసేవారిని పట్టించుకోవద్దు. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. ఉద్యోగులకు స్థాన చలనం సూచితం. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మేలు జరుగుతుంది.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శుభ సమయం నడుస్తోంది. చేపట్టిన ప్రతి పనిలోనూ అఖండ విజయం సొంతమవుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొంచెం కోపం అదుపులో పెట్టుకొంటే మంచిది. లేకుంటే కుటుంబంలో కలహాలు రావచ్చు. దైవబలం అనుకూలంగా ఉంటుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు శుభయోగం ఉంది. సంపద వృద్ధి చెందుతుంది. చేయబోయే పనుల్లో స్పష్టత వస్తుంది. ఉద్యోగులు తమకు అప్పగించిన బాధ్యతలను పూర్తిగా నెరవేరుస్తారు. ఆశించిన ప్రయోజనాలను పొందుతారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు ప్రయాణాలు లాభిస్తాయి. శ్రీ సుబ్రమణ్య స్వామి ఆరాధన శ్రేయస్కరం.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనులు పూర్తి కావాలంటే ఓపిక, పట్టుదల అవసరం. అన్ని రంగాల వారికి సామాన్య ఫలితాలే ఉంటాయి. వ్యాపారులకు వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాల వలన ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. పెద్దల ఆశీర్వాద బలం అండగా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. శివారాధన శ్రేయస్కరం.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధర్మ చింతనతో ఉంటే వ్యతిరేక ఫలితాలు ఉండవు. గృహంలో అశాంతి నెలకొంటుంది. కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కోపాన్ని తగ్గించుకోండి. ఎవరితోనూ వాదనలు చేయవద్దు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. సమయానుకూలంగా వ్యవహరిస్తే అనుకున్నది సాధిస్తారు. వృత్తి వ్యాపార రంగాల వారు మనోబలంతో పని చేస్తే మంచి విజయాలు ఉంటాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. మీరంటే గిట్టని వారితో గొడవలకు దిగవద్దు. మానసికంగా ప్రశాంతం ఉండండి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.