Horoscope Today May 19th 2024 : మే 19న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీరు వేసే ప్రతి అడుగు సరైన ఫలితాలను తెస్తుంది. ఆర్థిక సంబంధమైన సభలకు హాజరు అవుతారు. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులను కలుసుకుంటారు. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతి, జీతం పెరుగుదల వంటి ప్రయోజనాలు ఉంటాయి. కార్యసిద్ధి హనుమాన్ ఆలయం దర్శిస్తే మరిన్ని శుభ ఫలితాలు ఉంటాయి.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కమ్యూనికేషన్, పత్రికారంగం వారికి ఈ రోజు విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి. మీ వాక్చాతుర్యంతో శ్రోతలను మంత్ర ముగ్ధుల్ని చేస్తారు. అసాధారణమైన తెలివితేటలు, ప్రతిభతో పనిచేసి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం సహకరించదు. ఉద్యోగులు గొప్ప శుభవార్తలు వింటారు. గృహంలో శాంతి, సౌఖ్యం నెలకొంటాయి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

మిథునం (Gemini) : మిధున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. నీటి గండం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చెడు అలవాట్లకు బానిస కావద్దు. ఆరోగ్యం క్షీణిస్తుంది. ఆర్ధిక నష్టం సూచితం. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. కుటుంబ సభ్యులతో గొడవ పడకండి. వ్యాపారులు ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. శివారాధన చేస్తే ఆపదలు తొలగుతాయి.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ మిత్రులు, సోదరుల నుంచి లబ్ధి పొందుతారు. బంధుమిత్రులతో విహారయాత్రలకు వెళతారు. చేపట్టిన అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ పోటీ దారులు, ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. అదృష్టం అవకాశాలు రూపంలో తలుపుతడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి వ్యాపారాలు ఉద్యోగాలు చేసేవారికి ఈ రోజుకు శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబసభ్యుల ప్రోత్సాహం ఉంటుంది. ఆర్ధికంగా పురోగతి చెందుతారు. ఉద్యోగస్తులు ఆశించిన ఫలితాలు పొందడం వల్ల సంతోషంగా ఉంటారు. భవిష్యత్ ప్రయోజనాల కోసం కొన్ని ఒప్పందాలు చేసుకుంటారు. అనవసర ఖర్చులు తగ్గించండి. వ్యాపారులకు శ్రమకి తగ్గ ఫలితాలు లభించవు. మెరుగైన ఫలితాల కోసం గణపతి ప్రార్ధన చేయండి.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. మీ మంచి మాటలతో అందరినీ ఆకర్షిస్తారు. ఇది మీకు చాలా రకాలుగా లాభం చేస్తుంది. మీ తెలివితేటలకు గుర్తింపు లభిస్తుంది. శారీరకంగా, మానసికంగా సంతోషంగా ఉంటారు. శుభవార్తలు అందుకుంటారు. కుటుంబంలో ఆనందం, సంతోషం నెలకొంటాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. స్థిరాస్తి రంగం వారికి శుభసమయం. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. తన కోపమే తన శత్రువు అన్న విషయం గుర్తుంచుకోండి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అనవసర చర్చల్లోకి దిగి తగాదాలు కొని తెచ్చుకోవద్దు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే కలహాలు వస్తాయి. ఆరోగ్యం దెబ్బతింటుంది. మీ కోపం కారణంగానే మీ పరువు ప్రతిష్ఠలు దెబ్బతింటాయి. కోర్టు కేసులకు సంబంధించి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. జాగ్రత్త వహించండి. నవగ్రహ స్తోత్రం పఠిస్తే గండాలు తొలగుతాయి.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. ఈ రోజు మెండుగా సుఖసంతోషాలను అందుకోగలుగుతారు. అవివాహితులకు ఇది శుభప్రదమైన రోజు. ఆర్థికపరంగా పారిశ్రామికవేత్తలందరూ చాలా లాభపడవచ్చు. మీరు మీ పై అధికారులను మెప్పిస్తారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళతారు. ఆదాయం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు తారాబలం అనుకూలంగా ఉంది. ఈ రోజు విరివిగా దానధర్మాలు చేసి అందరి మెప్పు పొందుతారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులు పనిచేసే చోట తమ పై అధికారులను మెప్పిస్తారు. పదోన్నతి వచ్చే అదృష్టం వుంది. వ్యాపారస్తులు వ్యాపార సంబంధమైన ప్రయాణం చేసే అవకాశం ఉంది. పితృవర్గం వారి సూచనలు పాటిస్తే మేలు జరుగుతుంది. సానుకూల ఫలితాల కోసం గురు శ్లోకాలు పఠించండి.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు తారాబలం అనుకూలంగా ఉంది. మీ ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి మంచి సమయం. కళాకారులు, రచయితలు ఈ రోజు మంచి నైపుణ్యం ప్రదర్శించగలరు. వృత్తి, వ్యాపార రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆదాయ వృద్ధి ఉంటుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ఈ రోజు చాలా ఇబ్బందులు, ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. కోపం, చిరాకు పెరుగుతాయి. మౌనంగా ఉంటూ, ధ్యానం చేస్తే ప్రశాంతంగా గడిపే అవకాశం వుంది. చట్టవిరుద్దమైన పనులు చేయవద్దు. మీ పద్దతి ద్వారా ఇతరులు భాధపడే అవకాశం వుంది. అందువల్ల వీలైనంతవరకు మంచి మాటలనే మాట్లాడండి. ఇంట్లో శుభకార్యం మూలంగా ధనవ్యయం ఉండవచ్చు. ఆంజనేయ దండకం చదువుకుంటే ఆపదలు తొలగుతాయి.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి. సినీ రంగం, కళారంగం వారికి అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు పై సంతకం చేస్తారు. వ్యాపారస్తులకు భాగస్వామ్య వ్యాపారాలు మేలు చేస్తాయి. మీ ప్రియమైన వారితో విందు వినోదాలలో పాల్గొంటారు. మీ సాధించిన విజయాలు మీకు సంఘంలో మంచి గుర్తింపు తీసుకు వస్తాయి. ఆర్ధికంగా పలు ప్రయోజనాలు అందుకుంటారు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.