ETV Bharat / spiritual

ఈరోజు ఆ రాశివారు జాగ్రత్త- ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది! - వార ఫలాలు

Horoscope Today March 6th 2024 : మార్చి 6న (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today March 6th 2024
Horoscope Today March 6th 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 6, 2024, 4:59 AM IST

Horoscope Today March 6th 2024 : మార్చి 6న (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : ఈ రోజు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేదంటే మీ పనులే కాదు వ్యక్తిగత సంబంధాలనూ దెబ్బతీస్తుంది. ఫలితంగా మీ పనిపై శ్రద్ధ పెట్టలేకపోతారు. ఈ రోజు కాస్త అనారోగ్యానికి గురవుతారు. ఈ రోజు ఒక ధార్మికమైన ప్రదేశాన్ని మీరు సందర్శిస్తారు. లేదంటే ఒక శుభప్రదమైన కార్యక్రమానికి ఆహ్వానితులుగా వెళ్తారు.

.

వృషభం (Taurus) : పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. అయితే ఫలితాల గురించి ఎదురు చూడకూడదు. నూతన పనులు ప్రారంభించేందుకు ఈ రోజు అనుకూలంగా లేదు. శారీరక ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెడుతుంది. ప్రయాణాల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. మీరు తీసుకునే ఆహారం పట్ల జాగ్రత్త వహించండి. ఆధ్యాత్మిక చింతన, ధ్యానం ఈ రోజు మీకు కాస్త ఉపశమనాన్ని కలుగజేస్తాయి.

.

మిథునం (Gemini) : శారీరకంగా ఈ రోజు మీరు ఎనలేని తృప్తిని పొందుతారు. ఈ రోజు మీరు అనుకోని వ్యక్తులను కలుసుకుంటారు. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో కలిసి ఓ ట్రిప్​న​కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. షాపింగ్​ కోసం ఖర్చులు చేస్తారు. సమాజంలో మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. శారీరకంగా ఫిట్​గా ఉంటారు. మీ భాగస్వామితో ఈ రోజు మీరు ఏకాంతంగా గడుపుతారు. ఇది మీకు శారీరక సుఖాన్ని ఇస్తుంది.

.

కర్కాటకం (Cancer) : ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడవచ్చు. ఉద్యోగులకు ఈ రోజు మంచి రోజు. సహోద్యోగులు సహకరిస్తారు. ఈ రోజు మీరు చేపట్టిన పనులకు ప్రశంసలు అందుకుంటారు. శారీరకంగా దృఢంగా ఉంటారు. మీకు వ్యతిరేకంగా నెలకొన్న పరిస్థితులన్నీ సానుకూలంగా మారే అవకాశం ఉంది.

.

సింహం (Leo) : ఈ రోజు మీరు సంతోషంగా గడుపుతారు. మీ కల్పనా శక్తి మెరుగుపడుతుంది. ప్రకృతిపై కవిత్వాలు రాసేందుకు ప్రేరణ దొరుకుతుంది. ప్రియమైనవారిని, మీ స్నేహితులను కలుసుకుంటారు. వారితో ఆనందంగా గడుపుతారు. మీ పిల్లల అభివృద్ధికి సంబంధించిన సమాచారాన్ని ఈ రోజు మీరు తెలుసుకుంటారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. దానానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

.

కన్య (Virgo) : ఈ రోజు ప్రతికూల పరిస్థితులు ఎదురుకావచ్చు. శారీరక ఆరోగ్యం ఇబ్బందులు పెడుతుంది. కొన్ని ఆందోళనలు మీ మనసును ఇబ్బంది పెట్టవచ్చు. మీ జీవిత భాగస్వామితో వాదనలకు, ఘర్షణలకు దిగకండి. మీ తల్లిగారి అనారోగ్య సమస్య మిమ్మల్ని మరింత బాధించవచ్చు. ఆస్తికి సంబంధించిన వ్యవహరాల్లో జాగ్రత్తగా ఉండండి.

.

తుల (Libra) : ఈ రోజు మొత్తం మీకు లాభదాయకంగా గడుస్తుంది. మీ బంధువులతో, కుటుంబ సభ్యులతో స్నేహపూర్వక వాతావరణాన్ని ఏర్పరుచుకుంటారు. ఒక తీర్థయాత్రకు వెళ్లవచ్చు. ఆర్థికంగా లబ్ధి పొందుతారు. విదేశాల నించి శుభవార్త వింటారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. నూతన పనులను ప్రారంభించేందుకు ఈ రోజు మంగళకరమైన రోజు. శారీరకంగా, మానసికంగా బలంగా ఉంటారు. పెట్టుబడులు పెట్టేవారికి ఈ రోజు అనుకూలంగా ఉంది.

.

వృశ్చికం (Scorpio) : మీ ఇంట్లో సామరస్యమైన వాతావరణం ఏర్పడాలంటే కాస్త మీ నోరును అదుపులో పెట్టుకోండి. మీ దురుసు ప్రవర్తన కారణంగా ఈ రోజు ఒకరు బాధపడతారు. అందుకని వారిని నొప్పించకుండా ఉండేలా జాగ్రత్త పడండి. ప్రతికూల పరిస్థితులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకండి. ఆరోగ్యం ఇబ్బంది పెట్టవచ్చు.

.

ధనుస్సు (Sagittarius) : పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు ఈ రోజు ప్రణాళికలు రచిస్తారు. ఈ రోజు మీరు చేపట్టిన పనులను చక్కగా పూర్తి చేస్తారు. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. ఇవి మీలోని నమ్మకాన్ని మరింత పెంచుతాయి. గృహంలో ఓ శుభకార్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. మీకు నచ్చిన వ్యక్తిని కలుసుకుంటారు. వారితో ఆనందంగా గడుపుతారు.

.

మకరం (Capricorn) : ఆధ్యాత్మికపరమైన అంశాలపై ఈ రోజు మీరు దృష్టి పెడతారు. ఇందుకోసం డబ్బులు ఖర్చు చేస్తారు. కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో శ్రద్ధ పెట్టండి. కొన్ని విషయాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే మంచిది.

.

కుంభం (Aquarius) : నిర్దేశించుకున్న లక్ష్యాలను ఎలా చేరుకోవాలనే దానిపై కసరత్తులు చేస్తారు. అందుకు తగ్గ సత్తువా మీకు ఉందని గుర్తుంచుకోండి. కష్టపడి పనిచేస్తారు. మీరు వెళ్లాల్సిన సరైన మార్గాన్ని మీరు ఈ రోజు ఏర్పాటు చేసుకుంటారు.

.

మీనం (Pisces) : ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. అదృష్టం కలిసి వస్తుంది. అప్పగించిన పనులను గడువు కంటే ముందే పూర్తి చేస్తారు. కుటుంబానికి సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొంటారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.