ETV Bharat / spiritual

ఆ రాశివారికి తీవ్ర ఆర్థిక నష్టం- కొత్త పనులు ప్రారంభించడానికి మంచి రోజు కాదు! - Horoscope Today June 14th 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 14, 2024, 5:00 AM IST

Horoscope Today June 14th 2024 : జూన్​ 14న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today June 14th 2024
Horoscope Today June 14th 2024 (ETV Bharat)

Horoscope Today June 14th 2024 : జూన్​ 14న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేసేపని పట్ల స్పష్టతతో ఉండడం, చిత్తశుద్ధితో పనిచేయడం మీ విజయసూత్రాలు. కళాకారులకు, రచయితలకు ఈ రోజు గొప్ప ప్రయోజనాలు ఉంటాయి. సమాజంలో గుర్తింపు, సన్మాన సత్కారాలు పొందుతారు. వృత్తి వ్యాపార రంగాల వారికి ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగులకు జీతం పెరుగుదల వంటి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. నూతన బాధ్యతలను చేపడుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఈశ్వర ఆరాధన శ్రేయస్కరం.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో మీ మాటతీరు మార్చుకుంటే మంచిది. కోపాన్ని నియంత్రించుకుంటే మేలు. గృహంలో వాతావరణం ఉద్రిక్త వాతావరణం ఉంటుంది. అనవసర కలహాలు ఉండవచ్చు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. వృత్తి నిపుణులకు వ్యాపార రంగాల వారికి వృత్తివ్యాపారాలలో తీవ్ర ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్ధికంగా నష్టపోయే సూచనలు ఉన్నాయి. కార్యసిద్ధి హనుమ ఆరాధనతో ఆటంకాలు తొలగిపోతాయి.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులు చేపట్టిన ప్రాజెక్టులలో గొప్ప విజయాలను అందుకుంటారు. వృత్తి వ్యాపార రంగాల వారికి మెరుగైన ఆర్ధిక ప్రయోజనాలు, పనిలో పురోగతి ఉంటాయి. కుటుంబంలో గొడవలు, అపార్థాలు ఉండవచ్చు. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. శివారాధన మేలు చేస్తుంది.

.

కర్కాటకం (Cancer) : మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులు చేపట్టిన ప్రాజెక్టులలో గొప్ప విజయాలను అందుకుంటారు. వృత్తి వ్యాపార రంగాల వారికి మెరుగైన ఆర్ధిక ప్రయోజనాలు, పనిలో పురోగతి ఉంటాయి. కుటుంబంలో గొడవలు, అపార్థాలు ఉండవచ్చు. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. శివారాధన మేలు చేస్తుంది.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో మీరు చేపట్టే పనులన్నీ ఈ రోజు దిగ్విజయంగా పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో సమర్థవంతంగా అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ నాయకత్వ లక్షణాలతో అందరినీ ఆకర్షిస్తారు. ఉద్యోగ వ్యాపార రంగాల వారికి ఆర్థికంగా గొప్ప ప్రయోజనాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చులుంటాయి. శ్రీలక్ష్మి గణపతి ఆరాధన శుభప్రదం.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. భావోద్వేగంతో, తొందరపాటుతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేస్తే మంచిది. ఉద్యోగులు పని విషయంలో నిర్లక్ష్యం కూడదు. ఖర్చులను అదుపులో ఉంచుకుంటే మంచిది. సన్నిహితులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకునే మంచిది. వ్యాపార రంగం వారు, స్థిరాస్తి రంగం వారు ఆచి తూచి వ్యవహరిస్తే మంచిది. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే అనుకూల ఫలితాలు ఉంటాయి.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. గ్రహ సంచారం సరిగా లేనందున ఈ రోజు అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ప్రతికూలతలు ఎదురవుతాయి. ఉద్యోగులకు పనిఒత్తిడి, ఆర్థిక నష్టం ఉండవచ్చు. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. ఈ రోజు కొత్త పనులను ప్రారంభించడం మంచిది కాదు. అనారోగ్య సమస్యల కారణంగా పనిపట్ల ఏకాగ్రత లోపిస్తుంది. శివునికి అభిషేకం చేయించుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు విజయవంతంగా ఉంటుంది. గొప్ప ఆత్మవిశ్వాసంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారు. అన్ని పనులు సకాలంలో పూర్తి చేయడం వలన ఉద్యోగంలో, వ్యాపారంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. ఉన్నతాధికారుల గుర్తింపు పొందుతారు. పదోన్నతి, జీతం పెంపు వంటి ప్రయోజనాలను అందుకుంటారు. స్నేహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. గణపతి ప్రార్థన శుభకరం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు సాధారణ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపార రంగాల వారికి ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో తీర్థ యాత్రలకు వెళతారు. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగులు సహోద్యోగుల సహకారంతో అన్ని పనులు సకాలంలో పూర్తి చేసి పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. గురుగ్రహ శ్లోకాలు పఠిస్తే అనుకూల ఫలితాలు ఉంటాయి.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యలు అధికం కావడం వల్ల చికాకులు, కోపం ఎక్కువవుతాయి. ఆరోగ్యం పట్ల చింత పెరుగుతుంది. వృత్తి వ్యాపార రంగాల వారు ఎంత కష్టపడినా చివరికి ప్రతికూల ఫలాలే ఉంటాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం అవసరం. ప్రతికూల ఆలోచనలకు స్వస్తి చెప్పండి. ఒత్తిడిని దూరం చేసుకోడానికి యోగా చేయండి. అనుకోని ఖర్చులు ఉండవచ్చు. నవగ్రహ ప్రదక్షిణాలు చేయడం వలన మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారులు వ్యాపార భాగస్వాములతో, కస్టమర్లతో సమయానుకూలంగా వ్యహరిస్తే ప్రయోజనం ఉండవచ్చు. ఉద్యోగస్తుల పనితీరు పట్ల పై అధికారులు అసంతృప్తితో ఉంటారు. అనవసర విషయాలలో జోక్యం చేసుకోవద్దు. ఆర్థికంగా ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. గృహంలో శాంతి, సౌఖ్యం నెలకొంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఆత్మీయత లోపిస్తుంది. జీవిత భాగస్వామితో కలహాలు ఉండవచ్చు. వృత్తి వ్యాపార రంగాల వారికి ముఖ్యమైన పనులు పెండింగ్ పడవచ్చు. ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహకారం ఉంటుంది. ఆర్థికపరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. కార్యసిద్ధి హనుమాన్ ఆలయ సందర్శనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.