ETV Bharat / spiritual

నేడు ఆ రాశి వారికి అన్నీ ప్రతికూల ఫలితాలే- ఆరోగ్యం విషయంలో జాగ్రత్త! - Daily Horoscope

Horoscope Today July 7th 2024 : జులై​ 7న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 7, 2024, 5:11 AM IST

Daily Horoscope
Daily Horoscope (ETV Bharat)

Horoscope Today July 7th 2024 : జులై​ 7న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేష రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఫలితాలు నిరాశ కలిగిస్తాయి. ఆర్థిక సమస్యలు చుట్టు ముడతాయి. స్నేహితుల మధ్య అపార్థాలు, అనుమానాలు నెలకొంటాయి. బంధువులతో వైరం ఏర్పడటం వల్ల అశాంతిగా ఉంటారు. ఆస్తి, భూతగాదాలకు అవకాశముంది. ముందు జాగ్రత్త చర్యలు చేపడితే మంచిది. ఈ రోజు ఎలాంటి ఒప్పందాలపై సంతకాలు చేయవద్దు. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపార రంగాల వారికి పనులు సకాలంలో పూర్తికాక వ్యవహారాలు ఇబ్బందికరంగా, సంక్లిష్టంగా మారుతాయి. ఉద్యోగులు ఓటములు, సవాళ్లు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. సమర్ధవంతంగా సమస్యలను అధిగమిస్తారు. దైవబలంతో క్లిష్ట పరిస్థితుల నుంచి బయట పడతారు. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. గత తప్పిదాలకు ఫలితం ఇప్పుడు అనుభవిస్తుంటారు. గతం తాలూకు చేదు జ్ఞాపకాలను వీడి ముందడుగు వేస్తే పురోగతి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఆర్ధిక పరిస్థితి మెరుగు పడుతుంది. అవసరానికి ధనం అందుతుంది. ఉద్యోగులు సహోద్యోగుల సహకారంతో అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన బాధ్యతలు చేపడతారు. శివారాధన శ్రేయస్కరం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజంతా సరదాగా, సంతోషంగా గడిచిపోతుంది. ఇప్పటి వరకు ఇబ్బంది పెట్టిన సమస్యలు తీరి పోతాయి. ఆర్ధికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలతో పాటు స్థాన చలనం కూడా ఉండవచ్చు. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. అన్ని రాసుల వారికి ఈ రోజు ఊహించని లక్ష్మీ కటాక్షం ఉంటుంది. షేర్లు, స్టాకుల ద్వారా విపరీతమైన ఆర్థిక లబ్ధి అందుకుంటారు. వ్యాపారులకు పెట్టుబడలతో మంచి లాభాలు వస్తాయి. పాత బకాయిలు తీర్చేస్తారు. రావలసిన బకాయిలు చేతి అందుతాయి. ఉద్యోగులకు కొంత కాలంగా పెండింగ్ ఉన్న ప్రమోషన్ కాగితాలు చేతికి అందుతాయి. కుటుంబ సభ్యులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

కన్య (Virgo) : కన్యరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఇన్ని రోజుల ఎదురుచూపులకు ముగింపు పలికే తరుణం వచ్చింది. ఈ రోజు వ్యక్తిగతంగా, వృత్తి పరంగా గొప్ప ప్రయోజనకరంగా ఉంటుంది. అనుకోని సంపదలు వరిస్తాయి. వృత్తి వ్యాపార రంగాలలో అనుకూలతలు ఉంటాయి. ఉద్యోగులు ఆశించిన ప్రమోషన్ అందుకుంటారు. జీవిత భాగస్వామితో కలిసి విహార యాత్రలకు వెళ్తారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆదిత్య హృదయం పారాయణ శ్రేయస్కరం.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రమోషన్, ఇంక్రిమెంట్లు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సందర్శన శుభకరం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి చాలా పెరుగుతుంది. శ్రమతోనే విజయం ఉంటుంది. వ్యాపారంలో ఆటుపోట్లు ఎదురవుతాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువులతో మనస్పర్థలు ఏర్పడే అవకాశం ఉంది. కోపాన్ని అదుపులో ఉంచుకునే మంచిది. బంధువులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సమస్యలతో మనశ్శాంతి లోపిస్తుంది. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. అనుకోని ఆపదలు ఎదురవుతాయి. డబ్బు నష్టం తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఉద్యోగులకు కొత్త సవాళ్లు ఎదురవుతాయి. తీరిక లేకుండా పని చేయాల్సి రావడం వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుంది. అన్ని వైపుల నుంచి సమస్యల కారణంగా మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అభయ ఆంజనేయ స్వామి ఆలయ సందర్శనతో ప్రతికూలతలు తొలగిపోతాయి.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంది. గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందున అన్ని రంగాల వారికి చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం, ఆర్థిక లాభాలు ఉంటాయి. వ్యాపార రంగంలో విపరీతమైన లాభాలు వస్తాయి. ఈ విజయం మీ కష్టానికి ప్రతిఫలం. ఉద్యోగంలో గొప్ప మార్పులు చోటు చేసుకుంటాయి. అనుకోని రీతిలో పదోన్నతులు పొందుతారు. జీతం పెరుగుతుంది. బంధు మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఈ రోజు తమ తమ రంగాల్లో విజయాన్ని చూస్తారు. మీ పనితీరుకు, సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు సంతృప్తి, ఆనందాన్ని ఇస్తుంది. ఈ రోజంతా మీరు ఉత్సాహంగా ఉంటారు. ధనాదాయం పెరుగుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపార రంగాలలో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ఆర్ధిక పురోగతి సాధిస్తారు. రచయితలకు, సాహిత్య రంగాల వారికి శుభ ఫలితాలు ఉంటాయి. సమాజంలో సన్మాన సత్కారాలు అందుకుంటారు. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. జలగండం ఉంది కాబట్టి నీటికి దూరంగా ఉండండి. గణపతి ప్రార్ధన శుభకరం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.