ETV Bharat / spiritual

ఈరోజు ఆ రాశివారికి పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్​- వ్యాపారంలోనూ మంచి లాభాలు! - Daily Horoscope In Telugu

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 31, 2024, 3:23 AM IST

Horoscope Today July 31th 2024 : జులై​ 31న (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today July 31th 2024
Horoscope Today July 31th 2024 (ETV Bharat)

Horoscope Today July 31th 2024 : జులై​ 31న (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి పనిభారం పెరగడం వల్ల ఒత్తిడికి లోనవుతారు. ఆరోగ్య సమస్యలు కూడా ఏర్పడవచ్చు. ఆహారవ్యవహారాల్లో మార్పులు చేసుకోవడం వలన స్వస్థత పొందవచ్చు. వృత్తివ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఒత్తిడిని పక్కనపెట్టి కుటుంబ సభ్యులతో సరదాగా గడపండి. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. సన్నిహితులు, సహచరులతో సత్సంబంధాలు కలిగిఉంటే మంచిది. వ్యాపారస్థులు వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. గ్రహసంచారం అనుకూలంగా ఉన్నందున ఈ రాశి వారిని అదృష్టం వరిస్తుంది. నూతనోత్సాహాంతో పనిచేసి అద్భుతాలను సాధిస్తారు. ఉద్యోగస్థులు చేసే పని మీద నిశితమైన దృష్టి పెట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక సంబంధమైన విషయంగా కూడా ఈ రోజు మంచి రోజు. అన్ని వైపులా నుంచి ధనప్రవాహం ఉంటుంది. గృహంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారు వృత్తి వ్యాపారాల్లో రాణించాలంటే సమయానుకూలంగా నడుచుకోవాలి. కోపం అదుపులో పెట్టుకోకపోతే కుటుంబ సభ్యులు, స్నేహితులతో, అనవసరమైన వివాదాలు, అపార్థాలూ ఏర్పడే అవకాశముంది. ఆరోగ్య సంబంధమైన సమస్యలతో సతమతమవుతారు. వృధా ఖర్చులు ఉండవచ్చు. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాల్లో పురోగతి, ఆర్థిక సంబంధమైన లబ్ధి ఉంటుంది. నికరమైన ఆదాయ అభివృద్ధి, భవిష్యత్ అవసరాల కోసం ఫండ్స్ ఏర్పాటు చేసుకోవడానికి ఇది సరైన సమయం. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. అవివాహితులకు కోరుకున్న వారితో వివాహం నిశ్చయమవుతుంది. కుటుంబ సభ్యులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ వినాయకుని ఆలయ సందర్శన శుభప్రదం.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఆత్మవిశ్వాసం, చిత్తశుద్ధితో పనిచేసి తిరుగులేని విజయాలు సాధిస్తారు. ఉద్యోగస్థులు అన్ని పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. అదృష్టం వరించి ప్రమోషన్ పొందుతారు. ఆస్తి వ్యవహారాల్లో అనుకూలత ఉంది. స్థిరాస్తి డాక్యుమెంట్లు చూడడానికి మంచి రోజు. ముఖ్యమైన వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

కన్య (Virgo) : కన్యరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో విజయం ఆర్ధిక లాభాలు ఉంటాయి. ఉద్యోగస్థులు సందర్భానుసారం నడుచుకుంటే అంతా అనుకూలంగా ఉంటుంది. ఒక్క నెగిటివ్ కూడా ఉండదు. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వ్యవహారాల్లో సన్నిహిత సంబంధీకుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది. విదేశాల్లోని మిత్రుల నుంచి అందిన శుభవార్తలతో మీ ఇంట్లో సంతోషం నెలకొంటుంది. కార్యసిద్ధి హనుమ ఆలయ సందర్శన శుభకరం.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ముందు అందరితో పరుషంగా వ్యవహరించి, సమస్యలు వచ్చాక బాధపడినా ప్రయోజనం ఉండదు. కోపం వల్ల ఏ సమస్యలూ తీరవు. మాట్లాడేది జాగ్రత్తగా మాట్లాడాలి. దైవబలం మీద విశ్వాసం ఉంచి పనిచేస్తే సమస్యలు తొలగవచ్చు. చట్ట విరుద్ధమైన పనులు చెయ్యకండి. ఆర్ధిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మేలు జరుగుతుంది.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాల్లో మంచి పురోగతి, ఆర్ధిక అభివృద్ధి ఉంటాయి. బాధ్యతలు పక్కన పెట్టి పని నుంచి విరామం తీసుకొని కుటుంబంతో సరదాగా గడపండి. స్నేహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్ధికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. శ్రీలక్ష్మీగణపతి ఆలయ సందర్శన శుభప్రదం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ రోజు వ్యాపారస్థులకు ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. వ్యాపార సంబంధిత పనులపై అత్యవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆర్థిక సమస్యలు తీవ్రమవుతాయి. అయితే తిరుగులేని నాయకత్వంతో, గొప్ప ప్రతిభతో సమస్యలను అధిగమిస్తారు. ఉద్యోగస్థులకు ఆశించిన ప్రయోజనాలు ఉండవచ్చు. దైవబలంతో అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. శివారాధన శ్రేయస్కరం.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల వారికి శ్రమకు తగిన ఫలం ఉంటుంది. పాత స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపారంలో పోటీదారులు నుంచి సవాళ్లు ఎదురవుతాయి. ప్రత్యర్థుల వైఖరి ఓ కంట కనిపెడుతూ ఉండటం అవసరం. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆంజనేయ స్వామి ఆరాధనతో శత్రుజయం ఉంటుంది.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసేవారు మీ పక్కనే ఉంటారు. వ్యూహాత్మకంగా వ్యహరించాలి. ఎక్కడా నిగ్రహం కోల్పోవద్దు. ఇంట్లో, ఆఫీస్​లోనూ సమస్యలు ఏర్పడతాయి. సన్నిహితులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. వృత్తి నిపుణులు, వ్యాపారస్థులకు మంచి ఫలితాలు ఉంటాయి. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారంలో సమష్టి నిర్ణయాలు తీసుకోవడానికి మంచిరోజు. ఉన్నతంగా ఆలోచించి అందరి ప్రశంసలు పొందుతారు. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ఆదాయం పదింతలు పెరుగుతుంది. సృజనాత్మకత, స్థిరత్వం, ఆత్మవిశ్వాసం మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.