Horoscope Today July 24th 2024 : జులై 24న (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
![](https://assets.eenadu.net/article_img/1mesham_44.jpg)
మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఎలాంటి ప్రతికూలతలు లేకుండా ఈ రోజు ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉంటుంది. ఎటువంటి ఆందోళనలు ఉండవు. వృత్తి, ఉద్యోగ రంగాల వారు ఒకేసారి అన్ని పనులు చేయాలన్న హడావిడిలో ఒత్తిడికి లోనుకావద్దు. సరైన ప్రణాళిక ప్రకారం పనిచేస్తే ఎలాంటి ఒత్తిడులు ఉండవు. వ్యాపారంలో అధిక లాభాలు ఉంటాయి. ఇష్ట దేవతారాధన శుభకరం.
![](https://assets.eenadu.net/article_img/2vrushabham_45.jpg)
వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల వారు రోజువారీ పనుల నుంచి కాస్త విరామం తీసుకొని సన్నిహితులతో సరదాగా విహార యాత్రకు వెళతారు. మీ సహజ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి శుభ సమయం నడుస్తోంది. ఉన్నత విద్య అభ్యసించేవారికి విదేశాలకు వెళ్లే అవకాశం వస్తుంది. ఆర్ధికంగా పుంజుకుంటారు. శివారాధన శ్రేయస్కరం.
![](https://assets.eenadu.net/article_img/3mithunam_42.jpg)
మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. వృత్తి, వ్యాపార రంగాల వారు ఈ రోజు కొత్తగా ఏ పనులు మొదలు పెట్టడం మంచిది కాదు. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. చికిత్స నిమిత్తం అధిక ధనవ్యయం ఉండవచ్చు. వృత్తిపరంగా పరిస్థితులు అనుకూలించవు. ఉన్నతాధికారులు మీ పని పట్ల అసంతృప్తిగా ఉంటారు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ముఖ్యమైన పనులు, నిర్ణయాలు వాయిదా వేయాలి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.
![](https://assets.eenadu.net/article_img/4karkatakam_39.jpg)
కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు ఈ రోజు చేపట్టిన ప్రతి పనిలోనూ ఆచి తూచి వ్యవహరించాలి. ఆర్ధిక లావాదేవీలు నిర్వహించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఏ పని చేసినా ప్రశాంతంగా, జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో ఘర్షణలు మానుకోవాలి. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ సందర్శన శుభప్రదం.
![](https://assets.eenadu.net/article_img/5simham_41.jpg)
సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. అన్ని రంగాల వారికి తమ తమ రంగాలలో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. వ్యాపారులు వృధా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. కుటుంబ పరిస్థితులు క్లిష్టంగా మారుతాయి. జీవిత భాగస్వామితో కలహాలు ఏర్పడవచ్చు. నిరుద్యోగులు మంచి ఉద్యోగం కోసం మరికొంత కాలం వేచి చూడాలి. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. హనుమాన్ ఆలయ సందర్శనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.
![](https://assets.eenadu.net/article_img/6kanya_44.jpg)
కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వృత్తినిపుణులకు, వ్యాపారులకు ఒక అద్భుతమైన రోజు. మీ పోటీదారులు, భాగస్వాములు, సహోద్యోగుల కంటే మీరు ఉన్నత స్థానంలో ఉంటారు. సహోద్యోగుల సంపూర్ణ సహకారం ఉంటుంది. కుటుంబ కలహాలు చికాకు పెడతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.
![](https://assets.eenadu.net/article_img/7tula_41.jpg)
తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి తమ తమ రంగాలలో కృషికి తగిన ఫలితం ఉండక పోవచ్చు. కళాకారులు, సినీ రంగం వారు మీ అద్భుతమైన ప్రవర్తనతో అభిమానులను సంపాదించుకుంటారు. రచయితలు, సాహితీవేత్తలు విషయానికి వస్తే, చర్చల్లో, వాదనల్లో, మీ ఆలోచనా విధానం ఇతరులను ప్రభావితం చేయగలదు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.
![](https://assets.eenadu.net/article_img/8vrutchikam_42.jpg)
వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఎవరైతే మీరు ప్రాణ స్నేహితులు, బంధువులు అనుకుంటారో వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. నమ్మించి మోసం చేసే వారు మీ పక్కనే ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో పెద్దల అనారోగ్యం ఆందోళన కలిగించవచ్చు. ఆర్ధిక వనరులు, ప్రతిష్ట కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కుటుంబంలో కలహాలు పెరుగుతాయి. శివారాధనతో ప్రతికూలతలు తొలగిపోతాయి.
![](https://assets.eenadu.net/article_img/9danassu_40.jpg)
ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇన్ని రోజుల మీ కఠిన శ్రమ, ప్లానింగ్ అంతా బూడిదలో పోసిన పన్నీరుగా మారుతుంది. అన్ని రంగాల వారు వృత్తి, వ్యాపారాలలో నష్టాల కారణంగా తీవ్ర నిరాశకు లోనవుతారు. కుటుంబంలో, పని ప్రదేశంలో ఇతరులతో అభిప్రాయభేదాలు పెరుగుతాయి. నిరాశను వీడండి. ఆత్మవిశ్వాసంతో ఉంటే అన్ని పరిస్థితులు చక్కబడతాయి. నవగ్రహ శ్లోకం పఠిస్తే మేలు జరుగుతుంది.
![](https://assets.eenadu.net/article_img/10makaram_43.jpg)
మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ప్రతికూలత కారణంగా భవిష్యత్ ఆలోచనలతో ఒత్తిడికి గురవుతారు. వాస్తవాలను తెలుసుకొని సమయానుకూలంగా నడుచుకోవాలి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. దైవబలం అండగా ఉంటుంది. పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. ఈశ్వర ఆరాధన శ్రేయస్కరం.
![](https://assets.eenadu.net/article_img/11kumbam_43.jpg)
కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు ప్రారంభించిన పనుల్లో విఘ్నాలు ఎదురైనా అధిగమిస్తారు. వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. ప్రతికూల ఆలోచనలు వీడితే శుభ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి బహుమతులు అందుకుంటారు. బంధు మిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. అవివాహితులకు వివాహం జరిగే అవకాశం ఉంది. గణపతి ఆళవ సందర్శనం శుభకరం.
![](https://assets.eenadu.net/article_img/12meenam_44.jpg)
మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఉద్యోగంలో కావాలని ఇబ్బంది పెట్టే వారి కారణంగా చిక్కుల్లో పడతారు. స్నేహితుల సహాయంతో ఇబ్బందికర పరిస్థితుల నుంచి బయటపడతారు. ఆర్థికంగా పుంజుకుంటారు. శ్రీరామ నామ పారాయణం శక్తినిస్తుంది.