ETV Bharat / spiritual

ఆ రాశివారికి ఆకస్మిక ధనలాభం - ఉద్యోగులకు స్థానచలనం పక్కా! - Horoscope Today

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 21, 2024, 4:00 AM IST

Horoscope Today July 21st 2024: జులై​ 21న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope in telugu
Horoscope Today July 21st 2024 (ETV Bharat)

Horoscope Today July 21st 2024: జులై​ 21న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో ఒత్తిడులు, ఆటంకాలు ఉన్నప్పటికినీ అధిగమిస్తారు. వ్యాపారులకు భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. నూతన ఆదాయ వనరులు ఏర్పడటంతో ఆదాయం వృద్ధి చెందుతుంది. గృహంలో సుఖసంతోషాలు నెలకొంటాయి. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు సామాన్య ఫలితాలు ఉండవచ్చు. అన్ని రంగాల వారికి ఈ రోజు వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. నిరాశావాదాన్ని వీడి దైవబలం మీద విశ్వాసం ఉంచి పనిచేస్తే సానుకూల ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. ఖర్చులు అదుపులో ఉంచుకోవడం అవసరం. ఆర్ధిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజంతా సరదాగా గడుపుతారు. వృత్తి నిపుణులకు, ఉద్యోగులకు ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. అభివృద్ధి పథంలో పయనిస్తారు. వ్యాపారులు మంచి లాభాలను అందుకుంటారు. వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. నూతన వాస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. శ్రీలక్ష్మి గణపతి ధ్యానం శుభప్రదం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. అన్ని రంగాల వారికి ఈ రోజు వృత్తి వ్యాపారాలలో మెరుగైన పురోగతి, ధన లాభం ఉంటాయి. ముఖ్యమైన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా సమయస్ఫూర్తితో అధిగమిస్తారు. ఉద్యోగులకు పనిఒత్తిడి కారణంగా శారీరక శ్రమ పెరుగుతుంది. తగిన విశ్రాంతి అవసరం. కుటుంబంలో ఆనందోత్సహాలు నెలకొంటాయి. శివారాధనతో ప్రశాంతత కలుగుతుంది.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఈ రోజు నూతన అవకాశాలు అందుకుంటారు. మీ ప్రతిభకు తగిన హోదాను పొందుతారు. వ్యాపారులు వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన పెట్టుబడిదారులతో పరిచయాలు ఏర్పడతాయి. ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోండి. ఉద్యోగులకు, వృత్తి నిపుణులకు శుభసమయం నడుస్తోంది. ఆదాయం మూడింతలు పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. సన్నిహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు. గణపతి ధ్యానం శుభకరం.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపార ఉద్యోగాలలో కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవలసి ఉంటుంది. తీవ్రమైన కృషితోనే కార్యసిద్ధి, విజయప్రాప్తి ఉంటాయి. ఆర్ధికంగా గడ్డు పరిస్థితులు ఉండవచ్చు. రుణాలు చేయాల్సి వస్తుంది. ఖర్చులు అదుపు తప్పుతాయి. కుటుంబంలో కలహాలతో మనశ్శాంతి లోపిస్తుంది. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ సందర్శనతో ఆపదలు తొలగిపోతాయి.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. కళాకారులకు, సినీ రంగం వారికి ఈ రోజు విశేషమైన ప్రయోజనాలు ఉంటాయి. సమాజంలో గౌరవమర్యాదలు పొందుతారు. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. ఈ రోజు మీరు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. వృత్తి, వ్యాపార రంగాల వారికి చేపట్టిన అన్ని పనులు విజయవంతం అవుతాయి. విశేషమైన ఆర్ధిక ప్రయోజనాలను అందుకుంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. ప్రత్యేకంగా వృత్తి నిపుణులకు ఎక్కువ పని ఒత్తిడి, తక్కువ ఫలితాల కారణంగా ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. కుటుంబ కలహాల విషయంలో మౌనం పాటించడం మంచిది. ఆదాయం వృద్ధి చెందుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. సన్నిహితులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకొని మాట్లాడితే మేలు. లేకుంటే వివాదాలు, అపార్థాలు రావచ్చు. వృత్తివ్యాపార రంగాల వారికి ఆశించిన ప్రయోజనాలు ఉండవచ్చు. ఉద్యోగులకు స్దాన చలనం ఉండవచ్చు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శివారాధన శ్రేయస్కరం.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబ కలహాల కారణంగా మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. తగిన విశ్రాంతి అవసరం. పని ప్రదేశంలో ప్రతికూలతలు, సవాళ్లు ఎదురవుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో నష్టాలు ఉండవచ్చు. సూర్య ఆరాధన మేలు చేస్తుంది.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. వృత్తి వ్యాపారాలలో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్ధికంగా పుంజుకుంటారు. కుటుంబ సభ్యులతో వివాదాలు ఏర్పడతాయి. వ్యక్తిగత సమస్యల కారణంగా పనిపై దృష్టి సారించలేక పోతారు. ఉద్యోగంలో పనిఒత్తిడి పెరుగుతుంది. అనుకోని సవాళ్లు ఎదురవుతాయి. వ్యాపారులు పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం. కోర్టు వ్యవహారాలు, న్యాయ పరమైన విషయాలలో చర్చలతో సమస్యలు పరిష్కరించుకుంటే మంచిది. దైవబలం పట్ల విశ్వాసంతో ఉండండి. ఆరోగ్యం సహకరిస్తుంది. శనికి తైలాభిషేకం చేయిస్తే మంచిది.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార ఉద్యోగ రంగాల వారు ఆర్ధికపరంగా విశేషమైన ఫలితాలను అందుకుంటారు. కుటుంబంలో శాంతి, సంతోషం ఉంటాయి. బంధు మిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. విహారయాత్రలకు వెళతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. దైవ దర్శనం కోసం తీర్ధ యాత్రలకు వెళతారు. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.