ETV Bharat / spiritual

ఆ రాశివారు ఘర్షణలకు దూరంగా ఉండాలి - లేకుంటే ఇబ్బందులు తప్పవు! - రాశి ఫలాలు తెలుగు టుడే

Horoscope Today January 31st 2024 : జనవరి 31న (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today January 31st 2024
రాశి ఫలాలు
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 31, 2024, 4:59 AM IST

Horoscope Today January 31st 2024 : జనవరి 31న (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : ఈ రోజు మేష రాశివారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం మీకు లభిస్తుంది. వ్యాపార, వ్యవహారాల్లో భారీ లాభాలు వస్తాయి. మీ ప్రణాళికలు అన్నీ విజయవంతం అవుతాయి. ప్రయాణాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి.

.

వృషభం (Taurus) : ఈ రోజు వృషభ రాశివారికి సానుకూల ఫలితాలు లభిస్తాయి. మీ మాటకారితనంతో అందరినీ ఆకట్టుకుంటారు. మీరు కోరుకున్నవన్నీ నెరవేరే అవకాశం ఉంది. అనవసర చర్చలకు మాత్రం దూరంగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

.

మిథునం (Gemini) : ఈ రోజు మిథున రాశివారు చాలా సందిగ్థావస్థలో ఉంటారు. మానసిక వేదన మిమ్మల్ని కృంగదీస్తుంది. కానీ అనవసర తగాదాల్లోకి తలదూర్చకండి. కుటుంబ సభ్యులతో ఎలాంటి వివాదాలు పెట్టుకోకండి. వీలైనంత వరకు ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

.

కర్కాటకం (Cancer) : ఈ రోజు కర్కాటక రాశివారు తమ సోదరులకు ఆర్థిక సాయం చేస్తారు. మీరు వ్యాపార, వ్యవహారాల్లో మంచి లాభాలు సంపాదిస్తారు. మీ ప్రయత్నాలు అన్నీ సఫలం అయ్యే సూచనలు ఉన్నాయి. సమాజంలో మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.

.

సింహం (Leo) : ఈ రోజు సింహ రాశివారు ఎంత కష్టపడినా తగిన ఫలితాలు లభించకపోవచ్చు. రావాల్సిన ఫలితాలు కొంచెం ఆలస్యం అవుతాయి. కానీ నిరాశ చెందాల్సిన పనిలేదు. ఖర్చులు నియంత్రణలో ఉంచుకోవాలి. భవిష్యత్​ మీకు చాలా బాగుంటుంది. దూరపు సంబంధాలు దగ్గరవుతాయి.

.

కన్య (Virgo) : ఈ రోజు కన్య రాశివారికి చాలా బాగుంటుంది. మానసిక, శారీరక ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థికంగా సంతృప్తికరంగా ఉంటారు. ప్రయాణాలకు ఇది అనుకూల సమయం. స్నేహితులతో, ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు.

.

తుల (Libra) : ఈ రోజు తుల రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేదంటే మీరే నష్టపోతారు. వ్యాపారంలో నష్టాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఎవరితోనూ ఘర్షణకు దిగకండి. కోర్టు వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి.

.

వృశ్చికం (Scorpio) : ఈ రోజు వృశ్చిక రాశివారికి అద్భుతంగా ఉంటుంది. మీకు అనేక నూతన అవకాశాలు వస్తాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. మీ పనిని ఉన్నతాధికారులు మెచ్చుకుంటారు. వివాహ ప్రయత్నాలు సఫలం అవుతాయి. మీకు కావాల్సిన వ్యక్తిని ఇవాళ కలుసుకుంటారు.

.

ధనుస్సు (Sagittarius) : ఈ రోజు ధనుస్సు రాశివారికి అనుకూలంగా ఉంటుంది. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. మీ ప్రతిభను అందరూ మెచ్చుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో రాణిస్తారు. ఆర్థికంగా లాభపడతారు. ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు.

.

మకరం (Capricorn) : ఈ రోజు మకర రాశివారు తమకు నచ్చిన వ్యక్తిని కలుసుకుంటారు. మీలోని భావాలను వారికి చెబుతారు. మీ కుటుంబం మీకు అన్ని విధాలుగా అండగా ఉంటుంది. వ్యాపార వ్యవహారాల్లో అన్నీ మీకు కలిసి వస్తాయి. ఆరోగ్యం ఫర్వాలేదు.

.

కుంభం (Aquarius) : ఈ రోజు కుంభ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కలవర పట్టే ఘటనలు ఏర్పడవచ్చు. ఇవి మీ మనశ్శాంతిని దెబ్బతీయవచ్చు. ఆత్మస్థైర్యంతో ఉండాలి. ఆధ్యాత్మిక చింతన, దైవ ప్రార్థనలు చేస్తే, మానసిక ప్రశాంతత లభించే అవకాశం ఉంది.

.

మీనం (Pisces) : ఈ రోజు మీన రాశివారి గ్రహబలం బాగుంది. కళారంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త వ్యాపారం మొదలుపెట్టేవారికి శుభ ఫలితాలు లభిస్తాయి. మీరు కోరుకున్న విజయం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.