Horoscope Today February 2nd 2024 : ఫిబ్రవరి 2న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : ఈ రోజు మేష రాశివారికి చాలా బాగుంటుంది. సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు లభిస్తుంది. మేధోపరమైన చర్చల్లో పాల్గొంటారు. అందరూ మిమ్మల్ని ప్రశంసిస్తారు. కానీ మీ మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
వృషభం (Taurus) : ఈ రోజు వృషభ రాశివారికి శుభ ఫలితాలు కలుగుతాయి. కుటుంబ జీవితం సంతోషకరంగా ఉంటుంది. స్థిరచిత్తంతో పనులు పూర్తి చేసుకుంటారు. ఆందోళన కలిగించే ఘటనలను కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఆరోగ్యం ఫర్వాలేదు.
మిథునం (Gemini) : ఈ రోజు మిథున రాశివారికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. కొత్త పనులు ప్రారంభించాలని అనుకుంటారు. కానీ పరిస్థితులు సహకరించవు. చదువులు, అనారోగ్య సమస్యల వల్ల ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. దైవ ప్రార్థన చేయడం మంచిది.
కర్కాటకం (Cancer) : ఈ రోజు కర్కాటక రాశివారి మానసిక పరిస్థితి దారుణంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో అనవసర గొడవలు జరిగే అవకాశం ఉంది. ఆర్థిక నష్టం సంభవించవచ్చు. ఎన్ని కష్టాలు వచ్చినా సహనంతో భరించండి. కష్టపడి పనిచేస్తే మీ భవిష్యత్ బాగుంటుంది.
సింహం (Leo) : ఈ రోజు సింహ రాశివారికి చాలా బాగుంటుంది. పోటీదారులపై విజయం సాధిస్తారు. సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఓ మహిళ మూలంగా మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థిక లాభాలు కలుగుతాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది మంచి రోజు.
కన్య (Virgo) : ఈ రోజు కన్య రాశివారికి మంగళకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక వ్యవహారాలు కలిసివస్తాయి. కానీ నెగిటివ్ ఆలోచనలకు, గొడవలకు దూరంగా ఉండాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యం జాగ్రత్త!
తుల (Libra) : ఈ రోజు తుల రాశివారు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. వ్యాపార వ్యవహారాల్లో మంచి లాభాలు పొందుతారు. మానసిక, శారీరక ఆరోగ్యాలు బాగుంటాయి. మీలోని సృజనాత్మకతను ప్రపంచానికి తెలియజేస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.
వృశ్చికం (Scorpio) : ఈ రోజు వృశ్చిక రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. గొడవలకు దూరంగా ఉండాలి. మాటలను అదుపులో పెట్టుకోవాలి. శారీరక, మానసిక ఆరోగ్యాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వినోదాల కోసం ఖర్చు చేస్తారు. ప్రియమైన వారిలో మీపట్ల అపోహలు ఏర్పడతాయి.
ధనుస్సు (Sagittarius) : ఈ రోజు ధనుస్సు రాశివారికి మంచి లాభదాయకంగా ఉంటుంది. కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తారు. స్నేహితులతో కలిసి విహార యాత్రకు వెళతారు. ఆదాయం బాగానే ఉంటుంది. మీకు నచ్చిన ఆహారాన్ని భుజిస్తారు. ఆరోగ్యం ఫర్వాలేదు.
మకరం (Capricorn) : ఈ రోజు మకర రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న యాక్సిడెంట్ జరిగే సూచనలు ఉన్నాయి. ప్రమాదకరమైన వ్యవహారాలకు దూరంగా ఉండాలి. వ్యాపారం కోసం చేసే ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
కుంభం (Aquarius) : ఈ రోజు కుంభ రాశివారికి చాలా చీకాకు కలిగించే పరిస్థితి ఎదురవుతాయి. ఆరోగ్యం సహకరించదు. పని భారం పెరుగుతుంది. ఉన్నతాధికారులు మీ పట్ల అసంతృప్తితో ఉంటారు. కానీ ఆత్మస్థైర్యంతో, కష్టపడి పనిచేస్తే విజయం సాధించగలుగుతారు.
మీనం (Pisces) : ఈ రోజు మీన రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనైతిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. వైద్య ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. దైవ ప్రార్థన మానసిక ప్రశాంతతను అందిస్తుంది.