Horoscope Today February 28th 2024 : ఫిబ్రవరి 28న (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : ఈ రోజు మీరు సంతోషంగా ఉంటారు. మీరు వేసే అడుగు సరైన ఫలితాలను తెస్తుంది. మీరు ఆర్థిక సంబంధమైన సభలకు హాజరు కావచ్చు. మీరు మీ రంగంలో పని చేసే చాలా మంది వ్యక్తులను కలుసుకుంటారు. అందులో కొందరు బయటవారు కూడా ఉంటారు. మీరు కొంత మానసిక శ్రమ ఇచ్చే పనులనే ఇష్ట పడతారు. ఒక పర్యటన ఉంటుంది. ఈ రోజు కష్టపడి పని చెయ్యడానికి మంచి రోజు. మీ శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుంది.
వృషభం (Taurus) : కమ్యూనికేషన్, పబ్లిక్ స్పీకింగ్ రంగాల్లో గానీ మీరు ఉండి ఉంటే, మీరు ఈరోజు మీ ఆడియన్స్‌ను మంత్ర ముగ్ధుల్ని చెయ్యవచ్చు. ఒక్కొక్కరితో విడిగా మాట్లాడినప్పుడు కూడా మీరు ఎదుటివారిని ఆకట్టుకుంటారు. ఇలా చెయ్యడం వల్ల మీ పరిచయస్తుల్లో కొందరితో మీకు మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడవచ్చు. మీరు స్టూడెంట్ అయితే, అన్ని విషయాలూ అతి సులువుగా అందుకుంటారు. మీకు ఎక్కడ లేని అసాధారణమైన తెలివితేటలు ఉంటాయి. మీ ఆరోగ్యం అంత బాగుండకపోవచ్చు. మీరు కష్టపడిన దానికి తగినట్టుగా ఫలితం రాకపోవచ్చు. కానీ ఆటంకాల నుంచి మీరు బయపటపడతారు.
మిథునం (Gemini) : మీ భావోద్వేగాన్ని అదుపులో ఉంచుకోండి. వాటి అధీనంలోకి మీరు వెళ్లకండి. జలాశయాలకు దూరంగా ఉండండి. దీర్ఘ కాలంలో వ్యాధులు తెచ్చిపెట్టే మద్యపానం వంటి అలవాట్లను మానుకోవాలి. మిమ్మల్ని కొన్ని ఆలోచనలు బాధిస్తాయి. మీకు నిద్ర చాలక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కుటుంబ సభ్యులతో గొడవ పడకండి. ప్రయాణం చేయకపోవడమే మంచిది.
కర్కాటకం (Cancer) : ఈ రోజు మీరు మీ సోదరుల నుంచి లబ్ధి పొందుతారు. మీరు స్నేహితులు, ప్రియమైన వారి వల్ల లాభపడతారు. మీరు సుందరమైన ప్రదేశాలను చూసి రావడానికి వెళ్తారు. ఈ రోజు మీరు ప్రతి పనీ విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ పోటీదారులు, మీ ప్రత్యర్థులు మీతో పోటీకి దిగలేరు. మీరు అదృష్టవంతులనే విషయం అనేక విధాలుగా నిరూపితమవుతుంది. సామాజికంగా పరపతి కలిగి ఉంటారు.
సింహం (Leo) : మీరు ఈ రోజు ఎలా గడపాలా అన్న దిగులు ఉంటుంది. మీ కుటుంబసభ్యుల ప్రోత్సాహం మీకు ఉంటుంది. మీరు సంతోషంగా ఉంటారు. దూరపు వ్యక్తితో లేదా సంస్థతో సంబంధం పెరుగుతుంది. భవిష్యత్తులో ఆ అనుబంధం వల్ల లాభపడవచ్చు. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. మీ శ్రమకి తగ్గ ఫలితాలు లభించవు.
కన్య (Virgo) : మెత్తగా, సున్నితంగా మాట్లాడుతూ మీరు అవతలివారిని ఆకర్షిస్తారు. ఇది మీకు చాలా రకాలుగా లాభం. తెలివైన వారిగా ఒక ఇంప్రెషన్ వస్తుంది. అతి అరుదుగా వచ్చే ఒక ఆలోచన వల్ల మీరు విషయాన్ని చూసే దృష్టిలో మార్పు వస్తుంది. మీకు శారీరకంగా, మానసికంగా కూడా ఆరోగ్యం ఉంటుంది. మీకోసం ఒక శుభవార్త ఎదురుచూస్తోంది.
తుల (Libra) : మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మీరు అనవసర చర్చల్లోకి దిగవద్దు. మీరు మీ కుటుంబ సభ్యులతో తగాదా పడవచ్చు. శారీరక అస్వస్థతకు లోనవుతారు. మీ పరువు ప్రతిష్ఠలు దెబ్బతింటాయి. గాయపడకుండా జాగ్రత్తలు తీసుకోండి. కోర్టు కేసులకు సంబంధించి జాగ్రత్త వహించండి. ఆధ్యాత్మిక సాధన మీకు కఠిన సమయాల్లో సహాయం చేస్తుంది.
వృశ్చికం (Scorpio) : ఈ రోజు మీకు లాభించే రోజు. కావలసిన ప్రాపంచిక సుఖసంతోషాలను అందుకోగలుగుతారు. వివాహం కావలసివారికి ఇది శుభప్రదమైన రోజు. ఆర్థికపరంగా పారిశ్రామికవేత్తలందరూ చాలా లాభపడవచ్చు. మీరు మీ పైఅధికారులను మెప్పిస్తారు. మీరు మీ స్నేహితులను కలవవచ్చు. అందమైన ప్రదేశాల సందర్శనకు వెళ్లవచ్చు.
ధనుస్సు (Sagittarius) : ఈ రోజు తారాబలం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు సాయం చేసే మనసుతో ఉంటారు. అందువల్ల జనంతో మెప్పు పొందుతారు. మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. పనిచేసే చోట మీ అధికారులను మెప్పిస్తారు. మీకు పదోన్నతి వచ్చే అదృష్టం ఉంది. వ్యాపార సంబంధమైన ప్రయాణం చేసే అవకాశం వుంది. పెద్దలు ప్రత్యేకంగా మీ నాన్న గారి నుంచి లాభధాయకమైన సూచనలు పొందగలరు.
మకరం (Capricorn) : ఈ రోజు మీ తారాబలం అనుకూలంగా ఉంది. ఏదేమైనా అంతర్గతంగా ఉండే ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి మంచి రోజు. మీకు కొత్త ఆలోచనలు వస్తాయి. కళాకారులు, రచయితలు ఈ రోజు మంచి నైపుణ్యం ప్రదర్శించగలరు.
కుంభం (Aquarius) : ఈ రోజు చాలా ఇబ్బందులు, ఒత్తిడి ఉండే అవకాశం వుంది. కోపం, చిరాకు పెరుగుతాయి. దేవుడిని స్మరించండి. మౌనంగా ఉండడం, ధ్యానం చేయడం మంచిది. అందువల్ల మీరు ప్రశాంతంగా గడిపే అవకాశం వుంది. చట్టవిరుద్దమైన పనులు చేయవద్దు. మీ పద్దతి ద్వారా ఇతరులు భాధపడే అవకాశం ఉంది. అందువల్ల వీలైనంతవరకు మంచి మాటలనే మాట్లాడండి. మీ ఇంట్లో ఒక శుభకార్యం జరగవచ్చు.
మీనం (Pisces) : మీ గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి. కళారంగంలో వారికి అన్ని రకాల సహాయంగా ఉంటుంది. ఇది మీరు కొత్త పార్టనర్‌తో వ్యాపారం మొదలుపెట్టవచ్చు. రోజంతా పని చేసి అలిసిపోయాక , మీరు సరదాగా కాలక్షేపం చెయ్యాలనుకుంటారు. మీకు ప్రియమైన వారితో కలిసి పార్టీకి లేదా ఔటింగ్‌కు వెళ్లి రావచ్చు. మీరు మీ ఫ్యామిలీతో మీ బంధాన్ని దృఢపరుచుకుంటారు. విజయం మీకు గుర్తింపు తెస్తుంది.