ETV Bharat / spiritual

నేడు ఆ రాశుల వారు ఏ పని చేపట్టినా విజయమే - వ్యాపారంలోనూ ఫుల్ ప్రాఫిట్! - Daily Horoscope - DAILY HOROSCOPE

Horoscope Today August 9th 2024 : ఆగస్టు​ 9న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Daily Horoscope
Daily Horoscope (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 9, 2024, 4:21 AM IST

Horoscope Today August 9th 2024 : ఆగస్టు​ 9న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి చేపట్టిన ప్రతి పని విజయవంతమవుతుంది. వేసే ప్రతి అడుగు విజయం దిశగా ఉంటుంది. ఆర్థికంగా గొప్ప శుభ ఫలితాలను అందుకుంటారు. సమాజంలో పేరొందిన గొప్ప వ్యక్తులను కలుసుకుంటారు. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. ముఖ్యంగా కమ్యూనికేషన్, ప్రజా ప్రయోజన రంగాల వారికి సమాజంలో పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. వృత్తి పరంగా గొప్ప అవకాశాలను అందుకుంటారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. వ్యాపారంలో అధిక లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుండవచ్చు. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కుటుంబ కలహాలు తారాస్థాయికి చేరుకుంటాయి. భావోద్వేగాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం. దురలవాట్లకు దూరంగా ఉండాలి. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. వృత్తి వ్యాపార రంగాలలో ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. రుణబాధలు అధికం అవుతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సోదరుల నుంచి లబ్ధి పొందుతారు. వృత్తి వ్యాపారాలలో ఎదురయ్యే సవాళ్ళను స్నేహితుల సహాయంతో అధిగమిస్తారు. బంధుమిత్రులతో విహారయాత్రలకు వెళ్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు. అన్ని రంగాల వారు చేపట్టిన ప్రతి పని విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ పోటీ దారులు, ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. సామాజికంగా పరపతి పెరుగుతుంది. సంపద వృద్ధి చెందుతుంది. శివారాధన శ్రేయస్కరం.

.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపార ఉద్యోగాలలో తీవ్రమైన సవాళ్లు, ఒత్తిడి కారణంగా ఆందోళనతో ఉంటారు. కుటుంబసభ్యుల ప్రోత్సాహం ఉంటుంది. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగంలో శ్రమకు తగిన ఫలితాలు ఉండకపోవచ్చు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మృదువైన మీ మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతులు, ఆర్థిక లాభాలు ఉంటాయి. సమాజంలో హోదా పెరుగుతుంది. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీమహాలక్ష్మి ఆలయ సందర్శన శుభప్రదం.

.

తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఎవరితోనూ అనవసర చర్చల్లోకి దిగవద్దు. కుటుంబ సభ్యులతో తగాదాలు అధికమవుతాయి. మీ కోపం కారణంగా పరువు ప్రతిష్ఠలు దెబ్బతినే ప్రమాదముంది. ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. వాహన ప్రమాదాలు జరిగే సూచనలున్నాయి. కోర్టు కేసులకు సంబంధించి జాగ్రత్త వహించండి. ఆధ్యాత్మిక సాధన ఒక్కటే మీకు కఠిన సమయాల్లో సహాయం చేస్తుందని గుర్తిస్తే మేలు. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే ఆపదలు తొలగిపోతాయి.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో విశేష శుభ ఫలితాలుంటాయి. ధనం సమృద్ధిగా చేతికి అందుతుంది. వివాహం కావలసివారికి ఇది శుభప్రదమైన రోజు. ఆర్థికపరంగా పారిశ్రామికవేత్తలందరూ చాలా లాభపడవచ్చు. ఉద్యోగులు తమ పై అధికారులను మెప్పిస్తారు. సన్నిహితులతో విహార యాత్రలకు వెళ్తారు. ఈ రోజంతా సరదాగా గడిచిపోతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. తారాబలం అనుకూలంగా ఉంది. ఈ రోజు అన్ని రంగాల వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. అందరికి సహయం చేసే మీ మంచి మనసు కారణంగా సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. పనిచేసే చోట మీ అధికారులను మెప్పిస్తారు. మీకు పదోన్నతి వచ్చే అదృష్టం ఉంది. వ్యాపార సంబంధమైన ప్రయాణం చేసే అవకాశం ఉంది. పిత్రార్జితం నుంచి లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాలలో అంతర్గత సమస్యలను అధిగమిస్తారు. కుటుంబ సమస్యలపై దృష్టి సారిస్తే మంచిది. ఉద్యోగులు సృజనాత్మక ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి మంచి రోజు. కళాకారులు, రచయితలు మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించి సన్మాన సత్కారాలను అందుకుంటారు. ఆర్థికంగా శుభయోగాలున్నాయి. వ్యాపారులకు రావలసిన బకాయిలు చేతికి అందుతాయి. లాభాల శాతం కూడా పెరుగుతుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారు ఈ రోజు వృత్తి పరంగా చాలా ఇబ్బందులు, ఒత్తిడి ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ కారణంగా కోపం, చిరాకు పెరుగుతాయి. దైవబలం మీద విశ్వాసం ఉంచి ముందడుగు వేస్తే మంచిది. కోపాన్ని వీడి ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. కుటుంబ కలహాలు చికాకు పెడతాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. సంకట విమోచన హనుమాన్ ఆలయ సందర్శన శుభకరం.

.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి. అందుకే చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం ఉంటుంది. కళారంగంలో వారికి ఊహించని గొప్ప అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారులకు భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు అధికంగా ఉంటాయి. స్నేహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. కుటుంబంతో అనుబంధం దృఢపడుతుంది. ఈ రోజు మీరు సాధించే విజయం సంఘంలో మీకు శాశ్వత గుర్తింపు తెస్తుంది. గణపతి ప్రార్ధన శుభకరం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.