ETV Bharat / spiritual

ఈ రాశి వారు నేడు జాగ్రత్తగా మాట్లాడితే బెటర్- లేకుంటే అందరూ బాధపడడం పక్కా! - 2024 August 8th Horoscope In Telugu - 2024 AUGUST 8TH HOROSCOPE IN TELUGU

Horoscope Today August 8th 2024 : ఆగస్టు​ 8న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Daily Horoscope In Telugu
Daily Horoscope In Telugu (ETV Bharat Infographics)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 8, 2024, 5:00 AM IST

Horoscope Today August 7th 2024 : ఆగస్టు​ 8న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. సామాజిక సేవా కార్యక్రమాలలో విరివిగా పాల్గొంటారు. ఇతరుల విమర్శలను పట్టించుకోకండి. మీ స్వధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. వృత్తికి నిపుణులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. గత కొంతకాలంగా వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆంజనేయస్వామి ఆలయ సందర్శన శుభకరం.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. చేపట్టిన పనులన్నీ విజయవంతమవుతాయి. మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. సాహిత్య సదస్సులు, చర్చలలో పాల్గొని అందరిని మెప్పిస్తారు. సున్నితమైన విషయాల పట్ల ఆచి తూచి వ్యవహరిసే మేలు. ఉద్యోగస్థులకు పనిభారం పెరగవచ్చు. ఆర్ధికంగా ఆశించిన ప్రయోజనాలుంటాయి. అనారోగ్య సమస్యలు ఉబ్బంది పెట్టవచ్చు. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగంలో కూడా అనిశ్చితి నెలకొంటుంది. ఎంత కష్టపడినా ఆశించిన ఫలితాలు రాకపోవడం వల్ల నిరాశకు గురవుతారు. కీలమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో సందిగ్దత నెలకొంటుంది. కుటుంబంలో స్థిరాస్తులు, వారసత్వపు ఆస్తుల గురించిన చర్చలు జరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యండి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి కొత్త ప్రాజెక్టులు చేతికి అందడం శుభసూచకం. చేపట్టిన అన్ని పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు, ఆర్ధిక లాభాలు ఉంటాయి. బంధు మిత్రులను కలుసుకుంటారు. ఊహించని ధనలాభాలు ఉంటాయి. ఇతరులు అసూయపడేలా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. సామాజిక పరపతి పెరుగుతుంది. శ్రీలక్ష్మీ గణపతి ఆరాధన శుభప్రదం.

.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్ధిక వృద్ధి, కుటుంబ సౌఖ్యం పుష్కలంగా ఉంటాయి. సిరిసంపదలు వృద్ధి చెందుతాయి. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. వృత్తిలో ఎదురైన సమస్యలను కుటుంబ సభ్యుల సహకారంతో అధిగమిస్తారు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. విదేశాల నుంచి అందిన ఓ శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. దుర్గాదేవి ఆరాధన శుభకరం.

.

కన్య (Virgo) : కన్య రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోతాయి. ఉద్యోగంలో సవాళ్లు ఎదురైనా అధిగమిస్తారు. ఎంతో కాలంగా పరిష్కారం కానీ వివాదాలు దైవబలంతో పరిష్కారం కావడంతో కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళతారు. ఆర్ధిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. లక్ష్మీ కటాక్షం ఉంటుంది. వ్యాపారస్థులకు ప్రయాణాలు లాభాలను తెచ్చి పెడతాయి. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. తారాబలం అనుకూలంగా లేనందున అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వృత్తిలో సవాళ్లు, ఆర్ధిక నష్టాలు చేకూరే అవకాశం ఉంది. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో తిరుగులేని విజయాలను సాధిస్తారు. ఉద్యోగస్థులకు ఆఫీసులో హోదా పెరుగుతుంది. మీ పైఅధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. పని ప్రదేశంలో ఒక్కసారిగా మీ ఇమేజ్ మారిపోతుంది. అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. ఆర్ధికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. వ్యాపారంలో ఊహించని లాభాలను అందుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శివారాధన శ్రేయస్కరం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. మీ పూర్తి సామర్ధ్యాన్ని వెచ్చించి వృత్తి వ్యాపారాలలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు ఉంటాయి. స్థానచలనం సూచన కూడా ఉంది. పిత్రార్జితం కలిసి వస్తుంది. వ్యాపారులు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. గణపతి ప్రార్ధన మేలు చేస్తుంది.

.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో సాధారణమైన ఫలితాలే ఉంటాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. పరిశోధనా రంగం వారికి, సాహితీపరమైన రంగాల వారికి అనుకూలమైన సమయం నడుస్తోంది. బుద్ధిబలంతో, సృజనాత్మకతతో వ్యవహరించి సమాజంలో మీకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారంలో అనుకోని ఇబ్బందులు, ఒత్తిడి ఉండే అవకాశం వుంది. ఏ పని మొదలు పెట్టినా ఆటంకాలు ఎదురుకావడంతో కోపం, చిరాకు పెరుగుతాయి. మౌనంగా ఉంటూ దైవబలం మీద విశ్వాసం ఉంచి ప్రశాంతంగా ఉండడం ఒక్కటే మార్గం. సమయం అనుకూలించనప్పుడు అన్ని పనులు వాయిదా వేయడం ఒక్కటే పరిష్కారం. ఆరోగ్యం సహకరిస్తుంది. పరుషమైన మీ మాటలతో ఇతరులు భాధపడే అవకాశం వుంది. వీలైనంతవరకూ మంచి మాటలనే మాట్లాడండి. ఖర్చులు పెరగవచ్చు. అభయ ఆంజనేయ స్వామి ఆలయ సందర్శనతో ప్రతికూలతలు తొలగిపోతాయి.

.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సమాజంలో పేరున్న వ్యక్తుల అండదండలతో వృత్తి వ్యాపారాలలో అనుకున్నది సాధిస్తారు. వ్యాపారంలో లాభాలు పెరగడం వల్ల ఉత్సాహంగా కొత్త ప్రాజెక్టులు మొదలు పెడతారు. ఉద్యోగంలో నైపుణ్యాలను మెరుగు పరచుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ కలహాలు చోటు చేసుకునే ఆస్కారముంది. గురు శ్లోకాలు పఠిస్తే మేలు జరుగుతుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.