ETV Bharat / spiritual

ఈ రోజు మీ రాశిఫలం ఎలా ఉందో చెక్ చేసుకున్నారా? - Daily Horoscope In Telugu - DAILY HOROSCOPE IN TELUGU

Horoscope Today August 19th 2024 : ఆగస్టు​ 19న (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Daily Horoscope In Telugu
Daily Horoscope In Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 19, 2024, 4:25 AM IST

Horoscope Today August 19th 2024 : ఆగస్టు​ 19న (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేష రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో పురోగతి లోపిస్తుంది. పని చేయడం కన్నా రోజులో చాలా భాగం చర్చలు, వాదనలతోనే కాలం గడిచిపోతుంది. వ్యాపారులకు భాగస్వాములతో చర్చలు ఫలవంతంగా ఉండవు. ఆర్ధిక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఖర్చులు అదుపులో ఉంచుకోవడం అవసరం. బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యాలలో పాల్గొంటారు. శివారాధన శ్రేయస్కరం.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. వృత్తి వ్యాపారాలలో ఎదురయ్యే సమస్యలు పరిష్కరించడం చాలా కఠినంగా ఉంటుంది. ఏ పని మొదలు పెట్టినా ఆటంకాలు ఎదురవుతాయి. సహచరుల సహకారంతో కొంతవరకు అధిగమిస్తారు. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు రావడానికి సమయం పడుతుంది. నిరాశ చెందకండి. కఠిన శ్రమ, సహనం ఎప్పటికైనా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ రోజు ఆశాజనకంగా లేదు. అన్ని రంగాల వారికి వృత్తి పరంగా, ఆర్ధిక పరంగా నిరాశాజనకంగా ఉంటుంది. సంఘర్షణలకు లోను కాకుండా ప్రశాంతంగా ఉండండి. ప్రతికూల ఆలోచనలు వీడితేనే మెరుగైన ఫలితాలు ఉంటాయి. ప్రయాణాలు అనుకూలించవు. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. చేస్తున్న పని నుంచి విరామం తీసుకొని విశ్రాంతి తీసుకోవాలి. వృధా ఖర్చులు పెరుగుతాయి. శివాభిషేకం చేయిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాలలో అలుపెరగని పోరాటం చేసి అనుకున్న లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో రాజీధోరణి అవలంబిస్తే మేలు. ఉద్యోగుల పనితీరు పట్ల ఉన్నతాధికారులు సంతృప్తితో ఉంటారు. ప్రమోషన్ ఛాన్స్ ఉంది. పూర్వీకుల ఆస్తులు కలిసి వస్తాయి. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో కొన్ని చికాకు కలిగించే సంఘటనల కారణంగా అశాంతికి లోనవుతారు. ఆర్థికంగా అనుకూలం. ఆరోగ్యం సహకరిస్తుంది. బంధు మిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. వ్యాపారంలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. అభయ ఆంజనేయ స్వామి ఆలయ సందర్శనతో మరిన్ని మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉండడంతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. మీ మాటకు విలువ ఉంటుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు. భవిష్యత్ పట్ల స్థిరమైన నిర్ణయాలు తీసుకోడానికి అనుకూలమైన సమయం. అదనపు ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. వ్యాపారంలో ఆశించిన లాభాలు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుండవచ్చు. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపార ఉద్యోగాలలో అనుకోని ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతాయి. గొప్ప మేలు జరగబోతోంది. మీ అదృష్టాన్ని మీరే నమ్మలేకపోతారు. ఆకస్మిక ధనలాభాలు ఉండవచ్చు. స్థిరాస్తి కొనుగోళ్లు అమ్మకాల ద్వారా మంచి లాభాలు గడిస్తారు. అన్ని పనులు అనుకూలంగా సాగడంతో సంతోషంగా ఉంటారు. స్నేహితులతో సరదాగా గడుపుతారు. విహార యాత్రలకు ప్రణాళికలు వేస్తారు. హనుమాన్ చాలీసా పారాయణతో మరిన్ని శుభ ఫలితాలు ఉంటాయి.
.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఊహించని ధనప్రవాహంతో సంతోషంగా ఉంటారు. విదేశాలలో ఉద్యోగం చేయాలని కలలు కనే వారు శుభవార్తలు అందుకుంటారు. సన్నిహితులతో కలిసి షాపింగ్ చేస్తారు. ఖర్చులు అదుపులో ఉంచుకోవడం అవసరం. ఉద్యోగస్తులు సహోద్యోగుల సహకారంతో చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గతంలో చేసిన పొరపాట్ల గురించి పశ్చాత్తాప పడుతుంటారు. ఉద్యోగులకు కష్టించి పనిచేసి టీమ్ లీడర్ గా ప్రమోషన్ అందుకుంటారు. అయితే అందరిని కలుపుకొని పోవడంలో విఫలమవుతారు. వ్యాపారంలో శ్రమకు తగిన ఫలితాలు లేక నిరాశ చెందుతారు. భాగస్వామ్య వ్యాపారాలపై దృష్టి సారించడం మంచిది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారంలో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ఆర్ధిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో ఏర్పడిన కలహాలు తారాస్థాయికి చేరుకుంటాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం. సన్నిహితులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. శివపార్వతుల ఆలయ సందర్శనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాలలో పురోగతి, ఆర్థికవృద్ధి ఉంటాయి. ముఖ్యంగా మీ కమ్యూనికేషన్ నైపుణ్యం ఈ రోజు అద్భుతాలు చేస్తుంది. మీ వాక్పటిమకు ప్రశంసలు లభిస్తాయి. మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. సంపాదన పెరగడం వల్ల సంతోషంగా ఉంటారు. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఆటంకాల కారణంగా ఆత్మవిశ్వాసం కోల్పోతారు. ఆర్ధిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. ఆర్థికపరమైన విషయాలలో ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలి. ఆరోగ్యం సహకరిస్తుంది. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.