ETV Bharat / spiritual

ఆ రాశివారికి ప్రమాదం జరిగే అవకాశం - దుర్గాదేవి ధ్యానం శ్రేయస్కరం! - Horoscope Today - HOROSCOPE TODAY

Horoscope Today August 18th 2024 : ఆగస్టు​ 18న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today
Horoscope Today (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 18, 2024, 3:59 AM IST

Horoscope Today August 18th 2024 : ఆగస్టు​ 18న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి, వ్యాపార ఉద్యోగాలలో మంచి అభివృద్ధి, ఆర్ధిక పరమైన లాభాలు మెండుగా ఉంటాయి. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. వ్యాపారంలో భాగస్వాముల మధ్య ముఖ్యమైన చర్చలు ఫలవంతంగా ఉంటాయి. మాతృవర్గం నుంచి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ, వాటిని అధిగమిస్తారు. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణాలు ఫలవంతంగా ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి విదేశీయానం చేసే అవకాశం ఉంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మీ ఆశయాలు నెరవేరుతాయి. వృత్తి, వ్యాపారాలలో కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కొత్త వెంచర్లు ప్రారంభించడానికి, పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు మంచి రోజు. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళతారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబంలో అశుభకరమైన ఘటనలు జరగడానికి అవకాశం ఉంది. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు వీలైనంత వరకు ఈ రోజు ఆపరేషన్ చేయించుకోకుండా ఉంటే మంచిది. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం. వృత్తి, వ్యాపారాలలో కూడా ప్రతికూల పరిస్థితులు ఉండవచ్చు. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాల్లో ప్రతిభావంతంగా పనిచేసి లక్ష్యాలను చేరుకుంటారు. వృత్తిపరంగా, ఆర్థికంగా లాభపడతారు. ఉద్యోగులకు పదోన్నతులు ఉండవచ్చు. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. స్నేహితులు, ప్రియమైనవారితో సంతోషంగా గడుపుతారు. గృహంలో శుభకార్యాలు జరిగే సూచన ఉంది. ఆస్తులు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. గ్రహసంచారం అనుకూలంగా లేనందున చేసే పనిలో పురోగతి ఉండదు. వృత్తి, వ్యాపారాలలో కఠినమైన పరిస్థితులు నెలకొంటాయి. కొన్ని సమస్యల కారణంగా పని ప్రదేశంలో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటాయి. సమయానుకూలంగా నడుచుకుంటే మేలు. ఆరోగ్యం సహకరించదు. వృత్తిపరమైన సమస్యల కారణంగా ఆందోళనకు గురి కావడంతో ఆరోగ్యం దెబ్బ తింటుంది. తగిన విశ్రాంతి అవసరం. ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోకండి. సింహరాశి వారికి సహజంగా ఉండే గాంభీరం, ధైర్యం కారణంగా అన్ని ఆపదల నుంచి గట్టెక్కుతారు. ఖర్చులు పెరుగుతాయి. శివారాధన శ్రేయస్కరం.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్ధులకు కఠినంగా ఉంటుంది. చదువుపై ఏకాగ్రత లోపిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. ముఖ్యంగా పెట్టుబడిదారులు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో సవాళ్లు, ఆర్ధిక నష్టాలు ఉండవచ్చు. అనవసర చర్చలు, వాదనల్లో పాల్గొనకుండా ఉంటే మంచిది. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. శ్రీలక్ష్మీ ధ్యానం మేలు చేస్తుంది.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో నిర్లక్ష్య వైఖరి కారణంగా నష్టపోతారు. ఉద్యోగంలో కూడా సమస్యలు ఎదురవుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం. మీ కోపం కారణంగా చేతికి అందిన అవకాశాలు కూడా దూరమవుతాయి. వృత్తిపరమైన సమస్యలతో ఆందోళనగా ఉంటారు. మీ తల్లిగారి ఆరోగ్యం గురించి ఆందోళనగా ఉంటారు. ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్లతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వ్యాపారులు ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. కుటుంబ కలహాల కారణంగా నలుగురిలో అవమానాలు ఎదుర్కోవలసి వస్తుంది. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి, వ్యాపారాలలో మెరుగైన పురోగతి, ఆర్థిక లాభాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఈ రోజు తారాబలం అనుకూలంగా ఉంది. కాబట్టి చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా ఉండవచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్లు, జీతం పెరుగుదల వంటి శుభ ఫలితాలు ఉంటాయి. స్థిరాస్తి రంగం వారికి కొత్త వెంచర్లు మొదలుపెట్టడానికి శుభసమయం నడుస్తోంది. కుటుంబంలో ఆస్తికి సంబంధించిన చర్చలు ఫలవంతం అవుతాయి. ఆరోగ్య సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో ఎదురయ్యే సవాళ్ళను అధిగమించడంలో విఫలం చెందుతారు. సహోద్యోగుల సహకారం లోపిస్తుంది. అన్ని పనులు సమయానికి పూర్తి కాకపోవడంతో, ఆందోళనతో ఉంటారు. ఆర్థిక పరిస్థితి నిరాశజనకంగా ఉంటుంది. కుటుంబంలో సామరస్యత కోసం మీరు చేసే ప్రయత్నాలకు ఎవరూ సహకరించారు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. శివారాధన శ్రేయస్కరం.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో శ్రమకు తగిన ఫలం ఉంటుంది. మీ ప్రయత్నాలు, బాధ్యతలు, కర్తవ్యాలూ అన్నీ ఫలిస్తాయి. సంఘంలో పరపతి పెరుగుతుంది. ప్రమోషన్ లభించే సూచనలున్నాయి. బంధు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. గృహంలో శాంతి సౌఖ్యాలు నెలకొంటాయి. ఆధ్యాత్మిక సంబంధమైన కార్యకలాపాలలో గడుపుతారు. వాహన ప్రమాదం జరిగే సూచనలున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దుర్గాదేవి ధ్యానం మేలు చేస్తుంది.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాలలో పురోగతి, ఆర్థికవృద్ధి ఉంటాయి. ముఖ్యంగా మీ కమ్యూనికేషన్ నైపుణ్యం ఈ రోజు అద్భుతాలు చేస్తుంది. మీ వాక్పటిమకు ప్రశంసలు లభిస్తాయి. మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. సంపాదన పెరగడంతో సంతోషంగా ఉంటారు. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. ఈ రాశి వారిని ఈ రోజు అదృష్టం వరిస్తుంది. అనుకోకుండా గొప్ప ఆర్థిక లాభాలు పొందుతారు. స్థిరాస్తులు కలిసి వస్తాయి. సంతానానికి సంబంధించి శుభవార్తను వింటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. సమాజంలో పేరొందిన వ్యక్తులను పరిచయం చేసుకుంటారు. అది మీకు భవిష్యత్తులో ప్రయోజనం కలిగిస్తుంది. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తిపరంగా హోదా పెరుగుతుంది. గణపతి ఆలయ సందర్శన శుభకరం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.