ETV Bharat / spiritual

ఆ రాశి వారు నేడు పనులన్నీ వాయిదా వేసుకోవడం మంచిది- సూర్య ఆరాధన శ్రేయస్కరం! - Daily Horoscope In Telugu - DAILY HOROSCOPE IN TELUGU

Horoscope Today August 10th 2024 : ఆగస్టు​ 10న (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Daily Horoscope In Telugu
Daily Horoscope In Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 10, 2024, 2:53 AM IST

Horoscope Today August 10th 2024 : ఆగస్టు​ 10న (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఈ రోజు తమ తమ రంగాలలో విజేతగా నిలుస్తారు. కుటుంబ సౌఖ్యం, ఆర్ధిక వృద్ధి వంటి శుభ ఫలితాలతో ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళతారు. సామాజికంగా మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు కష్ట కాలం. విజయం కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలున్నా అధిగమిస్తారు. ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం మంచిది. అనారోగ్య సూచనలున్నాయి. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. కుటుంబంలో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. శివారాధన శ్రేయస్కరం.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో విజయం కోసం కఠిన శ్రమ అవసరం. ఉద్యోగంలో సమయానుకూలంగా నడుచుకుంటే మేలు. గిట్టని వ్యక్తుల కారణంగా అపవాదులకు గురికావచ్చు. వృత్తి నిపుణులు జీవితంలో విజయాలు అంత సులభంగా రావని గుర్తించాలి. వృత్తి పట్ల అంకితభావంతో ఉండడం అవసరం. కుటుంబ కలహాలు తారాస్థాయికి చేరుకుంటాయి. సహనం వహించండి. వృథా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు ఆత్మవిశ్వాసంతో పనిచేసి తమదైన రంగాలలో రాణిస్తారు. ఉద్యోగంలో శ్రమకు తగిన ఫలితాలు అందుకోడానికి ఆలస్యం కావచ్చు. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటే మంచిది. ఆర్ధిక విషయాల్లో ఆచి తూచి వ్యవహరించాలి. వ్యాపారులకు రుణభారం పెరగవచ్చు. ఖర్చులు అదుపు తప్పుతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలున్నా అధిగమిస్తారు. ఉద్యోగంలో స్దాన చలనం ఉండవచ్చు. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యులతో వివాదాలు జరగవచ్చు. ప్రతి అడుగు ఆచి తూచి వేయాల్సి ఉంటుంది. ఆర్థికంగా ఆశించిన ఫలితాలుంటాయి. శివారాధన సత్ఫలితాన్నిస్తుంది.

.

కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో శుభ ఫలితాలు ఉండవచ్చు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంది. పని ప్రదేశంలో ఆహ్లాదంగా ఉండి మనసుకు ఆనందం కలిగిస్తుంది. స్నేహితులతో కలిసి ముఖ్యమైన ప్రదేశాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులు మొదలు పెట్టేటపుడు సన్నిహితులతో చర్చించడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఇష్ట దేవతారాధన శ్రేయస్కరం.

.

తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఎవరితోనూ అనవసర చర్చల్లోకి దిగవద్దు. కుటుంబ సభ్యులతో తగాదాలు అధికమవుతాయి. మీ కోపం కారణంగా పరువు ప్రతిష్ఠలు దెబ్బతినే ప్రమాదముంది. ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. వాహన ప్రమాదాలు జరిగే సూచనలున్నాయి. కోర్టు కేసులకు సంబంధించి జాగ్రత్త వహించండి. ఆధ్యాత్మిక సాధన ఒక్కటే మీకు కఠిన సమయాల్లో సహాయం చేస్తుందని గుర్తిస్తే మేలు. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే ఆపదలు తొలగిపోతాయి.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార లాభాలు ఉన్నాయి. సన్నిహితులతో కలిసి పర్యటనలు చేస్తారు. స్నేహితులతో అనవసర వాదనలు మానుకోండి. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. అన్ని రంగాలవారు ఈ రోజు తలపెట్టిన పనులు విజయవంతం అవుతాయి. వ్యాపారంలో ఆర్థిక లాభాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ఫలితం ఉంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. సన్నిహితులతో కలిసి విహార యాత్రలకు వెళతారు. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు మంచి ఫలవంతంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు, కొత్త అసైన్ మెంట్లు మొదలు పెట్టడానికి ఈ రోజే సరైన తరుణం. భవిష్యత్ లో ఇది మీకు అదృష్టంగా పరిణమిస్తుంది. వ్యాపారస్తులకు ఈ రోజు మంచి రోజు. ఆర్థికంగా శుభ ఫలితాలను అందుకుంటారు. ఇంట్లో శుభం జరుగుతుంది. దేవాలయ దర్శనానికి, తీర్థయాత్రలకు ప్రణాళికలు వేస్తారు. విదేశాల్లో నివసించే బంధువుల నించి శుభ వర్తమానం వింటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మి గణపతి ఆలయ సందర్శన శుభప్రదం.

.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. దైవబలం మీద విశ్వాసంతో, సానుకూల వైఖరితో ఉండగలిగితే ఈ రోజు మీకొక సువర్ణావకాశంగా భాసిస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోగలిగితే మీకు అంతటా విజయమే. ఇంట్లో ప్రేమపూరిత వాతావరణం నెలకొని ఉంటుంది. వివాదాలను పక్కన పెట్టి సమయానుకూలంగా నడుచుకుంటే మంచిది. ఆర్ధికంగా గొప్ప శుభ సమయం నడుస్తోంది. వ్యాపారంలో రుణభారం తగ్గుతుంది. లాభాలు పెరుగుతాయి. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. సన్నిహితులతో కలిసి విహార యాత్రలు చేస్తారు. వ్యాపారంలో ఆశించిన లాభాలు ఉంటాయి. ఆర్థికంగా బలపడతారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం వల్ల లాభం పొందుతారు. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ద అవసరం. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.