ETV Bharat / spiritual

ఆ రాశి వారు కొత్త పనులు మొదలు పెట్టొద్దు! అనారోగ్య సమస్యలు- జాగ్రత్త! - Horoscope Today April 8th 2024 - HOROSCOPE TODAY APRIL 8TH 2024

Horoscope Today April 8th 2024 : ఏప్రిల్​ 8న (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today April 8th 2024
Horoscope Today April 8th 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 8, 2024, 5:03 AM IST

Horoscope Today April 8th 2024 : ఏప్రిల్​ 8న (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఈ రోజంతా ఆధ్యాత్మికంగా కాలం గడుపుతారు. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. గతంలో చేసిన పొదుపును పెట్టుబడిగా మార్చడానికి ఇది మంచి సమయం. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మి అష్టోత్తరం చదవండి.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యల వలన విచారంగా ఉంటారు. మొదలు పెట్టిన పనులు పూర్తి కానందున ఒత్తిడికి గురవుతారు. ఖర్చులను అదుపులో ఉంచుకోండి. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండండి. శనిస్తోత్రం పఠించండి.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. సన్నిహితులతో సంబంధాలు మెరుగు పడతాయి. వృత్తి పరంగా మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పై అధికారుల ప్రశంసలు పొందుతారు. భవిష్యత్ గురించి స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే విజయం మీదే! దుర్గా ధ్యానం శుభప్రదం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈరోజు అదృష్టవంతమైన రోజు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. తీర్థయాత్రలకు వెళతారు. మొత్తం మీద ఈ రోజు చాలా కులాసాగా ఉంటారు. శివారాధన మేలు చేస్తుంది.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈరోజు అంత అనుకూలంగా లేదు. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి. వైద్య చికిత్స కోసం ధనవ్యయం ఉంటుంది. ప్రతికూల ఆలోచనలు వీడండి. యోగా, ధ్యానంతో మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ఆంజనేయస్వామి ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. కొత్తగా ఏ పని ఈ రోజు మొదలు పెట్టవద్దు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. కుటుంబంలో ఘర్షణ వాతావరణం ఉంటుంది. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు చికాకు పెడతాయి. సూర్య ఆరాధన మేలు చేస్తుంది.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. చేపట్టిన అన్ని పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. నూతన వస్త్ర లాభం. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. ఈ సంతోషాన్ని మీరు బంధుమిత్రులతో పంచుకుంటారు. మిత్రులతో విందువినోదాలలో పాల్గొంటారు. శ్రీలక్ష్మీ ధ్యానం శుభప్రదం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారు ఈ రోజు ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. సహోద్యోగుల సహకారం ఉంటుంది. మీ లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. నవగ్రహ ధ్యానం మేలు చేస్తుంది.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యలు చికాకు పెడతాయి. సంతానం భవిష్యత్ పట్ల ఆందోళనతో ఉంటారు. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. అనవసరమైన కలహాలకు దూరంగా ఉండండి. కళలు, సాహిత్యం పట్ల ఆసక్తితో ఉంటారు. సూర్య ఆరాధన మంచిది.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అనారోగ్యం కారణంగా నీరసంగా ఉంటారు. కుటుంబ కలహాలు కలత పెడతాయి. మానసిక అశాంతికి లోనవుతారు. మీ కీర్తికి భంగం కలిగే అవకాశం కూడా ఉంది. డబ్బు విపరీతగా ఖర్చవుతుంది. శివాభిషేకం జరిపించుకుంటే మేలు జరుగుతుంది.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు చాలా ఆనందంగా గడిచిపోతుంది. ఒత్తిడి, ఆందోళనల నుంచి బయట పడతారు. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. బంధుమిత్రులతో మంచి సమయాన్ని గడుపుతారు. శత్రుజయం. విహారయాత్రలకు వెళతారు. విందువినోదాలలో పాల్గొంటారు. ఆర్థికంగా అనుకూలం. విష్ణు సహస్రనామం పారాయణ చేయండి.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. సహనంతో ఉండాల్సిన సమయం. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఆర్ధిక విషయాలలో జాగ్రత్తగా ఉండకపోతే మోసపోతారు. కుటుంబంలో కలహాలు ఉంటాయి. మౌనం పాటిస్తే మేలు. ఆరోగ్యం బాగుటుంది. ప్రతికూల ఆలోచనలు వీడండి. దుర్గా దేవి ధ్యానం మేలు చేస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.