ETV Bharat / spiritual

ఆ వారికి ఈ రోజు అనుకూలంగా లేదు- అనారోగ్య సమస్యలు వేధిస్తాయి! - HOROSCOPE TODAY TELUGU - HOROSCOPE TODAY TELUGU

Horoscope Today April 18th 2024 : ఏప్రిల్​ 18న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today April 18th 2024
Horoscope Today April 18th 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 18, 2024, 4:27 AM IST

Horoscope Today April 18th 2024 : ఏప్రిల్​ 18న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అనవసరమైన చర్చల కారణంగా వివాదాలు ఏర్పడే అవకాశముంది. వీలైనంత వరకు చర్చల్లో పాల్గొనవద్దు. మానసిక అశాంతి, అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఆర్ధిక ప్రయోజనాలు ఉంటాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. సూర్యుని ఆరాధన మేలు చేస్తుంది.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధు మిత్రులతో సరదాగా గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. వ్యాపారస్థులకు ప్రయాణాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి ఉంటుంది. పలు మార్గాల నుంచి ఆదాయం సమకూరుతుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ఈ రోజు మీరు తీవ్రమైన నిరాశ, నిస్పృహలకు లోనవుతారు. అనారోగ్య సమస్యలు కూడా వేధిస్తాయి. ఇంటి పరిస్థితులు కూడా నిరాశాజనకంగా ఉంటాయి. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత లోపిస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందదు. ఉద్యోగుస్థులకు సహోద్యోగుల సహకారం ఉంటుంది. నవగ్రహ ధ్యానం చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. విహారయాత్రకు వెళతారు. విందువినోదాల్లో పాల్గొంటారు. కొన్ని ఘటనల కారణంగా అశాంతికి గురవుతారు. వ్యాపారస్థులకు పెట్టుబడులు లాభాలను తెచ్చి పెడతాయి. విద్యార్థులు పరీక్షల్లో విజయాలను సాధిస్తారు. గణపతి ఆరాధన శుభప్రదం.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు నిరాశాజనకంగా ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేస్తే మంచిది. జాగ్రత్తగా మాట్లాడండి. ఎవరితోనైనా వాదించడం మానుకోండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్ధిక ప్రయోజనాలు ఉన్నాయి. ఆంజనేయస్వామి ధ్యానం మంచిది.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఇంట్లో బయట ప్రశాంత వాతావరణం ఉంటుంది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా పరిస్థితులు అనుకూలంగా ఉండవచ్చు. మీ చాకచక్యంతో ఆటంకాలను ఎదుర్కొంటారు. పరిస్థితులను మీకు అనుకూలంగా మార్చుకుంటారు. ధనలాభం ఉంది. వృధా ఖర్చులు చేయవద్దు. శ్రీలక్ష్మి ధ్యానం మేలు చేస్తుంది.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది. ఇంట్లో శాంతి నెలకొంటుంది. ఇంటి అలంకరణ పనుల్లో చురుగ్గా పాల్గొంటారు. పని ప్రదేశంలో సహోద్యోగుల సహకారం ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. నృసింహ ధ్యానం మేలు చేస్తుంది.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈరోజు అదృష్టకరంగా ఉంటుంది. దైవ దర్శనాలు, ఆర్ధిక ప్రయోజనాలు ఆనందం కలిగిస్తాయి. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ రోజు మీరు గొప్ప పనులు విజయవంతంగా పూర్తి చేసి ప్రశంసలు పొందుతారు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అనారోగ్యం కారణంగా నీరసంగా, నిరాశతో ఉంటారు. ప్రతికూల ఆలోచనలను వీడి ప్రశాంతంగా ఉండండి. ధన నష్టం ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. విహారయాత్రకు వెళితే మనసు కుదుట పడుతుంది. దుర్గాదేవి ధ్యానం చేస్తే సమస్యల నుంచి బయట పడవచ్చు.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. బంధుమిత్రులతో విహారయాత్రకు వెళతారు. ఆర్ధిక సమస్యలు ఉండవచ్చు. ఖర్చులు అధికం కాకుండా జాగ్రత్త తీసుకోండి. శ్రమకు తగ్గ ఫలితం ఉండదు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. హనుమాన్ చాలీసా పఠిస్తే మేలు కలుగుతుంది.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు అదృష్ట యోగం పడుతుంది. ఆరోగ్యం, సంపద, సంతోషం అనుగ్రహిస్తాయి. ఈ ఆనందాన్ని ఆస్వాదించండి. విందువినోదాల్లో పాల్గొంటారు. నూతన వస్త్ర లాభం. ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం కూడా అనుకూలంగానే ఉంటుంది. శివారాధన శుభప్రదం.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. వాదనలకు దూరంగా ఉంటేనే మంచిది. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. నూతన పెట్టుబడులు పెట్టడానికి సమయం అనుకూలంగా లేదు. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. దైవబలంతో కార్య సిద్ధి కలుగుతుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.