ETV Bharat / spiritual

ఆ రాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది- ఇష్ట దేవతారాధన శుభకరం! - Horoscope Today

Horoscope Today 7th October 2024 : 2024 అక్టోబర్ 7వ తేదీ (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

Horoscope
Horoscope (ETV Bharat)

Horoscope Today 7th October 2024 : 2024 అక్టోబర్ 7వ తేదీ (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నూతన విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలుంటాయి. చెడు విషయాల పట్ల ఆకర్షితులయ్యే ప్రమాదముంది. ఆధ్యాత్మిక భావాలు పెంచుకుంటే మంచిది. ఆదాయం సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. హనుమాన్ చాలీసా పారాయణంతో మనోబలం పెరుగుతుంది.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే వ్యక్తుల పట్ల వేచి చూసే ధోరణి అవలంబించండి. మీ స్వధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. బుద్ధి బలంతో పనిచేసి క్లిష్టమైన కార్యాన్ని సాధిస్తారు. అనుకోకుండా సంపదలు కలిసివస్తాయి. వ్యాపారంలో లాభాలుంటాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగులకు ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. పదోన్నతి వస్తుంది. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. మీ అద్భుతమైన పనితీరుతో అందరినీ మెప్పిస్తారు. వ్యాపారులు, కాంట్రాక్టర్లు ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజు సరదాగా సాగిపోతుంది. స్నేహితులతో సరదాగా గడుపుతారు. అన్ని రంగాల వారికి పనిలో ఏర్పడిన ఆటంకాలు తొలగిపోతాయి. వృత్తి, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఆర్థికంగా ఆశించిన ఫలితాలను అందుకుంటారు. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ దుర్గాదేవి ఆరాధన శుభకరం.

.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కుటుంబ కలహాలకు ఆస్కారముంది. కోపాన్ని అదుపులో ఉంచుకొని ప్రశాంతంగా ఉంటే గొడవలు ఉండవు. ప్రతికూల ఆలోచనల కారణంగా శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కొరవడుతుంది. వృత్తి, వ్యాపారాలలో అనుకోని సమస్యలు, ఆటంకాలు ఏర్పడటం వల్ల అశాంతితో ఉంటారు. ఆర్థిక పరిస్థితి అయోమయంగా ఉంటుంది. నీటి గండం ఉంది కాబట్టి జలాశయాలకు దూరంగా ఉండండి. ఆస్తి సంబంధిత వ్యవహారాలలో బంధువులతో విరోధం ఏర్పడవచ్చు. అభయ ఆంజనేయ స్వామి ఆలయ సందర్శనతో ఆపదలు తొలగుతాయి.

.

కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో ఎదురయ్యే సవాళ్లు, ఆటంకాలను సహచరుల సహకారంతో అధిగమిస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగడం వల్ల ప్రశాంతంగా ఉంటారు. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. బంధువులతో అకారణంగా విరోధం ఏర్పడే ప్రమాదముంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

.

తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో పురోగతి లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది. కీలక వ్యవహారంలో నిర్ణయాలు తీసుకునే విషయంలో సందిగ్ధత నెలకొంటుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. కుటుంబ విషయాల పట్ల మొండి వైఖరి వీడి సహనంతో వ్యవహరిస్తే మంచిది. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. ఆర్థికంగా ఆశించిన ఫలితాలుంటాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అదృష్టం కలిసి వచ్చి సంపదలు సమకూరుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. దీనితో సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. మిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. సన్నిహితుల నుంచి బహుమతులు అందుకుంటారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారులకు ప్రయాణాలు అనుకూలిస్తాయి. శ్రీమహాలక్ష్మి దేవి ఆరాధన శుభకరం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆత్మవిశ్వాసంతో స్థిరమైన నిర్ణయాలు తీసుకొని అందరి ప్రశంసలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన ప్రయోజనాలుంటాయి. ఆర్థికంగా శుభసమయం నడుస్తోంది. సంపదలు కలిసి వస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. స్నేహితులతో విహారయాత్రలకు వెళ్తారు. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన సమావేశాలలో మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. కీలక ఒప్పందాలు చేసుకుంటారు. కుటుంబ సమస్యల పట్ల మీ స్పందన అందరినీ బాధిస్తుంది. అవసరానికి ధనం చేతికి అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. దుర్గాస్తుతి పఠిస్తే మెరుగైన ఫలితాలుంటాయి.

.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మంచి ఆరోగ్యం, మానసిక ప్రశాంతత ఉంటాయి. ఉద్యోగంలో పదోన్నతులు ఉంటాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసి అందరి ప్రశంసలు అందుకుంటారు. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారులు మంచి లాభాలను అందుకుంటారు. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ఉద్యోగులపై అధికారులతో వ్యహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని అదుపులో ఉంచుకొని మాట్లాడకపోతే ప్రమాదంలో పడతారు. ప్రతికూల ఆలోచనలతో మానసిక ప్రశాంతత కోల్పోతారు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. వృత్తి, వ్యాపారాలలో ఎదురయ్యే ఆటంకాలను అధిగమించడంలో విఫలమవుతారు. వ్యాపారంలో పోటీ పెరుగుతుంది. శత్రుభయం ఉంది. హనుమాన్ ఆలయ సందర్శనతో గండాలు తొలగిపోతాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.