ETV Bharat / spiritual

ఆ రాశుల వారికి పదోన్నతి - ఆర్థిక లాభాలు గ్యారెంటీ! - ఈ రోజు రాశిఫలాలు

Horoscope Today 27th January 2024 : జనవరి 27న (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today 27th January 2024
రాశి ఫలాలు
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 27, 2024, 4:57 AM IST

Horoscope Today 27th January 2024 : జనవరి 27న (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) : ఈ రోజు మేష రాశివారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. సమర్థంగా పనిచేసేందుకు కొత్త మార్గాలు వెదుకుతారు. జీవిత భాగస్వామితో మాత్రం సర్దుకుపోయేందుకు ప్రయత్నించాలి. లేకుంటే ఇబ్బందులు తప్పవు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం ఫర్వాలేదు.

వృషభం (Taurus) : ఈ రోజు వృషభ రాశివారు క్షణం తీరిక లేకుండా పనిచేయాల్సి వస్తుంది. వ్యాపారం కోసం చాలా చోట్ల తిరగాల్సి వస్తుంది. ఆర్థిక సమస్యలు మిమ్మల్ని చుట్టుముడతాయి. కానీ మీ సామర్థ్యంతో ఈ సమస్యలను పూర్తిగా అధిగమించగలుగుతారు.

మిథునం (Gemini) : ఈ రోజు మిథున రాశివారు చాలా కష్టపడి పనిచేసి, అందరి ప్రశంసలు పొందుతారు. ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. సహచరులు మీకు అన్ని విధాల సహకరిస్తారు. శారీరక, మానసిక ఆరోగ్యాలు బాగానే ఉంటాయి.

కర్కాటకం (Cancer) : ఈ రోజు కర్కాటక రాశివారికి బాగుంటుంది. పాత పరిచయాలు మీకు లాభాన్ని చేకూరుస్తాయి. పనులను వేగంగా పూర్తి చేస్తారు. మీ సంభాషణ నైపుణ్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. మీ నిజాయితీని ప్రజలు గౌరవిస్తారు. సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు లభిస్తుంది.

సింహం (Leo) : ఈ రోజు సింహ రాశివారు తమ లక్ష్యాన్ని సాధించేందుకు చాలా కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. కొన్ని సమస్యలు కూడా ఏర్పడతాయి. కానీ వాటిని సమర్థంగా పరిష్కరించుకుంటారు. మీ ఆత్మసంకల్పంతో అనుకున్న పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు.

కన్య (Virgo) : ఈ రోజు కన్య రాశివారికి చాలా బాగుంటుంది. మీ భాగస్వామి లేదా స్నేహితుల వల్ల మంచి లాభాలు పొందుతారు. సన్నిహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు. రోజంతా సరదాగా ఉంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.

తుల (Libra) : ఈ రోజు తుల రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. పనులపై దృష్టి సారించాలి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మానసిక శాంతి లభిస్తుంది.

వృశ్చికం (Scorpio) : ఈ రోజు వృశ్చిక రాశివారికి అదృష్టం కలిసి వస్తుంది. దైవ దర్శనం చేసుకుంటారు. వ్యాపార, వ్యవహారాల్లో ఆర్ధిక లాభాలు పొందుతారు. అన్ని వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు.

ధనుస్సు (Sagittarius) : ఈ రోజు ధనుస్సు రాశివారికి ఏమాత్రం బాగుండదు. అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బందిపెడుతుంది. నిరాశాపూరిత ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఆర్థిక నష్టాలు రావచ్చు. కానీ మనోధైర్యంతో ఉండాలి. ఆత్మబలంతో పనిచేస్తే, కచ్చితంగా విజయం సాధించగలరు.

మకరం (Capricorn) : ఈ రోజు మకర రాశివారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఒక పర్యటన కోసం ప్రణాళిక వేసుకుంటారు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావచ్చు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం రాకపోవచ్చు.

కుంభం (Aquarius) : ఈ రోజు కుంభ రాశివారు వృత్తి, వ్యవహారాల్లో బాగా రాణిస్తారు. సేవారంగంలో ఉన్నవారు మంచి లాభాలు సంపాదిస్తారు. మీ జీతాలు పెరిగే ఛాన్స్ ఉంది. పదోన్నతి కూడా లభించవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.

మీనం (Pisces) : ఈ రోజు మీన రాశివారికి చాలా బాగుంటుంది. మీ పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తారు. రియల్​ ఎస్టేట్ రంగంలోనూ రాణిస్తారు. భవిష్యత్​ కోసం మరిన్ని పెట్టుబడులు కూడా పెడతారు. కానీ జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. ఆరోగ్యం ఫర్వాలేదు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.