Horoscope Today 24 January 2024 : జనవరి 24న (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
.
మేషం (Aries) : ఈ రోజు మేష రాశివారికి చాలా బాగుంటుంది. పర్యటనలు చేయాలని అనుకుంటారు. మీరు అనుకున్న పనులు అన్నీ సక్రమంగా చేయగలుగుతారు. మీ వైఖరిలో కూడా అనేక మార్పులు రావచ్చు. అనవసర వాదనల్లో తలదూర్చకూడదు.
.
వృషభం (Taurus) : ఈ రోజు వృషభ రాశివారు చాలా నిగ్రహంగా ఉండాలి. ఏ పనిలోనూ వేగిరపడకూడదు. మనస్సులో చాలా గందరగోళానికి గురవుతారు. రాజీ ధోరణి అవలంభించడం మంచిది. అయితే కళాకారులకు, రచయితలకు ఈ రోజు కలిసి వస్తుంది. ప్రయాణాలు, కొత్త పనులు, కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది.
.
మిథునం (Gemini) : ఈ రోజు మిథున రాశివారు స్నేహితులతో, సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థికంగా లాభపడతారు. కానీ ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. ప్రతికూల పరిస్థితిలు ఎదురుకావచ్చు. కానీ ఆత్మస్థైర్యంతో పనిచేయాలి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.
.
కర్కాటకం (Cancer) : ఈ రోజు కర్కాటక రాశివారికి గందరగోళ పరిస్థితిలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు రావచ్చు. ఖర్చులు పెరుగుతాయి. మాటలను నియంత్రించుకోవాలి. అపార్థాలను తొలగించుకునే ప్రయత్నం చేయాలి. దైవ ధ్యానం చేయడం మంచిది.
.
సింహం (Leo) : ఈ రోజు సింహ రాశివారికి లాభదాయకంగా ఉంటుంది. స్త్రీలతో మీ సాంగత్యం బాగుంటుంది. విహారయాత్రలకు వెళతారు. ఈ రోజు మీకు మంచి అవకాశాలు వస్తాయి. వాటిని జాగ్రత్తగా ఒడిసిపట్టుకోవాలి. లేదంటే అవకాశాలు చేజారిపోతాయి.
.
కన్య (Virgo) : ఈ రోజు కన్య రాశివారు కొత్త పనులు ప్రారంభించి, వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. తారాబలం బాగా ఉండడం వల్ల ప్రభుత్వం నుంచి కూడా లబ్ధి చేకూరవచ్చు. అనుకున్న కార్యాలన్నీ అనాయాసంగా జరిగిపోతాయి.
.
తుల (Libra) : ఈ రోజు తుల రాశివారికి చాలా బాగుంటుంది. కొత్తగా ప్రారంభించిన పనులు విజయవంతం అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాణిస్తారు. సహోద్యోగాల సహకారంతో అన్ని పనులను సక్రమంగా పూర్తి చేస్తారు. వ్యాపారులకు మంచి లాభలు వస్తాయి. ఆరోగ్యంపై మాత్రం ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలి. అనవసర వాదనలకు దూరంగా ఉండాలి.
.
వృశ్చికం (Scorpio) : ఈ రోజు వృశ్చిక రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. పనులు అనుకున్నట్లుగా జరగవు. కొత్త పనులు, కార్యక్రామాలు వాయిదా వేసుకోవడం మంచిది. కోపతాపాలను అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
.
ధనుస్సు (Sagittarius) : ఈ రోజు ధనుస్సు రాశివారు చాలా సంతోషంగా ఉంటారు. విహార యాత్రలకు వెళతారు. అక్కడ భిన్న సంస్కృతులకు చెందిన వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంది. మీలోని సృజనాత్మకతను వెలికి తీస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. సమాజంలో మీ పరపతి పెరుగుతుంది.
.
మకరం (Capricorn) : ఈ రోజు మకర రాశివారికి శుభ ఫలితాలు కలుగుతాయి. వ్యాపారులు, వృత్తి నిపుణులు, గృహిణిలు, విద్యార్థులు అందరూ రాణిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో మంచి ప్రయోజనాలు పొందుతారు. ప్రభుత్వ వ్యవహారాలు కూడా సాఫీగా సాగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.
.
కుంభం (Aquarius) : ఈ రోజు కుంభ రాశివారు కొత్త ప్రాజెక్టులు, ప్రయాణాల వాయిదా వేసుకోవడం మంచిది. ఈ రోజంతా మీరు అశాంతితో, ఆందోళనతో ఉంటారు. మిమ్మల్ని రెచ్చగొట్టేందుకు అనేక మంది ప్రయత్నిస్తారు. శాంతం వహించండి. మీలోని సృజనాత్మకతను ప్రపంచానికి తెలియజేసేందుకు ప్రయత్నించండి.
.
మీనం (Pisces) : ఈ రోజు మీన రాశివారికి నిరాశాపూరితంగా ఉంటుంది. మానసిక, శారీరక ఆరోగ్యాలు బాగుండవు. కొన్ని ఘటనలు మిమ్మల్ని కలతకు గురి చేస్తాయి. అనవసర వాదనల్లోకి దిగకండి. వృత్తిపరంగా నష్టాలు రావచ్చు. కానీ ఆత్మస్థైర్యంతో పనిచేస్తే సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది.