ETV Bharat / spiritual

ఆ రాశివారు కోపాన్ని అదుపు చేసుకోకపోతే సమస్యలు తప్పవ్‌ - గణపతి ఆలయ సందర్శన శుభకరం! - HOROSCOPE TODAY

అక్టోబర్ 23వ తేదీ (బుధవారం) రాశిఫలాలు - ఎలా ఉన్నాయంటే?

Horoscope
Horoscope (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 23, 2024, 5:01 AM IST

Horoscope Today 23rd October 2024 : 2024 అక్టోబర్ 23వ తేదీ (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు సరదాగా గడిచిపోతుంది. విజ్ఞాన వినోద యాత్రలకు వెళ్లి జ్ఞానాన్ని సంపాదిస్తారు. ఇది మీ భవిష్యత్తుకి ఉపకరిస్తుంది. ఈ రోజు మీ జీవితాంతం గుర్తుంచుకునేలా మిగిలిపోతుంది. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన ప్రయోజనాలను అందుకుంటారు. బుద్ధిబలంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. ఆరోగ్యం బాగుంటుంది. గణపతి ఆలయ సందర్శన శుభకరం.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఏ పనిలోనూ తొందరపాటు పనికిరాదు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆచితూచి నడుచుకోవాలి. నిదానమే ప్రధానం అన్న సూత్రాన్ని పాటించాలి. మొండి పట్టుదలతో సమయం వృథా అవుతుంది. రాజీ ధోరణి అవలంభించాలి. కళాకారులు, రచయితలకు ఈ రోజు అనుకూలంగా ఉంది. సామాజిక స్పృహతో చేసే రచనలకు మంచి పేరు వస్తుంది. అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలు వినియోగించుకుని వృత్తిపరంగా ఎదిగేందుకు శ్రీకారం చుట్టండి. ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. హనుమాన్ చాలీసా పారాయణతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సామాజిక సంబంధాలు మెరుగు పరుచుకోవడంపై దృష్టి సారిస్తారు. స్నేహితులతో, సన్నిహితులతో మంచి సమయాన్ని గడుపుతారు. విందు, వినోదాలలో పాల్గొంటారు. ఆర్థిక అంశాలలో మంచి లాభాలు అందుకుంటారు. ఖర్చులు అదుపు తప్పుతాయి. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో ఎదురయ్యే సమస్యల కారణంగా గందరగోళంగా, అయోమయంగా ఉంటారు. ఎటూ తేల్చుకోలేని సందిగ్ధతలో ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య మనఃస్పర్థలు రావడానికి అవకాశం ఉంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. అదనపు ఆదాయ వనరుల కోసం ప్రయత్నిస్తారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం. అందరితో స్నేహభావంతో మెలిగితే అపార్థాలు తొలగిపోతాయి. ఆర్థికంగా గడ్డు కాలం. శ్రీలక్ష్మీదేవి ఆరాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గొప్ప ఆత్మవిశ్వాసంతో పనిచేసి నిర్దేశించుకున్న లక్ష్యాలను సునాయాసంగా సాధిస్తారు. పనిప్రదేశంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో హోదా పెరగడంతో నూతన బాధ్యతలను స్వీకరిస్తారు. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు. కుటుంబ సభ్యులతో అనుబంధం దృఢ పడుతుంది. అందరు గర్వించే స్థాయికి ఎదుగుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగులకు ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. చేపట్టిన అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో పదోన్నతులు, సహోద్యోగుల సహకారం ఉంటాయి. వ్యక్తిగత జీవితం ఉత్సాహభరితంగా ఉంటుంది. ప్రభుత్వపరంగా లాభాలు అందుకుంటారు. వ్యాపారులు సునాయాసంగా లాభాలను అందుకుంటారు. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చిత్ర లేఖనం, శిల్పకళ వంటి అంశాలలో ఆసక్తి కనబరుస్తారు. కొత్త ప్రాజెక్టులు, అసైన్‌మెంట్లు మొదలు పెట్టడానికి శుభసమయం. వృత్తిపరంగా ఉన్నతంగా ఎదుగుతారు. వ్యాపారులకు సమయం కలిసి వస్తుంది. ఊహించని లాభాలను అందుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. తీర్థయాత్రలకు వెళ్తారు. ఎవరితోనూ అనవసర వాదనలకు దిగవద్దు. తీర్థయాత్రకి వెళ్లే అవకాశం ఉంది. ఈశ్వర ఆరాధన శ్రేయస్కరం.

.

వృశ్చికం (Scorpio) : సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గొప్ప ఆత్మవిశ్వాసంతో పనిచేసి నిర్దేశించుకున్న లక్ష్యాలను సునాయాసంగా సాధిస్తారు. పనిప్రదేశంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో హోదా పెరగడం వల్ల నూతన బాధ్యతలను స్వీకరిస్తారు. దృఢ సంకల్పంతో, కార్యదీక్షతో కొన్ని ముఖ్య వ్యవహారాలలో విజయం సాధిస్తారు. మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని చూసి గర్వ పడే స్థాయికి ఎదుగుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన అన్ని పనులు సకాలంలో పూర్తి కావడం వల్ల సంతోషంగా ఉంటారు. పిత్రార్జితం కలిసి రావడం వల్ల ఆనందంగా ఉంటారు. ఉద్యోగులకు స్థానచలనం జరిగే సూచన ఉంది. కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. ఓ శుభవార్త మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. సమాజంలో గౌరవం, ప్రతిష్ఠ పెరుగుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. గణపతి ఆలయ సందర్శన శుభకరం.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారవేత్తలు, వృత్తి నిపుణులు, ఉద్యోగులు, విద్యార్థులు అందరికీ ఈ రోజు విశేషంగా యోగిస్తుంది. ఏ పని తలపెట్టినా విజయం వెన్నంటే ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలు, వృత్తిపరమైన జీవితంలో అంతటా ఆనందమే! ముఖ్యమైన వ్యవహారాలు ఎలాంటి ఆటంకం లేకుండా సాఫీగా సాగిపోతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. గ్రహ సంచారం అనుకూలంగా లేనందున ఈ రోజు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించకూడదు. ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. వృత్తిపరంగా ఎదురయ్యే సమస్యలతో ఈ రోజు మొత్తం అశాంతితో, ఆందోళనతో ఉంటారు. మిమ్మల్ని రెచ్చగొట్టే వ్యక్తులను పట్టించుకోకుండా ఉంటే మంచిది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఖర్చులు పెరిగే సూచన ఉంది. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి చేపట్టిన పనుల్లో ఆలస్యం, ఆర్థిక నష్టాలు ఉంటాయి. ఎటు చూసినా సమస్యలే ఉండడం వల్ల చాలా నిరాశగా ఉంటారు. మానసిక, శారీరక ఉత్సాహం కొరవడుతుంది. కొన్ని ఘటనల కారణంగా కలత చెందుతారు. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఎవరితోనూ వాదనల్లోకి దిగవద్దు. కుటుంబ సభ్యులతో గొడవలు, వాదనలకు దిగడం సరైన పని కాదు. వృత్తిపరంగా కూడా నష్టాలు ఉండవచ్చు. శనీశ్వరునికి తైలాభిషేకం చేయిస్తే సానుకూల ఫలితాలు ఉంటాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.