ETV Bharat / spiritual

ఆ రాశివారు మాటలు అదుపులో పెట్టుకోవాలి - లేదంటే చిక్కులు తప్పవ్! - ఈ రోజు రాశిఫలాలు

Horoscope Today 23 January 2024 : జనవరి 23న (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today 23 January 2024
రాశి ఫలాలు
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 23, 2024, 6:07 AM IST

Updated : Jan 23, 2024, 6:43 AM IST

Horoscope Today 23 January 2024 : జనవరి 23న (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : ఈ రోజు మేష రాశివారికి శుభ ఫలితాలు కలుగుతాయి. కానీ మానసిక ప్రశాంతత లోపిస్తుంది. కీలమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. కనుక కీలక నిర్ణయాలు ఇవాళ తీసుకోకపోవడం మంచిది. అధికారిక పనుల మీద ప్రయాణాలు చేయాల్సి రావచ్చు.

.

వృషభం (Taurus) : ఈ రోజు వృషభ రాశివారు ఏకాంతంగా, ప్రశాంతంగా ఉండాలి. కీలకమైన అవకాశాలు చేజారిపోయే అవకాశం ఉంది. సర్దుబాటు ధోరణి అవలంభించడం మంచిది. ప్రయాణాలు వాయిదా వేయాలి. ఈ రోజు ప్రత్యేకంగా రచయితలకు, కళాకారులకు బాగుంటుంది. కానీ కొత్త వ్యాపారాలు, పనులు ప్రారంభించకూడదు.

.

మిథునం (Gemini) : ఈ రోజు మిథున రాశివారికి మంచి ఆర్థిక లాభాలు కలుగుతాయి. నచ్చిన ఆహారాన్ని భుజిస్తారు. కొత్త దుస్తులు కొనుగోలు చేస్తారు. స్నేహితుల, బంధువుల సాంగత్యంలో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కానీ ఖర్చులను అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది.

.

కర్కాటకం (Cancer) : ఈ రోజు కర్కాటక రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేయాలి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మాటలను అదుపులో పెట్టుకోవాలి. అపార్థాలను తొలగించే ప్రయత్నం చేయండి. ఆరోగ్యం జాగ్రత్త!

.

సింహం (Leo) : ఈ రోజు సింహ రాశివారికి మంచి లాభదాయకంగా ఉంటుంది. కానీ సరైన నిర్ణయం తీసుకోకపోతే, మంచి అవకాశాలు చేజారిపోయే ప్రమాదం ఉంది. మనోహరమైన ప్రదేశాలను చూడడానికి ప్రణాళిక వేసుకుంటారు. ఉదారంగా దానధర్మాలు చేస్తారు.

.

కన్య (Virgo) : ఈ రోజు కన్య రాశివారికి ఎంతో బాగుంటుంది. వ్యాపార, వ్యవహారాల్లో విజయం వరిస్తుంది. ఉద్యోగలకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. తారాబలం బాగుంది కనుక తండ్రి ద్వారా ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. ఇంట్లో శాంతియుత వాతావరణం ఉంటుంది.

.

తుల (Libra) : ఈ రోజు వ్యాపారులకు మంచి లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగులకు తోటివారి నుంచి పూర్తి సహాయ, సహకారాలు లభిస్తాయి. తీర్థయాత్రలు చేయడానికి ఆలోచన చేస్తారు. సాహిత్యంపైన, మేధోపరమైన అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తారు.

.

వృశ్చికం (Scorpio) : ఈ రోజు వృశ్చిక రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. పనులు సకాలంలో జరగకపోవచ్చు. కీలకమైన పనులను, కార్యక్రమాలను వాయిదా వేయడం మంచిది. కోపాన్ని నియంత్రించుకోండి. చట్టవిరుద్ధమైన, ప్రమాదకరమైన పనులకు దూరంగా ఉండాలి.

.

ధనుస్సు (Sagittarius) : ఈ రోజు ధనుస్సు రాశివారు చాలా ఉల్లాసంగా, చురుకుగా ఉంటారు. విదేశీయుల సాంగత్యం ఏర్పడవచ్చు. స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు. సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. భాగస్వాముల మూలంగా లాభపడతారు.

.

మకరం (Capricorn) : ఈ రోజు మకర రాశివారు ప్రియమైన వారితో కలిసి సంతోషంగా గడుపుతారు. మధుర క్షణాలను ఆస్వాదిస్తారు. కొత్త వస్తువులు, దుస్తులు కొనుగోలు చేస్తారు. అధికంగా ఖర్చు చేస్తారు. కానీ వాటిని అదుపులో ఉంచుకోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

.

కుంభం (Aquarius) : ఈ రోజు కుంభ రాశివారు చాలా అప్రమత్తంగా ఉండాలి. కొత్త పనులు ప్రారంభించకూడదు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. రోజంతా అనేక ఇబ్బందులు ఏర్పడతాయి. అనవస వాదనల్లోకి దిగకండి. ఖర్చులను అదుపులో ఉంచుకోండి.

.

మీనం (Pisces) : ఈ రోజు మీన రాశివారు కఠినమైన సమస్యలు ఎదుర్కొంటారు. మీ ఆత్మవిశ్వసం సన్నగిల్లుతుంది. ఆరోగ్యం దెబ్బతినవచ్చు. ఆర్థిక నష్టాలు ఏర్పడవచ్చు. స్త్రీలతో మాట్లాడేటప్పుడు చాాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంది.

Last Updated : Jan 23, 2024, 6:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.