Horoscope Today 15th September 2024 : 2024 సెప్టెంబర్ 15వ తేదీ (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. ఈ రాశివారిని ఈ రోజు అదృష్టం వరిస్తుంది. అన్ని రంగాల వారికి నూతన అవకాశాలు తలుపు తట్టవచ్చు. చేతికి అంది వచ్చిన అవకాశాలను సమర్ధవంతంగా వినియోగించుకుంటారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు ప్రణాళిక వేసుకుంటారు. అన్ని రంగాల వారికి ఊహించని శుభఫలితాలు ఉంటాయి. లక్ష్మీకటాక్షం, విజయసిద్ధి ఉంటాయి. శ్రీలక్ష్మి గణపతి ఆలయ సందర్శన శుభకరం.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ రోజు చేపట్టిన వృత్తిలో అభివృద్ధి, ధన లాభం చేకూరుతాయి. ఉద్యోగులకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న విదేశీ అవకాశాలు లభిస్తాయి. అంత అనుకూలంగా ఉండడం వల్ల మానసికంగా సంతోషంగా ఉంటారు. మొదలు పెట్టిన అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. విందువినోదాలలో పాల్గొంటారు. ఇంట్లో శుభకార్య సంబంధిత చర్చలు జరుగుతాయి. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. మీ మాటతీరు, ప్రవర్తన ఇతరులను ఆకట్టుకునేలా ఉంటేనే మంచిది. ఆవేశంతో, తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలు చేటు చేస్తాయి. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. వివాదాలు, వాదనలకు దూరంగా ఉంటే మంచిది. వృత్తి నిపుణులకు, వ్యాపారులకు సామాన్య ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. అనారోగ్య సమస్యలు ఉంటాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజంతా సరదాగా గడుపుతారు. ఆర్ధిక సంబంధమైన లావాదేవీలు అనుకూలిస్తాయి. ఊహించని ధనలాభాలను అందుకుంటారు. వృత్తివ్యాపారస్తులకు పురోగతి ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. వ్యాపార విస్తరణ కోసం రుణాలకు ప్రయత్నించే వారికి ఇది సరైన సమయం. నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తివ్యాపార రంగాల వారికి సామాన్య ఫలితాలు ఉంటాయి. ఆర్ధిక ప్రయోజనాలు మెరుగ్గా ఉంటాయి. ఈ రోజు ఈ రాశి వారు ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో నిమగ్నం అవుతారు. తీర్ధ యాత్రలకు వెళతారు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. విదేశీ బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగులు ఏకాగ్రతతో పనిచేస్తే పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. బంధువులలో ఒకరి ప్రవర్తన మనస్తాపం కలిగించవచ్చు. ఆంజనేయ స్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. సంఘంలో మంచి పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తారు. వ్యాపారులకు, వారి భాగస్వాములకు మధ్య అనుకూలత ఉంటుంది. మంచి లాభాలను గడిస్తారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారు విపరీతమైన లాభాలను అందుకుంటారు. నూతన వస్త్రలాభం. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశం ఉంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఎదురయ్యే సవాళ్ల కారణంగా మానసికంగా విపరీతమైన ఒత్తిడి వుంటుంది. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వృత్తి నిపుణులకు, ఉద్యోగులకు ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. వ్యాపారులు నష్టాలను చవి చూస్తారు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మేలు జరుగుతుంది.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ఇంటా బయటా ఘర్షణలకు దూరంగా ఉంటే మంచిది. సంతానం చదువు పట్ల ఆందోళనతో ఉంటారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి మంచిరోజు. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల వారికి ఆశించిన మేర ప్రయోజనాలు ఉండకపోవచ్చు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. ధననష్టం సూచితం. స్థిరాస్తి రంగం వారు రుణాలు చేయాల్సి వస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. తీవ్రమైన అనారోగ్య సమస్యలు కారణంగా అధిక ధనవ్యయం ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ రోజు ప్రతికూలతలు ఎదురవుతాయి. అనుకోని రీతిలో వ్యాపారంలో నష్టాలు వస్తాయి. ఆర్ధికంగా ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. ఆస్తికి సంబంధించిన విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వాదనలకు దారితీసే చర్చలకు దూరంగా ఉండండి. కుటుంబంలో అశాంతి నెలకొంటుంది. ఆర్ధిక సమస్యలు చుట్టుముడతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. వృత్తివ్యాపారాలలో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగులు సహోద్యోగులపై సహకారంతో అన్ని పనులలో విజయం సాధిస్తారు. పని ప్రదేశంలో మీ ప్రతిభకు ప్రశంసలు అందుకుంటారు. పదోన్నతి యోగం ఉంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజంతా మీరు సంతోషంగా ఉంటారు. వృత్తి వ్యాపార రంగాల వారు, ఉద్యోగులు చేపట్టిన అన్ని పనులు సకాలంలో పూర్తి చేసి మంచి పేరు, గుర్తింపు సాధిస్తారు. ఇంటా బయటా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. శివారాధన శ్రేయస్కరం.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తిలో పురోగతి ఉంటుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా శుభవార్తలు అందుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. వ్యాపారులకు భాగస్వామ్య వ్యాపారాలు కలిసివస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కార్యసిద్ధి హనుమాన్ ఆలయ సందర్శన శ్రేయస్కరం.