ETV Bharat / spiritual

ఆ రాశివారు వృధా ఖర్చులు కచ్చితంగా తగ్గించాల్సిందే - లేకుంటే ఆర్థిక కష్టాలు ఖాయం! - HOROSCOPE TODAY

2024 డిసెంబర్​ 15వ తేదీ (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today
Horoscope Today (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 15, 2024, 4:00 AM IST

Horoscope Today December 15th 2024 : డిసెంబర్​ 15వ తేదీ (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. అన్ని రంగాల వారిని ఈ రోజు అదృష్టం వరిస్తుంది. ఒక సువర్ణావకాశం నేడు మీ ఇంటి తలుపు తట్టవచ్చు. భవిష్యత్తు కోసం తగిన పొదుపు చేసుకోగలుగుతారు. మీ జీవితంలో వచ్చే అవకాశాల ద్వారా వ్యాపారంలో కొత్త మైలురాళ్లు సృష్టించుకుంటారు. ప్రయత్నపూర్వక కార్యసిద్ధి ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. గ్రహసంచారం అనుకూలంగా ఉన్నందున అన్ని రంగాలవారు ముఖ్యమైన పనులను ఈ రోజు మొదలు పెడితే విజయం కలుగుతుంది. ఆర్థికంగా లబ్దిపొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మీ కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. రావలసిన బకాయిలు వసూలవుతాయి. అభయ ఆంజనేయ స్వామి ఆలయ సందర్శన శుభకరం.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. చేసే పనికి చెప్పే మాటలకూ పొంతన లేకపోవడం వల్ల నలుగురిలో అవమానకర పరిస్థితులు ఏర్పడవచ్చు. మీ చర్యలు మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. కాబట్టి హుందాగా వ్యవహరించడం అవసరం. విలాసాల కోసం అధిక ధనవ్యయం చేస్తారు. రుణభారం పెరగవచ్చు. సమయానికి ధనం చేతికి అందక ఇబ్బడి పడతారు. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. శనిస్తోత్రం పఠిస్తే ప్రతికూలతలు తొలగి పోతాయి.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో ప్రతికూల పరిస్థితి ఉన్నప్పటికీ మీ కృషి, కఠిన శ్రమ కారణంగా చక్కని ఫలితాలు అందుకుంటారు. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. ఆరోగ్యం అంతగా సహకరించకపోవచ్చు. వృధా ఖర్చులు నివారిస్తే మంచిది. శివారాధన శ్రేయస్కరం.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఈ రోజు కీలక విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేయగలిగితే విజయం సిద్ధిస్తుంది. ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. తీవ్రమైన ఒత్తిడి, ఉద్రిక్తత కారణంగా చికాకుగా ఉంటుంది. కుటుంబసభ్యులతో వాదనలు ఘర్షణల్లో మౌనంగా ఉండండి. శ్రీ దత్తాత్రేయ స్వామి ప్రార్థన మేలు చేస్తుంది.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. స్నేహితులు, బంధువుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. అదనపు ఆదాయ వనరులు సమకూరుతాయి. చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. విందు, వినోదాలలో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. అభయ ఆంజనేయ స్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారు అధిక పని వత్తిడి వల్ల ఆందోళనకు గురవుతారు. ఉద్యోగులు అనుకున్న సమయంలో పనులు పూర్తికాక ఉన్నతాధికారుల నుంచి విమర్శలు అందుకుంటారు. ప్రయాణాలలో అవరోధాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ధననష్టం సంభవించే సూచన ఉంది. కాబట్టి ఆర్థిక లావాదేవీలు నిర్వహించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఆడుతూ పాడుతూ అన్ని పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఎలాంటి ఆటంకాలు, సవాళ్లు లేని మంచి రోజు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ముఖ్యమైన పనులు ఈ రోజు ప్రారంభిస్తే సత్ఫలితాలు ఉంటాయి. ఆదాయం పెరగడం సంతోషం కలిగిస్తుంది. వ్యాపారపరంగా నూతన ఒప్పందాలు చేసుకుంటారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రం పారాయణ మేలు చేస్తుంది.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలలో శ్రద్ధ పెట్టాలి. విజయం కోసం శ్రమించాలి. ఇంతకాలం గోప్యంగా ఉంచిన కొన్ని విషయాలు బహిర్గతం అవుతాయి. మీరు స్వయంగా వాటిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కుటుంబంలో వివాదాలు రాకుండా జాగ్రత్త పడాలి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. గురు శ్లోకాలు పాటించడం ఉత్తమం.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తినిపుణులు, వ్యాపారులకు అనుకూలమైన రోజు. సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని గడుపుతారు. పని ఒత్తిడి అధికంగా ఉన్నా అధిగమిస్తారు. ఆర్థికంగా ఉన్నత స్థానానికి ఎదుగుతారు. ఖర్చులు పెరుగుతాయి. బంధువుల నుంచి అందిన శుభవార్త ఆనందం కలిగిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ రోజు ముఖ్యమైన రోజు. సమయస్ఫూర్తితో, బుద్ధిబలంతో వ్యవహరిస్తే ఊహించని ప్రయోజనాలు ఉంటాయి. తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి. న్యాయ సంబంధ అంశాలలో విజయం సిద్ధిస్తుంది. కుటుంబ శ్రేయస్సు కోసం పని చేస్తారు. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. గురు దర్శనం మేలు చేస్తుంది.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి శుభ సమయం నడుస్తోంది. కొత్త వ్యక్తులను కలుస్తారు. ప్రత్యేకమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ సామాజిక పరిధి పెరుగుతుంది. వృత్తిపరంగా శక్తివంతంగా ఉంటారు. అన్ని పనులు అనుకున్నట్లుగా పూర్తి కావడంతో సంతోషంగా ఉంటారు. వ్యక్తిగత జీవితంలో అనుకోని సమస్యలు ఎదురుకావచ్చు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు చేపట్టే విషయంలో ఒకింత ఆందోళనకు గురవుతారు. దత్తాత్రేయుని ఆలయ దర్శనం మేలు చేస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.