ETV Bharat / spiritual

ఆ రాశివారు వాటిని సద్వినియోగం చేసుకుంటే చాలు- ఏదైనా సాధించడం గ్యారెంటీ! - HOROSCOPE TODAY

2024 డిసెంబర్​ 13వ తేదీ (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope
Horoscope (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 13, 2024, 4:10 AM IST

Horoscope Today December 13th 2024 : డిసెంబర్​ 13వ తేదీ (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ రోజు ఉత్సాహంగా ప్రారంభమవుతుంది. మానసిక, శారీరక స్థితి అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా అభివృద్ధికి సంబంధించిన శుభ వార్తలు వింటారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం ఆనందభరితంగా ఉంటుంది. స్నేహితులు, ప్రియమైన వారిని మీరు కలుసుకుంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో ఏర్పడిన సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. గందరగోళంగా ఉండే మీ మానసిక స్థితి మరింత ఇబ్బంది పెడుతుంది. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై డబ్బు ఖర్చు చేసే అవకాశాలున్నాయి. ప్రియమైన వ్యక్తులతో మనస్పర్థలు ఏర్పడవచ్చు. వృధా ఖర్చులు పెరుగుతాయి. హనుమాన్ చాలీసా పారాయణతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా స్నేహితుల ద్వారా ఈ రోజు లబ్ది పొందుతారు. మీ భవిష్యత్‌లో ఉపయోగపడే వ్యక్తులతో పరిచయం కలుగుతుంది. ఆర్థికంగా ఈ రోజు ఊహించిన దానికన్నా ఎక్కువ లబ్ది పొందుతారు. ప్రభుత్వం నుంచి కూడా ఆర్థిక లబ్ధి అందుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సన్నిహితులతో వ్యక్తిగత, వృత్తిగత వ్యవహారాల గురించి చర్చిస్తారు. చర్చలు ఫలవంతం కావడం వల్ల ఆనందంగా ఉంటారు. ఉద్యోగులకు, వృత్తి నిపుణులకు అధిక పనిభారం ఉండవచ్చు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. శివారాధన శ్రేయస్కరం.

.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారు తీవ్రమైన పని ఒత్తిడితో మానసికంగా, శారీరకంగా అలసటకు గురవుతారు. అనవసర గొడవలు, వివాదాలు ఏర్పడకుండా ఉండేందుకు మీ కోపావేశాలను, దూకుడును నియంత్రణలో ఉంచుకోవాలి. బంధువులతో కూడా మనస్పర్థలు ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు నిర్వహించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. కార్యసిద్ధి హనుమ ఆరాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తీవ్రమైన భావోద్వేగాలతో మానసిక ఒత్తిడికి గురవుతారు. వివాదాలు ఏర్పడకుండా చూసేందుకు మీ మాటను అదుపులో పెట్టుకోండి. మీ ఆరోగ్యం కూడా స్వల్పంగా ఇబ్బంది పెడుతుంది. ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది. ప్రకృతి వైపు ఆకర్షితులవుతారు. ఆదాయం సామాన్యంగా ఉంటుంది. అభయ ఆంజనేయస్వామి ఆలయ సందర్శన శుభకరం.

.

తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇంటా బయటా వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు ఒకటికి, రెండుసార్లు ఆలోచించి మాట్లాడండి. మీ మాటతీరు కారణంగా ఊహించని పరిస్థితులు ఏర్పడవచ్చు. మీ శత్రువులు పొంచి ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు గ్రహ సంచారం అనుకూలంగా లేదు కాబట్టి నూతన పనులను ప్రారంభించకండి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా శుభ సమయం నడుస్తోంది. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. నూతన ఆర్థిక వనరులను ఏర్పాటు చేసుకోవడానికి ఇది మంచి సమయం. ఈ రోజంతా మేథోపరమైన, సామాజిక చర్చల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో విందు వినోదాలలో పాల్గొని ఆనందంగా గడుపుతారు. శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఉన్నత స్థానానికి ఎదుగుతారు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఈ రోజు ఈ రాశి వారికి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు రావడానికి మరికొంత సమయం పట్టవచ్చు. సహనంతో ఉంటే మంచిది. ప్రయాణాలను వాయిదా వేసుకోండి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. ఆదిత్య హృదయం పారాయణతో ప్రతికూలతలు తొలగిపోతాయి.

.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాల పట్ల ఎక్కువ ఎమోషనల్‌, సెంటిమెంటల్‌గా ఉండడం మంచి కాదు. ఆస్తులు, భూములకు సంబంధించిన వ్యవహారాలకు ఈ రోజు దూరంగా ఉంటే మంచిది. వృత్తి, వ్యాపారాలలో ఎదుగుదల లేకపోవడంతో మానసికంగా చికాకుగా అనిపిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. మొండితనం వీడి పట్టు విడుపుల ధోరణితో వివాదాలు సమసిపోతాయి. ఈశ్వరుని ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొత్త పనులు చేపట్టేందుకు ఉత్సాహం చూపిస్తారు. ఉద్యోగంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నందున ఆచి తూచి అడుగేయాల్సి ఉంటుంది. ముఖ్యమైన విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. రచయితలకు ఇది మంచి సమయం. మీ రచనల ద్వారా సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీరామ నామజపం రక్షిస్తుంది.

.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ జీవితంలో ఏర్పడిన అవాంతరాలను తొలగించుకునే ప్రయత్నం చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో పని ఒత్తిడిని సన్నిహితుల సహకారంతో అధిగమిస్తారు. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. విహారయాత్రలకు వెళ్తారు. అనుకోని విధంగా సంపదలు కలిసివస్తాయి. నూతన వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు. శ్రీలక్ష్మీ ధ్యానం శుభప్రదం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.