ETV Bharat / spiritual

విద్యార్థులకు జ్ఞానప్రదాత హయగ్రీవుడు- సోమవారం ఇలా పూజిస్తే విద్యాబుద్ధులు పక్కా! - Hayagriva Jayanti 2024 - HAYAGRIVA JAYANTI 2024

Hayagriva Jayanti Puja Vidhi In Telugu : ధర్మ సంస్థాపన కోసం శ్రీ మహావిష్ణువు దశావతారాలను ధరించిన సంగతి తెలిసిందే! అయితే తన భక్తుల కోసం విష్ణువు దాల్చిన అవతారాల్లో హయగ్రీవావతారం ఒకటి. ఆగస్టు 19వ తేదీ సోమవారం రానున్న హయగ్రీవ జయంతి సందర్భంగా హయగ్రీవ అవతార విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

Hayagriva Jayanti 2024
Hayagriva Jayanti 2024 (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 19, 2024, 4:05 AM IST

Hayagriva Jayanti Puja Vidhi In Telugu : విద్యలకు అధిపతిగా, జ్ఞాన ప్రదాతగా పూజలందుకునే హయగ్రీవ స్వామిని ఆరాధిస్తే జ్ఞానానికి లోటుండదని శాస్త్ర వచనం. దేవీ పురాణం, స్కంద పురాణం, శ్రీమద్భాగవతంతో పాటు ఆగమ శాస్త్రాల్లో కూడా హయగ్రీవుని ప్రస్తావన ఉంది. హయగ్రీవ జయంతి రోజున హయగ్రీవ స్వామిని ఆరాధిస్తే తరగని జ్ఞాన సంపద లభిస్తుందని గురువులు పెద్దలు చెబుతారు. హయగ్రీవ జయంతి వెనుక ఉన్న పురాణ గాథ గురించి తెలుసుకుందాం.

హయగ్రీవుని ఘోర తపస్సు
పూర్వం హయగ్రీవుడు అనే రాక్షసుడు ఉండేవాడు. గుర్రం తలను కలిగిన హయగ్రీవుడు బ్రహ్మ దేవుడి గురించి కఠోర తపస్సు చేసి, తనలాంటి ఆకారంతో ఉన్న వారి చేతిలో మాత్రమే తనకి మరణం సంభవించేలా వరాన్ని పొందాడు.

వరగర్వంతో సత్పురుషుల హింస
బ్రహ్మ నుంచి పొందిన వరగర్వంతో హయగ్రీవుడు సాధు సత్పురుషులను హింసించ సాగాడు. హయగ్రీవుని ఆగడాలను భరించలేక దేవతలంతా ఆది దంపతులైన శివపార్వతులను శరణు వేడారు. అప్పుడు పార్వతీదేవి దక్షిణాయన పుణ్యకాలం సందర్భంగా యోగ నిద్రలో వున్న విష్ణువును మేల్కొలిపితే ఆయనే హయగ్రీవుడిని సంహరిస్తాడని దేవతలకు ఉపాయం చెప్పింది.

విష్ణువును మేల్కొల్పిన పరమశివుడు
దేవతలంతా శ్రీమహావిష్ణువు దగ్గరకు వచ్చేసరికి విష్ణుమూర్తి తన విల్లు చివరి భాగాన్ని గడ్డం కింద పెట్టుకుని నిద్రిస్తున్నాడు. ఆయనను మేల్కొల్పడం కోసం శివుడు చెద పురుగుగా మారి వింటి తాడును తెంపాడు. దానితో వింటి తాడు తెగి, విల్లు పైకి ఎగదన్నడంతో శ్రీ మహావిష్ణువు తల ఆయన శరీరం నుంచి వేరై పోయింది. నారాయణుని ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న ఆది దంపతులు గుర్రం తలను తెప్పించి శ్రీ మహావిష్ణువు దేహానికి అమర్చారు. అమ్మవారితో సహా దేవాది దేవతలు తమ జ్ఞానాన్ని, శక్తి సామర్ధ్యాలను గుర్రం తల గల శ్రీ మహావిష్ణువుకి ధారపోశారు. అంతట శ్రీ మహావిష్ణువు హయగ్రీవుని సంహరించి తన అవతార కార్యాన్ని నెరవేర్చి లక్ష్మీ సమేతుడై దేవతలకు దర్శనమిచ్చాడు.

అందుకే హయగ్రీవుడు జ్ఞానప్రదాత
దేవాది దేవతలు తమ జ్ఞానాన్ని, శక్తి సామర్ధ్యాలను గుర్రం తల గల శ్రీ మహావిష్ణువుకి ధారపోసిన కారణంగానే హయగ్రీవ స్వామి విద్యలకు అధిపతిగా, జ్ఞాన ప్రదాతగా పూజలు అందుకుంటున్నాడు.

హయగ్రీవుని పూజ ఎలా చేయాలి?
హయగ్రీవ జయంతి రోజు సోమవారం వచ్చింది కాబట్టి ఆరోజు ఉదయం 7:30 లోపు కానీ, 9 గంటల తర్వాత కాని పూజ చేసుకోవచ్చు. ఈ రోజు లక్ష్మీ సమేతుడైన హయగ్రీవ స్వామిని షోడశోపచారాలతో, అష్టోత్తరాలతో పూజించాలి. హయగ్రీవునికి యాలకులు ప్రీతికరమైనవి. అందుకే స్వామికి యాలకుల మాలను సమర్పించి, శనగలతో చేసిన గుగ్గిళ్ళు, లడ్డూలు తయారు చేసి నివేదించాలి. తెల్లని పూలతో పూజించాలి. శ్రావణ పౌర్ణమి నాడు హయగ్రీవ పూజ చేయడం సర్వ శ్రేష్ఠం. పూజ చేసేవారు ఈ రోజు ఉప్పులేని ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలి.

విద్యార్థులకు జ్ఞానప్రదాత
హయగ్రీవ జయంతి రోజు విద్యార్థులు "జ్ఞానానంద మయం దేవం, నిర్మలస్ఫటికాకృతమ్‌ ఆధారం సర్వ విద్యానాం, హయగ్రీవ ముపాస్మహే" అనే శ్లోకాన్ని 11 సార్లు పారాయణ చేసి లక్ష్మీ సమేతుడైన హయగ్రీవుడిని ఆరాధిస్తే వారు జ్ఞానసిద్ధి కలిగి విద్యయందు రాణిస్తారనీ, విజయంతో పాటుగా సంపదలను పొందుతారని సాక్షాత్తు జగజ్జనని అయిన పార్వతి దేవి వరం ఇచ్చింది.

అన్యాయానికి న్యాయం
హయగ్రీవ జయంతి అయిన శ్రావణ పౌర్ణమి రోజు లక్ష్మీ సమేతుడైన హయగ్రీవ స్వామిని పూజిస్తే కేవలం విద్య మాత్రమే కాదు, అన్యాయం జరిగిన వారికి న్యాయం జరుగుతుంది. భూవివాదాలు ఏమైనా ఉంటే అవి త్వరలో పరిష్కరించ బడుతాయి. శత్రు వినాశనం కూడా జరుగుతుంది. రానున్న హయగ్రీవ జయంతి రోజు మనం కూడా హయగ్రీవుని పూజిద్దాం. జ్ఞానమనే ఐశ్వర్యంతో పాటు సుఖశాంతులను పొందుదాం. ఓం శ్రీ హయగ్రీవ స్వామినే నమః

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.