Ganesh Chaturthi 2024 Pooja Timings: విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి జన్మదినమే వినాయకచవితి. ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్ష చవితి రోజున దేశవ్యాప్తంగా ఈ పండగను అంగరంగ వైభవంగా ప్రజలు జరుపుకొంటారు. ఆది దంపతుల(శివ, పార్వతులు) మొదటి కుమారుడైన గణపతిని పూజించనిదే ఏ పనీ ప్రారంభించరు. గణేశుడి కృప ఉంటే అన్నీ విజయాలే లభిస్తాయనేది ప్రజల నమ్మకం. అయితే ఈసారి వినాయక చవితి ఎప్పుడు వచ్చింది? పూజా టైమింగ్స్ ఏంటి? చంద్రుడిని ఏ సమయంలో చూడకూడదు? ఎలాంటి వస్త్రాలు ధరించాలి? ఎటువంటి దీపాలు పెట్టాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
వినాయక చవితి ఎప్పుడు: గణేశ్ చతుర్థిని ప్రతి సంవత్సరం భాద్రప్రద మాసం శుక్ల పక్షం చవితి రోజున జరుపుకుంటాం. అయితే ఈ సంవత్సరం చవితి తిథి సెప్టెంబర్ 6 తేదీన అలాగే సెప్టెంబర్ 7వ తేదీన.. రెండు రోజుల పాటు ఉందని ప్రముఖ జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. అయితే ధృక్ సిద్ధాంతం ప్రకారం సెప్టెంబర్ 7వ తేదీ శనివారం రోజు వినాయక చవితి నిర్వహించుకోవాలని సూచిస్తున్నారు.
పూజా టైమింగ్స్: వినాయకుడి పూర్తి అనుగ్రహం కలగాలంటే పండగ నాడు ప్రత్యేకమైన సమయంలో వరసిద్ధి వినాయక వ్రత కల్పం చేసుకోవాలని అంటున్నారు. ఆ టైమింగ్ చూస్తే.. ఉదయం సమయంలో పూజ చేసుకునేవారు వినాయక చవితి రోజు ఉదయం 11:03 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల మధ్యలో ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చంటున్నారు. ఉదయం పూజ చేసుకోలేని వారు సాయంత్రం కూడా పూజ చేసుకోవచ్చని చెబుతున్నారు. ఆ సమయం సాయంత్రం 6:22 గంటల నుంచి రాత్రి 7:30 గంటల మధ్యలో వరసిద్ధి వినాయక వ్రత కల్పం చేసుకోవచ్చని చెబుతున్నారు.
వినాయక చవితి రోజు ఏ రాశివారు ఏ ప్రసాదం పెట్టాలి? - ఏ రంగు గణపతిని పూజిస్తే అదృష్టం?
ఏ రంగు వస్త్రాలు ధరించాలి: వినాయక చవితి రోజు ఈ రంగు కలిగిన దుస్తులు ధరిస్తే విఘ్నేశ్వరుడి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందని కిరణ్ కుమార్ అంటున్నారు. వినాయకుడికి ఎరుపు రంగు వస్త్రాలంటే ప్రీతిపాత్రమని.. పండగ రోజున ఈ రంగు వస్త్రాలు ధరిస్తే మంచిదని చెబుతున్నారు. అదేవిధంగా.. వినాయక చవితి శనివారం వచ్చింది కాబట్టి.. శనివారానికి అధిపతి శనేశ్వరుడు కాబట్టి.. ఆయనకు ఇష్టమైన నీలం రంగు దుస్తులు ధరించినా మంచిదని చెబుతున్నారు. కాబట్టి పండగ నాడు ఎరుపు లేదా నీలం రంగు వస్త్రాలు ధరిస్తే మంచి ఫలితాలు కలుగుతాయని అంటున్నారు.
ఈ సమయంలో చంద్రుడిని చూడకూడదు: వినాయక చవితి రోజున చంద్రుడిని చూడకూడదని పెద్దలు చెబుతారు. అయితే ఈ సంవత్సరంలో రెంజు రోజుల పాటు చవితి తిథి ఉండటం వల్ల.. ఈ రెంజు రోజుల్లో ప్రత్యేకమైన టైమింగ్స్‌లో చంద్రుడిని చూడకూడదని అంటున్నారు. ఆ టైమింగ్స్ చూస్తే..
సెప్టెంబర్ 6 తేదీన.. రాత్రి 8:16గంటలకు వరకు చంద్రుడిని చూడకూడదు.
సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 8:45గంటల వరకు ఆకాశంలో చంద్రదర్శనం చేసుకోవద్దు.
వినాయక చవితి రోజున తెల్లకాగితంపై ఈ అంకెలు రాసి పర్సులో పెట్టుకుంటే - మీకు ఏ కష్టాలూ రావు!
ఏ దీపం వెలిగించాలి: వినాయక చవితి పండగ నాడు ప్రత్యేకమైన దీపాన్ని వెలిగిస్తే మంచిదని చెబుతున్నారు. అదే జిల్లేడు ఒత్తుల దీపం. చవితి రోజు ప్రమిదలో కొబ్బరినూనె పోసి 5 జిల్లేడు ఒత్తులు విడిగా వేసి దీపం పెడితే వినాయకుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని అంటున్నారు. అలాగే పండగ నాడు 21 పత్రాలతో గణపతిని పూజించడం వీలుకాని వారు.. దుర్వాయుగ్మం అంటే గరిక పోచల జంటను వినాయకుడికి సమర్పిస్తే 21 ప్రతాలతో ఆయనను పూజించిన ఫలితం కలుగుతుందని అంటున్నారు.
చదవాల్సిన మంత్రం: గణేశ్ చతుర్థి రోజున రెండు మంత్రాలు ప్రతిఒక్కరూ చదవాలని పండితులు మాచిరాజు కిరణ్ కుమార్ అంటున్నారు. అందులో
మొదటిది.. గం క్షిప్ర ప్రసాదనాయ నమః
రెండో మంత్రం.. వక్రతుండాయ హుం
ఈ రెండు మంత్రాలను ఒక్కొక్క మంత్రం 21సార్లు చొప్పను చదువుకుంటే సంవత్సరం మొత్తం ఆటంకాలు, విఘ్నాలు ఉండవని.. మనసులోని కోరికలన్నీ నెరవేర్చుకోవచ్చని చెబుతున్నారు.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
'కాణిపాకం' బ్రహ్మోత్సవాలు- గణపయ్య ఏ రోజు ఏ వాహనంపై దర్శనమివ్వనున్నారో తెలుసా?
వినాయకుడి తొండం ఆ వైపు ఉంటే అదృష్టం! - ఈ రంగు విగ్రహాన్ని అసలే తీసుకోవద్దు!